తవ్వా ఓబుల్ రెడ్డి
తవ్వా ఓబుల్ రెడ్డి కడప జిల్లాకు చెందిన రచయిత, పాత్రికేయుడు. వీరి కథలు ప్రముఖ దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. వీరు ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఇరవై కిపైగా కథలు, యాభై కవితలు, వందలాది వ్యాసాలను రచించారు. వీరు రచించిన గండికోట పుస్తకానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ రచయిత పురస్కారం లభించింది. ఓబుల్ రెడ్డి రచనలు ప్రధానంగా రాయలసీమ యాసలో సాగుతాయి. ఎక్కువగా రైతు సంబంధిత కథలు రాస్తుంటారు.
తవ్వా ఓబుల్ రెడ్డి | |
---|---|
జననం | తవ్వా ఓబుల్ రెడ్డి |
వృత్తి | ప్రభుత్వ ఉపాధ్యాయుడు రచయిత |
తల్లిదండ్రులు |
|
నేపథ్యము
మార్చుఓబుల్ రెడ్డి కడప జిల్లా ఖాజీపేట మండలం బక్కాయపల్లె గ్రామంలో జన్మించారు. తల్లిపేరు గంగమ్మ, తండ్రి పేరు ఓబుల్ రెడ్డి. వీరు తెలుగు భాషోద్యమ కారుడిగా, చరిత్ర పరిశోధకుడిగా వ్యవహరిస్తున్నారు. పత్రికలలో అనేక సామాజిక అంశాలపై వ్యాసాలు రాస్తూ ఉంటారు. గతంలో ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రికలలో సబ్ ఎడిటర్, పాత్రికేయుడిగా పనిచేసారు.
రచనలు
మార్చు- కడుపాత్రం మరో పద్దెనిమిది కథలు (కథాసంపుటి)
- గండికోట చరిత్ర[1]
మూలాలు
మార్చు- ↑ Subramanyam, M. V. (2014-07-14). "'89 historic, heritage places identified in Kadapa district'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-11-23.