తలారి ఆదిత్య తారాచంద్రకాంత్

తలారి ఆదిత్య తారాచంద్రకాంత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

తలారి ఆదిత్య తారాచంద్రకాంత్
తలారి ఆదిత్య తారాచంద్రకాంత్


ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 – 2019
ముందు హెచ్.హేమలత
తరువాత కోనేటి ఆదిమూలం
నియోజకవర్గం సత్యవేడు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1984 జూన్ 8
సత్యవేడు, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు తలారి మనోహర్‌
సంతానం 1
పూర్వ విద్యార్థి ఎం.ఎస్.సి

జననం, విద్యాభాస్యం

మార్చు

తలారి ఆదిత్య 1984 జూన్ 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, సత్యవేడు లో జన్మించాడు. ఆయన ఎమ్మెస్సీ వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం

మార్చు

తలారి ఆదిత్య ఎమ్మెస్సీ పూర్తి చేశాక రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం పై 4,227 ఓట్ల మెజారిటితో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లైబ్రరీ కమిటీలో సభ్యుడిగా, అసెంబ్లీ ప్యానల్ స్పీకర్‌గా పని చేశాడు.

ఎమ్మెల్యేగా పలు అభివృద్ధి పనులు

మార్చు
  • సత్యవేడు ప్రభుత్వాస్పత్రిని 50 పడకల స్థాయికి పెంచి, అభివృద్ధికి రూ. 7 కోట్లు మంజూరు చేయించాడు.
  • రూ.20కోట్లతో కడూరు క్రాస్‌-చిన్న పాండూరు మధ్య రోడ్డు విస్తరణ
  • రూ. 12 కోట్లతో చిన్నపాండూరు-పీవీపురం రోడ్డు విస్తరణ
  • రూ.20కోట్లతో చిన్నపాండూరు-సత్యవేడురోడ్డు విస్తరణ
  • రూ.12 కోట్లతో పుత్తూరు-చెన్నై హైవే రోడ్డుకు మరమ్మతులు
  • రూ. 20 కోట్లతో పిచ్చాటూరు - శ్రీకాళహస్తి రోడ్డు విస్తరణ
  • రూ. 10 కోట్లతో సత్యవేడులోసమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు మంజూరు
  • మినీ క్రికెట్‌ స్టేడియం .
  • పౌరసరఫరాల గిడ్డంగి నిర్మాణం[2]

మూలాలు

మార్చు
  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. Andhra Jyothy (26 May 2018). "సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య ప్రోగ్రెస్ రిపోర్ట్". Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.