తానికాయ ఆయుర్వేద ఔషధాల తయారీలో అనేక విధాలుగా వాడబడుతుంది. దీని శాస్త్రీయ నామము -"తెర్మినలియా బెల్లిరికా".

Terminalia bellirica
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
T. bellirica
Binomial name
Terminalia bellirica

ఔషధ గుణాలు

మార్చు

కఫా వ్యాదులపై బాగా పనిచేస్తుంది, ఉప్పు తప్ప మిగిలిన ఇదు రుచులు కలిగి ఉంటుంది . వేడి చేస్తుంది . జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, మూత్ర మండలం దీని పరిదిలోనికి వస్తాయి. ఆరోగ్య ప్రదాయిని తానికాయ. దీనిని అచ్చ తెలుగులో వాక కాయలుగానూ పిలుస్తుంటారు. తెర్మినలియా బెల్లిరికా శాస్త్రీయ నామం కలిగిన ఈ వృక్ష సంతతి ఆయుర్వేద వైద్యంలోనే కాదు వంటింటి చిట్కా వైద్యాలలోనూ తనదైన ఫలితాలను అందిస్తూ.... సామాన్యులకి చేరువగా ఉంటోంది. త్రిఫలములలో తానికాయ ఒకటి. త్రిదోషాలను హరించే శక్తి తానికాయకు ఉంది.తీవ్రమైన వేడిని కలిగించే ఈ కాయలు మన రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో కనిపిస్తు న్నాయి. బాదం చెట్టును పోలి ఉండి అదే తరహా ఆకులతో ఆకుపచ్చ ఛాయ కలిగి, లేత పసుపు రంగు న్న పుష్పాలు, నక్షత్ర ఆకారపు చిన్నపాటి కంకులని కలిగి ఉంటుంది. చిన్న సైజులో ఆకుపచ్చ ద్రాక్షపళ్లను పోలి ఉండే ఈ తాని కాయలు గుండ్రంగా ఉండి.. కాస్త ఫలాలుగా మారాక ఉసిరి కాయ సైజులో మట్టిరంగులో కనిపిస్తాయి. ఉప్పు మినహా దాదాపు అన్ని రకాల రుచుల్ని కలిగి ఉన్న ఈ తాని కాయలు శ్వాస సంబంధిత వ్యాధులకు, జీర్ణ వ్యవస్ధలో వచ్చే రుగ్మతలను నివారించేందుకు ఉపయోగ పడుతుంది. ఇక మూత్ర మండలం శుభ్రపరిచేందుకు కూడా వీటిని ఆయుర్వేద వైద్యులు ఉపయోగిస్తారు. లివర్‌కి సంబంధించిన టానిక్‌ల తయారీలోనూ... అజీర్ణానికి చెందినమందుల తయారీలోనూ, దగ్గు, కఫం, క్షయ, ఆస్తమా, ఎలర్జీలను నివారణ కోసం తానికామ మంచి మందుగా వాడబడుతోంది. డయేరియా, డీసెంట్రీ, చిన్న పేగుల వాపు తదితర వ్యాధులు తగ్గటానికి, ఉదర వ్యాధులను శాంత పరిచేందుకు, కేశ సంపదని పెంపొందించేందుకు, జుట్టు నల్ల బడేందుకు, కంటి చూపుకు సంబంధించిన వ్యాధుల నివారణకు ఇది అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. తానికాయలలో వేడి చేసే గుణం మూల శంకలను నివారించేందుకు, అతిసారాన్ని అరికట్టేందుకు వాడబడుతోంది. ఇక త్రిఫల కషాయంగా దీన్ని తీసుకుంటే శూలాలను తగ్గించడమే కాకుండా మెదడు చురుకుగా పని చేసేందుకు ఉపయోగ పడుతుంది. తానికాయల కషాయానికి అశ్వగంధ చూర్ణాన్ని, బెల్లంతో కలిపి సేవిస్తే వాతం తగ్గుతుంది, దీనిలోని ఎలాజిక్‌ యాసిడ్‌, గ్లూకోజ్‌, సుగర్‌, మైనిటాల్‌, గ్లాక్టోజ్‌, ఫ్రక్టోజ్‌, రమ్‌నోస్‌, ఫాటియాసిడ్లు, గాలిక్‌ యాసిడ్‌, బెటాసిటోస్టిరాల్‌, తదితర వైద్యలక్షణాలు కలిగిన మందులు చాలా ఉన్నాయి. ఇక తాని కాయల గింజలు కూడా వైద్య పరంగా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇందులో ఆక్సాలిస్‌ యాసిడ్లు, ప్రోటీన్‌లున్నాయి. తానికాయలని కాస్త కాల్చి చూర్ణంగా చేసుకొని, కాసింత సైంధవ లవణాన్ని కల్పి సేవిస్తే విరోచనాలు క్షణాలలో తగ్గిపోతాయి, అలాగే సర్పి అనే చర్మ వ్యాధితో బాధ పడేవారు తానికాయని అరగదీసి, ఆగంధాన్ని లేపనంగా పూస్తే ఉపసమనం దక్కుతుంది. తానికాయ చూర్ణాన్ని తేనెతో కల్సి తీసుకుంటే దగ్గు, ఉబ్బసం తదితరాలనుండి ఉపశమనం లభించడమే కాకుండా శ్వాస సంబంధిత ఇబ్బందులను, కఫదోషాలు తొలగిస్తుంది

 
తానికాయలు

ఉపయోగములు :

మార్చు
  • యాంటి హేల్మెంతిక్ (నులి పురుగులు నివారణకు), యంతిస్పమోదిక్, యాన్తి పైరేతిక్గా (శరీర వేడిని నిరోధి౦చుటకు) పనిచేస్తుంది,
  • దగ్గు, క్షయ, ఆస్తమా, ఎలర్జీ లను నయం చేస్తుంది,
  • డయేరియా, డీసెంట్రీ, చిన్న ప్రేవుల వాపు తగ్గేందుకు వాడుతారు,
  • జీర్ణ కారి, లివర్ టానిక్, అజీర్ణం తగ్గిస్తుంది,
  • కంటి చూపు,కేశ సంపద కాపాడుతుంది,
  • జ్రుదయ వ్యాదుల్ని శాంత పరుస్తుంది,
  • కఫప్రకోపాన్ని కంట్రోల్ చేసి సంబంధిత వ్యాదులను తగ్గిసుంది,

చిత్ర మాలిక

మార్చు

మూలాలు

మార్చు

యితర లింకులు

మార్చు
  • Caldecott, Todd (2006). Ayurveda: The Divine Science of Life. Elsevier/Mosby. ISBN 0-7234-3410-7. Contains a detailed monograph on Terminalia belerica (Bibhitaki) as well as a discussion of health benefits and usage in clinical practice. Available online at https://web.archive.org/web/20110515075816/http://www.toddcaldecott.com/index.php/herbs/learning-herbs/389-bibhitaki
"https://te.wikipedia.org/w/index.php?title=తానికాయ&oldid=4102195" నుండి వెలికితీశారు