తానియా

పంజాబీ సినిమా నటి

తానియా, పంజాబీ సినిమా నటి.[2] రెండు బ్రిట్ ఆసియా టీవీ అవార్డులకు నామినేట్ చేయబడిన తానియా, 2018లో వచ్చిన క్విస్మాత్ సినిమాలో నటనకు "ఉత్తమ సహాయ నటి"గా అవార్డును గెలుచుకుంది.[3]

తానియా
తానియా
జననం (1993-05-06) 1993 మే 6 (వయసు 31)[1]
విద్యాసంస్థగురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2018-ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
క్విస్మాత్, సుఫ్నా
గుర్తించదగిన సేవలు
గుడ్డియాన్ పటోలే
రబ్ డా రేడియో 2
వెబ్‌సైటుఇన్‌స్టాగ్రాం లో తానియా

జననం, విద్య

మార్చు

తానియా 1993 మే 6న జార్ఖండ్ రాష్ట్రం, జంషెడ్‌పూర్‌ పట్టణంలోని పంజాబీ కుటుంబంలో జన్మించింది. అమృత్‌సర్‌లో పెరిగింది.[4] అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం, బిబికె డావ్ మహిళా కళాశాలలో చదివింది. కళాశాలలో 2012 నుండి 2016 వరకు ప్రతి సంవత్సరం "బెస్ట్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్" అవార్డును గెలుచుకుంది.[5] ఇంటీరియర్ డిజైనింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పట్టా పొందింది.[4] క్లాసికల్ డాన్సర్ గా జాతీయస్థాయి కార్యక్రమాలలో పాల్గొన్నది.

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2018 క్విస్మాత్ అమన్ తొలిచిత్రం
మంజీత్ సింగ్ కుమారుడు సిమ్రాన్
2019 గుడ్డియాన్ పటోలే నికోల్
రబ్ డా రేడియో 2 రాజీ
2020 సుఫ్నా తేజ్ ప్రధాన నటిగా అరంగేట్రం
2021 క్విస్మాత్ మజాజ్ కౌర్ [6]
2022 లేఖ రోనక్
బజ్రే దా సిట్టా చిత్రీకరణ[7]

సంగీత వీడియోలు

మార్చు
పేరు సంవత్సరం కళాకారుడు(లు) వీడియో డైరెక్టర్ కంపనీ ఇతర వివరాలు
"తేరీ మేరీ లడాయి" 2020 మణిందర్ బుట్టర్ రాహుల్ చాహల్ వైట్ హిల్ సంగీతం #జుగ్నీ ఆల్బమ్ నుండి
యు & మీ గిప్పీ గ్రెవాల్ బల్జీత్ సింగ్ డియో -ిసిరీస్ సింగిల్
"క్యా బాత్ ఆ" కరణ్ ఔజ్లా సుఖ్ సంఘేరా రెహాన్ రికార్డ్స్ యూట్యూబులో 200మి + వీక్షణలు
"తేరి జట్టి" 2022 అమ్మీ విర్క్ మహి సంధు బర్ఫీ సంగీతం

అవార్డులు, నామినేషన్లు

మార్చు
సంవత్సరం సినిమా అవార్డు విభాగం ఫలితం
2019 క్విస్మాత్ బ్రిట్ ఆసియా టీవీ అవార్డులు ఉత్తమ సహాయ నటి గెలుపు
ఉత్తమ తొలి ప్రదర్శన[3] ప్రతిపాదించబడింది

మూలాలు

మార్చు
  1. "Tania". www.facebook.com. Archived from the original on 4 June 2019. Retrieved 2022-05-05.
  2. "Happy Birthday Tania: 5 times when the actress won our hearts". The Times of India (in ఇంగ్లీష్). 2021-05-06. Retrieved 2022-05-05.
  3. 3.0 3.1 Das, Kristina (2 April 2019). "BritAsia TV Punjabi Film Awards 2019: Gippy Grewal and Sonam Bajwa win big, winners list out!". spotboye.com. Retrieved 2022-05-05.
  4. 4.0 4.1 "After declining a Bollywood offer, here's how Tania managed to bag Punjabi films!". in.com (in ఇంగ్లీష్). 6 March 2019. Archived from the original on 28 April 2019. Retrieved 2022-05-05.
  5. "Fresh Face, Big dreams". The Tribune. 23 September 2018. Archived from the original on 2019-05-01. Retrieved 2022-05-05.
  6. "Ammy Virk and Sargun Mehta starrer 'Qismat 2' goes on the floor - Times of India". The Times of India. Retrieved 2022-05-05.
  7. "Bajre Da Sitta: Ammy Virk and Tania kick start the shoot of their new movie - Times of India". The Times of India. Retrieved 2022-05-05.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=తానియా&oldid=4348333" నుండి వెలికితీశారు