తమ్మినేని వీరభద్రం
తమ్మినేని వీరభద్రం రాజకీయ నాయకుడు. సీపీఐ (ఎం) పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.
తమ్మినేని వీరభద్రం | |
---|---|
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | |
Assumed office 2014 మార్చి 8 | |
నియోజకవర్గం | ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం |
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ | |
In office 1996–1998 | |
నియోజకవర్గం | ఖమ్మం |
శాసన సభ సభ్యుడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ | |
In office 2004–2009 | |
ముఖ్యమంత్రి | వై.యస్. రాజశేఖరరెడ్డి |
నియోజకవర్గం | ఖమ్మం శాసనసభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1954 |
రాజకీయ పార్టీ | సీపిఐ (ఎం) |
జీవిత భాగస్వామి | ఉమ |
సంతానం | సంగమిత్ర (కొడుకు), డా. శృతి (కుమార్తె) |
ప్రారంభ జీవితం
మార్చుఖమ్మం జిల్లా తెల్దారుపల్లి గ్రామంలో కమలమ్మ, సుబ్బయ్యలకు ఆయన జన్మించాడు. వారిది కమ్యూనిస్టు కుటుంబం కావడంతో చిన్ననాటి నుంచే పార్టీ భావాలు అలవర్చుకున్న ఆయన ఉద్యమాల వైపు మళ్ళాడు. 1971లో సాధారణ కార్యకర్తగా సిపిఎంలో చేరి, రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా ఆయన ఎదిగాడు.[1]
రాజకీయ జీవితం
మార్చు1991లో మొదటిసారిగా ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి స్వల్ప తేడాతో ఆయన ఓటమి చెందాడు. అయితే, 1996లో అదే స్థానం నుండి పార్లమెంట్ కు ఎన్నికయ్యాడు. కాగా, 2004లో ఆయన ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి శాసన సభ్యునిగా ఎన్నికైయ్యాడు.
తమ్మినేని వీరభద్రం సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా 2021 జనవరి 25న మూడోసారి ఎన్నికయ్యాడు.[2] డిసెంబర్ 2022 నాటికి, ఆయన ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు.[3]
మూలాలు
మార్చు- ↑ Sakshi (20 December 2019). "'బీజేపీది పౌరులను విభజించే కుట్ర'". Sakshi. Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.
- ↑ Andhrajyothy (26 January 2022). "మూడోసారి తమ్మినేనికి సీపీఎం పగ్గాలు". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
- ↑ The Hindu. CPI(M) pays rich tributes to Puchalapalli Sundaraiah