తాడి సన్యాసినాయుడు

తాడి సన్యాసినాయుడు గజపతినగరం శాసన సభ నియోజకవర్గం నకు 1959,62లలో ప్రాతినిధ్యంవహించిన శాసన సభ్యుడు.[1]

జీవిత విశేషాలు

మార్చు

తాడ్డి సన్యాసినాయుడు విజయనగరం జిల్లా గజపతినగరం నకు చెందిన రాజకీయ నాయకుడు. అతనికి అనేక దశాబ్దాల రాజకీయ జీవితం ఉంది. 1959లో సోషలిస్ట్ పార్టీ తరపున పోటీ చేసి, ఆ తర్వాత 1962 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించాడు[2]. అతని బాటలోనే అతని పెద్ద కుమారుడు తాడ్డి వెంకటరావు కూడా 1999లో గజపతినగరం నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందాడు. సన్యాసి నాయుడు 2005 వరకు కాంగ్రెస్ పార్టీలో చురుకుగా ఉన్నాడు. ఆ తర్వాత రాజకీయాల నుండి విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు.

అతను 2023 జూన్ 18న తన 90వ యేట విశాఖపట్నంలో మరణించారు.

మూలాలు

మార్చు
  1. "Former Gajapathinagaram MLA Taddi Sanyasi Naidu passes away". ap7am.com (in ఇంగ్లీష్). 2023-06-19. Archived from the original on 2023-06-25. Retrieved 2023-06-25.
  2. "Andhra Pradesh Assembly Election Results in 1962". Elections in India. Retrieved 2023-06-25.