తమ్మిన పోతరాజు కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. ఆయన 1953, 1962 లలో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికయ్యాడు. 1955 లో శాసనసభ్యునిగా పోటిచేసి ఓడిపోయాడు.[1]

జీవిత విశేషాలు మార్చు

ఆయన సమసమాజ నిర్మాణం కోసం పేద ప్రజలెదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కమ్యునిస్టు పార్టీ సిద్ధాంతాలే శరణ్యమని తన జీవితాంతం కృషి చేసిన కమ్యునిస్టు యోధుడు. విజయవాడ నగరంలోని కార్మికులను, అసంఘటిత రంగ శ్రామికులను ఐక్యపరచి వారి కనీస హక్కుల సాధనకై కృషి చేశారు. విజయవాడ నగరంలో కమ్యునిస్టు పార్టీ బలోపేతమైన శక్తిగా తీర్చిదిద్దటంలో అనన్యసామాన్యమైన పాత్ర నిర్వహించారు. వేలాదిమంది యువకులను ఉద్యమంలోకి తీసుకురావడం ద్వారా యువజనోద్యమం, మహిళా సంఘాలను నిర్మింరు. పేద ప్రజలకు నివాసాల కోసం రెవెన్యూ, పోరంబోకు భూముల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు అండగా నిలిచారు.[2] ప్రజల మన్ననలను పొందడం ద్వారా శాసనసభ్యులుగా చట్టసభల్లో ప్రజావాణిని వినిపించటమే కాకుండా ప్రత్యక్ష పోరాటాలలో మమేకమైన వ్యక్తిగా పోతరాజు తిరుగులేని నాయకునిగా ఎదిగారు.

మూలాలు మార్చు

  1. "List of Successful Candidates in Andhra Pradesh Assembly Election in 1955". Archived from the original on 2019-07-02. Retrieved 2016-06-07.
  2. ఉద్యమాలే ఊపిరిగా పరితపించిన తమ్మిన[permanent dead link]

ఇతర లింకులు మార్చు