పంజాబీ సినిమా(భారతదేశం)
పంజాబీ సినిమా(పంజాబీ: ਪੰਜਾਬੀ ਸਿਨੇਮਾ), సాధారణంగా పాలీవుడ్ అని అంటారు.[1][2][3][4] పాకిస్థాన్, భారతదేశాల్లోని పంజాబీ భాషా సినిమా రంగాన్ని పాలీవుడ్ అని పిలుస్తారు. 20వ శతాబ్ద పంజాబీ సినిమా రంగం పాకిస్థాన్ కేంద్రంగా సాగింది. కానీ 21వ శతాబ్ద పంజాబీ సినిమా మాత్రం భారతదేశం కేంద్రంగా నడుస్తోంది.
మొట్టమొదటి పంజాబీ సినిమా కలకత్తా లో నిర్మించి, అప్పటి పంజాబ్ బ్రిటిష్ ప్రావిన్స్ కు రాజధాని లాహోర్ లో విడుదలైంది. పాకిస్థాన్ లోని లాహోర్ సినిమా రంగానికి లాలీవుడ్ అని పేరు. లాహోర్, హాలీవుడ్ కలిసి లాలీవుడ్ అనే పదం తయారైంది.
2009కల్లా పంజాబీ సినిమా రంగం 900 నుండి 1000 సినిమాలు నిర్మించింది.[5] 1970లలో సగటున 9, 80ల్లో 8, 90లలో 6 సినిమాలు విడుదలయ్యాయి. 1995లో దాదాపు 11 సినిమాలు, 1996లో 7, 1997లో 5 సినిమాలు విడుదల చేసింది పాలీవుడ్. 2000 దశాబ్దం నుంచి పంజాబీ సినిమా ప్రతీ సంవత్సరం పెద్ద బడ్జెట్లతో సినిమాలు చేయడం మొదలు పెట్టింది.
మొదటి సినిమా
మార్చుకె.డి.మెహ్రా మొట్టమొదటి టాకీ సినిమా షీలా/పింద్ దీ కుడీ సినిమాను 1935లో తీశారు.[6] నూర్ జహాన్ మొదటిసారిగా కథానాయికగా, గాయనిగా పరిచయమైంది. ఈ సినిమాను కలకత్తాలో నిర్మించి మొదటిసారిగా లాహోర్ లో విడుదల చేశారు. లాహోర్ ప్రావినెన్స్ లో ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది.[7] ఈ సినిమా విజయం సాధించడంతో మరికొంత మంది నిర్మాతలు పంజాబీ భాషలో సినిమా చేయడానికి ముందుకొచ్చారు.[8] ఎం.ఎం.బిల్లూ మెహ్రా సహాయ దర్శకునిగా, కె.డి.మెహ్రా పంజాబీ భాషలో తన రెండో సినిమా హీర్ సియాల్(1938) తీశారు. ఈ సినిమాలో నూర్ జహాన్ తో పాటు, ఇద్దరు కొత్త నటులు బాలూ, ఎం.ఇస్మాయిల్ కూడా ఉన్నారు. ఈ సినిమా కూడా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది.[9]
లాహోర్, పంజాబ్ లలోని విస్తారమైన పంజాబీ సంఘం వల్ల పంజాబీ సినిమా రంగం త్వరగానే ప్రాముఖ్యతను సంతరించుకుంది. బాంబే, కలకత్తా ల నుండి కళాకారులు, నిర్మాతలు, దర్శకులు లాహో ర్ కు మకాం మార్చారు. పలు స్టూడియోలు కూడా నిర్మించారు. శాంతా ఆప్టే, మోతీలాల్, చంద్రమోహన్, హీరాలాల్, నూర్ జహాన్, ముంతాజ్, శాంతి, వాలీ, సయ్యద్ అత్తహుల్లహ్ షా హష్మీ, కృష్ణకుమార్, శంకెర్ హుస్సేన్, బల్దేవ్ రాజ్ చోప్రా తదితర టెక్నీషియన్లు పంజాబీ సినిమా రంగంలో నిలదొక్కుకోవడం మొదలు పెట్టారు. దర్శకుడు బల్దేవ్ రాజ్ చోప్రా సినీ హెరాల్డ్ అనే పత్రిక ప్రారంభించారు. ఆ తరువాత దర్శకుడు రామానంద్ సాగర్ కూడా ఈవెనింగ్ న్యూస్ అనే పత్రిక మొదలు పెట్టారు. సయ్యద్ అత్తహుల్లహ్ షమ్మీ కూడా అదాకర్ అనే సినిమా పత్రికలో పనిచేశారు.
పంజాబ్ విభజన
మార్చు1947లో, భారతదేశం భారత్, పాకిస్థాన్గా విడిపోయింది. పంజాబ్ ప్రాంతం కూడా రెండుగా విడిపోయింది. పశ్చిమ పంజాబ్ పాకిస్థాన్ లోకి, తూర్పు పంజాబ్ భారత్ లోకి కలిసిపోయాయి. విభజన ప్రభావం పంజాబీ సినిమా రంగంపై కూడా పడింది. ముస్లిం కళాకారులు లలీవుడ్ కు, సిక్కులు, హిందువులు ముంబైకు తరలిపోయారు.
1950లు
మార్చుపంజాబీ సినిమా రంగాన్ని నిలబెట్టడానికి ఆ సమయంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. పోస్తీ, దో లచ్చియన్, భాంగ్రా వంటి సినిమాలు విజయం సాధించినా, పంజాబీ సినిమా రంగన్ని నిలబెట్టలేకపోయాయి. ఈ సినిమాల్లోని పాటలు చాలాకాలం రేడొయోల్లో రావడం వల్ల సినిమాలకు విపరీతమైన ప్రజాభిమానం పెరిగింది.[10]
దేశ విభజన తరువాత కామెడీ ట్రెండ్ నడిచింది. సుందర్, నిషిలు నటించిన, ముల్క్ రాజ్ భక్రీ దర్శకత్వంలో, 1958లో విడుదలైన భాంగ్రా కామెడీ హిట్ సినిమా. అదే సినిమాను 1980లో దర్శకుడు మోహన్ భక్రీ, మెహర్ మిట్టల్, అపర్ణ చౌదరిలతో కలసి జట్టీగా రీమేక్ చేశారు. ఈ సినిమా కూడా కమర్షియల్ గా విజయం సాధించింది. ఈ సినిమాకు బాణీలు హంస్ రాజ్ బెల్, సాహిత్యం వర్మ మలిక్ అందించారు. షంషాద్, మహ్మద్ రఫీ లు పాడిన "బట్టి బాల్కే బనెరే ఉట్టే రక్దీ హాన్", "చిట్టే దండ్ హస్నన్ నియాన్ రెహ్ందే" వంటి పాటలు ప్రజల్లోకి విపరీతంగా చేరాయి. 1957లో తీసిన జానీవాకర్ సినిమా కూడా పెద్ద హిట్.
1960లలో
మార్చు1964లో దర్శకుడు పదమ్ ప్రకాశ్ మహేశ్వరి తీసిన భారీ బడ్జెట్ రొమాంటిక్ పంజాబీ సినిమా "సట్లజ్ దే కండే" భారీ హిట్ గా నిలిచింది. బాల్రాజ్ సహ్ని, నిషి వస్టి, మీర్జా ముషారఫ్ నటించిన ఈ సినిమాకు హంస్రాజ్ బెల్ బాణీలు అందించారు. ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాని దూరదర్శన్ లో అత్యధికంగా 3సార్లు ప్రదర్శించారు.
1969లో విడుదలైన నానక్ నామ్ జహజ్ హై సినిమా విభజన తరువాత వచ్చిన అతి పెద్ద హిట్ సినిమా. పృథ్వీరాజ్ కపూర్, ఐ.ఎస్.జోహర్, విమ్మీ, సోమ్ దత్, నిషి, సురేశ్, డేవిడ్ అబ్రహమ్ లు నటించిన ఈ సినిమా భారత్ లోనూ, విదేశాల్లోనూ పంజాబీ సినిమా రంగ ప్రతిష్ఠ పెంచింది. ఈ సినిమా టికెట్ల కోసం ప్రజలు థియేటర్ల ముందు బారులు తీరారు.
70ల కాలం
మార్చునానక్ నామ్ జహజ్ హై సినిమా విజయం తరువాత మరిన్ని సినిమాలు మొదలయ్యాయి పంజాబీ సినిమా రంగంలో. హిందీ సినీ రంగంలోని పంజాబీలు వారి భాషలో సినిమాలు చేయడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. 1970లో కంకన్ దే ఒహ్లే(ధర్మేంద్ర, ఆశా పారేఖ్, రవీంద్ర కపూర్), నానక్ దుఖియా సబ్ సంసార్(దారా సింగ్, బలరాజ్ సాహ్ని, రామ్ మోహన్, ఆశా సచ్దేవ్) సినిమాలు విడుదలయ్యాయి. 1971లో మాత్రం ఒక్క సినిమా కూడా రిలీజవ్వలేదు. 1972లో మాత్రం మెలే మిత్రన్ దే సినిమా విడుదలైంది. 1973లో సునిల్ దత్, రాధా సలుజా నటించిన మన్ జీతే జాగ్ జీత్ సినిమా విడుదలైంది. 1974లో దోషేర్(ధర్మేంద్ర, రాజేంద్ర కుమార్), భగత్ ధన్నా జాత్(దారా సింగ్, ఫిరోజ్ ఖాన్), సచ్చా మేరా రూప్ హై(మన్మోహన్ కృషన్), దుఖ్ భంజన్ తేరా నామ్(షామిందర్ సింగ్, రాధా సలుజా) సినిమాలు విడుదలయ్యాయి. సునీల్ దత్, రాజేందర్ కుమార్, ధర్మేంద్ర, జానీ వాకర్, రంజిత్, దారా సింగ్ వంటి హిందీ సినీ ప్రముఖులు ఉండటం, మత, చారిత్రిక అంశాలు కలిగి ఉండటంతో దుఖ్ భాంజన్ తేరా నామ్ సినిమా పెద్ద హిట్ అయింది.[11]
ధర్మేంద్ర నటించిన తేరీ మేరీ ఇక్ జింద్రీ(1975) సినిమా ద్వారా తన కజిన్ వీరేంద్రను పరిచయం చేశారు. 1976లో దాజ్, గిద్దా, మై పాపీ తుం బక్షన్ హార్, పాపీ తారే అనేక్, సంతూ బంతూ, సర్దార్-ఇ-అజం, సవా లాక్ సే ఏక్ లదువాన్, తాక్రా, యమ్లా జట్ వంటి సినిమాలు విడుదలయ్యాయి. దారా సింగ్ నటించిన సవా లాక్ సే ఏక్ లదువాన్ సినిమా మాత్రం భారీ హిట్ నమోదు చేసింది. ఈ సినిమాలో రాజేశ్ ఖన్నా అతిధి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో ఫౌజ్-ఇ-ఖాస్ సైనికులు నకిలీ గెడ్డాలు తగిలించుకుని తిరిగే సన్నివేశాల వల్ల మతకలహాలు రేగాయి. 1977వ సంవత్సరం పంజాబీ సినిమా చరిత్రలో పెద్ద ప్రాముఖ్యత లేని సంవత్సరంగా చెప్పుకోవచ్చు. జై మాతాదీ, సాల్ సోల్వన్ ఛడ్యా, సాత్ శ్రీ అకల్, షాహీద్ కర్తర్ సింగ్ సారాభా వంటి సినిమాలు విడుదలైనా, నటి రేఖ అతిధి పాత్రలో కనిపించిన సాల్ సోల్వన్ ఛడ్యా సినిమా ఫరవాలేదనిపించింది. సునిల్ దత్, శతృజ్ఞ సిన్హా, ప్రేం నాథ్ లు నటించిన సాత్ శ్రీ అకల్ కూడా విజయం సాధించింది. 1978లో ఉదీకన్, ధ్యానీ భగత్, జై మాతా షెరన్ వాలీ, జింద్రీ యార్ దీ సినిమాలు విడుదల కాగా, ఉదీకన్ సినిమా హిట్ అయ్యింది. 1978లో పంజాబీ సినిమా రంగంలో మొట్టమొదటి రీమేక్ సినిమా విడుదలైంది. వలయాతీ బాబూ అనే సినిమాను జానీవాకర్ అదే పేరుతో తిరిగి నిర్మించారు. ఈ సినిమాలో మెహర్ మిట్టల్ హీరోగా నటించగా, అమితాబ్ బచ్చన్ అతిధి పాత్ర పోషించారు. 1979వ సంవత్సరం పంజాబీ సినిమా రంగంలో చెప్పుకోదగ్గది. గురు మానియో గ్రంథ్, జట్ పంజాబీ, కుంవారా మామా, సుఖీ పరివార్, తిల్ తిల్ డా లేఖా సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో గురు మానియో గ్రంథ్ సినిమా మంచి హిట్ సాధించింది. జట్ పంజాబీ సినిమాలో రాజేశ్ ఖన్నా ప్రత్యేక పాత్రలో అలరించారు. తిల్ తిల్ డా లేఖాతో పంజాబీ సినిమా రంగంలో హీరోగా మొదటి సారి నటించారు రాజేశ్ ఖన్నా. ఉత్తమ కథా రచయిత, రెండో ఉత్తమ చిత్రంగా పంజాబీ ప్రభుత్వ పురస్కారాలు అందుకుందీ సినిమా. పంజాబీ సినీ రంగంలో వంగార్(సవాలు) మొట్టమొదటి మిస్టరీ సినిమా. కానీ సినిమా బాగా ఆడలేదు.
1980లో
మార్చుChann Pardesi, 1980లో విడుదలైన చాన్ పరదేశీ సినిమా పంజాబీ సినీ చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం అందుకోవడమే కాక, ఆ సంవత్సరానికి అది అతి పెద్ద హిట్ గా నిలిచింది. రాజ్ బబ్బర్, రమా విజ్, అమ్రీష్ పురి, ఓంపురి, కుల్ భూషణ్ ఖర్బందా వంటి భారీ తారాగణంతో రూపొందిందీ చిత్రం. ఫౌజీ చాచా చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజీవ్ కపూర్ నటించారు. 1958లో ముల్క్ రాజ్ భక్రీ తీసిన భాంగ్రా సినిమాను మోహన్ భక్రీ దర్శకత్వంలో 1980లో జట్టీ పేరుతో రీమేక్ చేశారు. సుందర్, నిషి, మెహర్ మిట్టల్, అపర్ణ చౌదరి వంటి హేమాహేమీలు నటించిన ఈ చిత్రం పెద్ద హిట్ అయింది.
1981లో వీరేంద్ర నటించిన బల్బిరో బాబీ సినిమా ఒక్కటే హిట్ అయింది. 1985 సంవత్సరం ఉచా దార్ బాబే నానక్ డా, వీరేంద్ర నటించిన సర్పంచ్ వంటి రెండు హిట్ లను చూసింది. ఉచా దార్ బాబే సినిమాతో గురుదాస్ మాన్ హీరోగా పంజాబీ తెరకు పరిచయం అయ్యారు. 1983లో చాలా సినిమాలు విడుదలైనా పుట్ జట్టన్ దే సినిమా మాత్రం కమర్షియల్ గా మంచి హిట్ గా నిలిచింది. 1984లో వీరేంద్ర నటించిన యారీ జట్ దీ సినిమా కూడా పెద్ద హిట్. 50శాతం సినిమా విదేశాల్లో(యు.కె) నిర్మించిన మొట్టమొదటి పంజాబీ సినిమా ఇది. గురుదాస్ మన్ నటించిన మామ్లా గర్బర్ హై సినిమా కూడా మంచి విజయ నమోదు చేసుకుంది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ప్రసిద్ధమైనవే.
1985లో మొహమ్మద్ సాదిక్ నటించిన గుడ్డో, వీరేందర్ నటించిన వైరీ సినిమాలు ఆ సంవత్సరపు హిట్ లుగా నిలిచాయి. 1986లో రాజ్ బబ్బర్, గురుదాస్ మాన్, ఓంపురి, నినా డియోల్ నటించిన లాంగ్ డా లిష్కారా సినిమా పెద్ద హిట్ అయింది. 1987లో వీరేంద్ర పటోలా, జోర్ జట్ డా అనే సినిమాల్లో నటించారు. జట్ టే జమీన్ సినిమా షూటింగ్ సమయంలో వీరేంద్రను ఆయన శత్రువులు కాల్చి చంపారు. ఈ సంఘటన తరువాత పంజాబ్ అట్టుడికిపోయింది. ఈ సినిమాలో అప్పటిదాకా సహాయ నటులుగా ఉన్న గుగ్గు గిల్, యోగరాజ్ సింగ్ లు ప్రధాన పాత్రలు పోషించారు.
1988లో పెద్దగా సినిమాలు విడుదల కాలేదు. 1989లో రాజ్ బబ్బర్, పంకజ్ కపూర్, కన్వల్జిత్ సింగ్, పరీక్షిత్ సహ్ని, దీప్తీ నవల్ లు నటించిన మర్హి డా దేవా సినిమా విజయవంతం కావడమే కాక విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.
1990లు
మార్చు1990లో జగ్గు గిల్, యోగరాజ్ సింగ్, గురుదాస్ మన్, ధర్మేంద్ర, రాజ్ బబ్బర్, ప్రీతీ సర్పూలు నటించిన కుర్బానీ జట్ డీ విడుదలైంది. ప్రీతి సర్పూ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. వీరేంద్ర నటించిన ఆఖరి చిత్రం దుష్మనీ డీ ఆగ్ సినిమా కూడా పెద్ద హిట్. ఈ సినిమాలో గురుదాస్ మన్, ప్రీతీ సర్పూ కూడా నటించారు. 1991లో దల్జీత్ కౌర్, గుగ్గు గిల్ నటించిన అంఖ్ జట్టన్ డీ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా అప్పటిదాకా విలన్ పాత్రలు వేస్తున్న గగ్గు గిల్ హీరోగా పరిచయమయ్యారు. ఆ తరువాత వచ్చిన జోర్ జట్ డా సినిమా ఫరవాలేదనిపించినా, జగ్గు గిల్, యోగరాజ్ సింగ్, అమన్ నూరీ నటించిన బడ్లా జట్టీ డా సినిమా మాత్రం ఆ సంవత్సరానికే అతి పెద్ద హిట్ గా నిలిచింది. ఉదీకన్ సౌన్ దియాన్ సినిమా విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది. 1991లో సతీశ్ కౌల్, రమా విజ్, మెహర్ మిట్టల్, పాల్ రంధ్వా నటించిన సౌన్హ్ మెనూ పంజాబ్ డీ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు ప్రఖ్యాత దర్శకుడు సుఖ్ దేవ్ అహ్లువలియా దర్శకత్వం వహించగా, సంగీతం సురిందర్ కోహ్లి అందించారు.
1991లో దీప్ ధిల్లాన్, సునితా ధీర్ నటించిన వైశాఖి సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేకపోయినా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జట్ జెనా మోర్హ్ సినిమా ఆ సంవత్సరానికి భారీ హిట్ కావడమే కాక, జగ్గు గిల్ ను సూపర్ స్టార్ ను చేసింది. ఆ తరువాత జగ్గు గిల్, అమర్ నూరీలు నటించిన దిల్ డా మామ్లా సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
1993లో విడుదలైన జట్ సచా సింగ్ సూర్మా(యోగరాజ్ సింగ్, నీనా సిధు), మీర్జా సహిబన్(గగ్గు గిల్), లల్కరా జట్ డా, సాలీ ఆధీ ఘర్ వాలీ సినిమాలు ఫరవాలేదనిపించాయి. కానీ ప్రీతి సప్రూ దర్శకత్వంలో, మల్కిట్ సింగ్, హంసరాజ్ హన్స్, ప్రీతీ సప్రూ, యోగరాజ్ సింగ్ లు నటించిన మెహందీ షగ్నన్ సినిమా, యోగరాజ్ సింగ్ నటించిన కుడీ కనడా డీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
1994లో గురుదాస్ మన్, యోగరాజ్ సింగ్ నటించిన కచేరి సినిమా కమర్షియల్ గా హిట్ కావడమే కాక, జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం, విమర్శకుల ప్రశంసలు పొందింది. విశాల్ సింగ్ నటించిన తబహి సినిమా ఆ సంవత్సర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గగ్గూ గిల్ నటించిన వైరి కూడా హిట్ అయింది. యోగరాజ్ సింగ్ ప్రతినాయకునిగా చేసిన జిగ్రా జట్ డా సినిమా ఫ్లాప్ అయింది.
1995లో కిమి వర్మా నటించిన నసీబొ, కహర్ సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందినా, కమర్షియల్ గా విజయం సాధించలేకపోయాయి. గగ్గు గిల్, గురుదాస్ మన్, ప్రీతి సర్పూ, దారా సింగ్ లు నటించిన ప్రతిగ్య సినిమా మంచి హిట్ గా నిలిచింది. జలిదార్(యోగరాజ్ సింగ్), నైన్ ప్రీతో డే(యోగరాజ్ సింగ్), సర్ ధాద్ డీ బాజీ సినిమాలు మంచి విజయాలే. గురుదాస్ మన్ చేసిన భగవత్ సినిమా సరిగా ఆడలేదు. కజ్మి జాగిర్దార్, మేరా పంజాబ్ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.
1996వ సంవత్సరం నుంచీ పంజాబీ సినిమా రంగం ప్రాభవం కోల్పోవడం మొదలైంది. సుఖా(విశాల్ సింగ్) సినిమా మాత్రమే ఆ సంవత్సరం హిట్ గా నిలిచింది. దేశన్ పర్దేశన్, ధీ జట్ డీ(ఉపాసనా సింగ్, గుర్ కీర్తన్, షివిందర్ మహల్), విచోదా(యోగరాజ్ సింగ్), గవాహీ జట్ డీ, జోరావర్ సినిమాలు ఘోర వైఫల్యం చెందాయి. దారా సింగ్ నటించిన విండూ, ఫరాహ్ నటించిన రబ్ డియాన్ రఖన్ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.
1997లో విడుదలైన మేళా, ట్రక్ డ్రైవర్, సర్దారీ, ప్రీతన్ డే పెహ్రెదార్, పచ్టావా సినిమాలు అన్నీ ఫ్లాప్ లుగా మిగిలాయి. గగ్గూ గిల్ నటించిన సినిమాలు కూడా విజయం సాధించలేకపోయాయి. పంజాబీ, హిందీ భాషలు కలిపి ట్రైన్ టు పాకిస్థాన్ సినిమా తీశారు. తరువాత ఫిలిం ఫెస్టివల్స్ కోసం ఈ సినిమాను పూర్తిగా పంజాబీ భాషలోకి అనువదించారు.
1998లో గగ్గు గిల్ నటించిన పుర్జా పుర్జా కట్ మరే, దారా సింగ్, రవీందర్ మన్, విశాల్ నటించిన లాలి, కల్భూషణ్ ఖర్బందా, తనూజ మొదలైన వారు నటించిన దిల్దారా సినిమాలు కూడా ఫ్లాప్ లే. భారీ బడ్జట్ లతో తీసిన గురు గోబింద్ సింగ్ కూడా సరిగా ఆడలేదు. బల్వంత్ దుల్లత్ దర్శకత్వం వహించిన మై మా పంజాబ్ దీ సినిమా విమర్శకుల ప్రశంసలు పోందడమే కాక, జాతీయ అవార్డు కూడా అందుకుంది. అదే సంవత్సరం విడుదలైన జస్పల్ భట్టి తీసిన మహౌల్ ఠీక్ హై సినిమా మాత్రం పెద్ద హిట్ అయింది. 1991లో వచ్చిన జట్ జియోనా మోర్హ్, 1992లో విడుదలైన బద్లా జట్టీ డా సినిమాల తరువాత ఈ సినిమానే అతి పెద్ద హిట్ గా నిలిచింది.
1999వ సంవత్సరం పంజాబీ సినిమా రంగానికి బాగా కలిసొచ్చిన ఏడాది. మహౌల్ ఠీక్ హై, షాహీద్-ఇ-మొహొబ్బత్ బూటా సింగ్ సినిమాలు కమర్షియల్ గా హిట్ కావడమే కాక, విమర్శకుల ప్రశంసలు పొందాయి. మక్కదర్, తేరా మేరా ప్యార్, నదియాన్ విచ్డే నీర్, దూర్ నహీ నాన్కనా, ఇష్క్ నచెవే గాలి గాలి(రణ్ దీప్ వీరేందర్, మన్జీత్ కుల్లార్, దీపక్ సరఫ్, నీరు సింగ్, సురిందర్ శర్మ) సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. రజ్నితీ సినిమా కూడా ఆడలేదు. రాజ్ బబ్బర్ నటించిన షాహీద్ ఉదం సింగ్ సినిమా మాత్రం మంచి విజయం నమోదు చేసుకుంది. షాహిద్ ఇ మొహొబ్బత్, షాహిద్ ఉదం సింగ్ సినిమాలే ఆ సంవత్సరం హిట్ అయినవి.
2000లో
మార్చు2000లో కేవలం మూడు సినిమాలే విడుదలయ్యాయి. అవినాశ్ వాదావన్, ఉపాసనా సింగ్, పరంవీర్, దీప్షికా సినిమాలు నటించిన దర్ద్ పర్దేసన్ డే సినిమా పంజాబ్ లో ఫ్లాప్ అయినా, విదేశాల్లో మాత్రం హిట్ అయింది. 2001లో సికంద్రా, జగిరా వంటి సినిమాలు విడుదలయ్యాయి. అవినాశ్ వధవన్, అయేషా ఝుల్కాలు నటించిన మేరొ రూప్ హై ఖాస్ సినిమాను పంజాబ్ లో విడుదల చేయకుండా, కేవలం విదేశాల్లోనే విడుదల చేశారు.
2002లో గాయకుడు హర్భజన్ మాన్ హీరోగా నటించిన జీ అయన్ ను సినిమా పెద్ద హిట్ అయింది. 9 మిలియన్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు దర్శకుడు మన్మోహన్ సింగ్ దర్శకత్వం వహించారు.
2003లో బద్లా, 2004లో మాన్ వత్నా డా(హర్భజన్ మాన్, దర్శకుడు మన్మోహన్ సింగ్) విడుదలయ్యాయి.
2005లో జిజా జీ, దేస్ హోయా పరదేస్, మై తు అస్సీ తుస్సీ, యారన్ నాల్ బహరన్, నాలాయక్ సినిమాలు విడుదలయ్యాయి. 2006లో దిల్ అప్నా పంజాబీ, ఏక్ జింద్ ఏక్ జాన్, మన్నత్, వారిస్ షాహ్:ఇష్క్ డా వారిస్ వంటి సినిమాలు వచ్చయి. 2006లోనే యుఎస్ ప్రధానంగా, ప్రవాస భారతీయులు తీసిన పంజాబీ సినిమా కంబ్డీ కలాయ్ సినిమా విడుదలైంది. 2007లో రుస్తుమ్-ఎ-హింద్, మిట్టీ వజన్ మర్దీ సినిమాలు విడుదలయ్యాయి.
2008లో చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలు విడుదలయ్యాయి. హషర్, యారియన్, మేరా పింద్, లాఖ్ పరదేశీ హోయి, హెవెన్ ఆన్ ఎర్త్, సత్ శ్రీ అకల్ వంటి సినిమాలు ఆ ఏడాదిలో వచ్చాయి. 2009లో విడుదలైన జగ్ జియోదేయే దేహ్ మేలే సినిమా పెద్ద హిట్ అయింది. తేరే మేరేకి రిష్తా కూడా విజయం సాధించింది. కానీ మన్మోహన్ సింగ్ దర్శకత్వం వహించి, జిమ్మీ షెర్గిల్, గుర్ ప్రీత్ ఘుగ్గీలు నటించిన ముండే యు.కే దే సినిమా పంజాబీ సినీ రంగ చరిత్రలో కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాగా నిలిచింది.
మన్మోహన్ సింగ్ అంతకుముందు దర్శకత్వం వహించిన దిల్ ఆప్నే పంజాబీ సినిమా రికార్డులనే కాక, అప్పటిదాకా వచ్చిన అన్ని పంజాబీ సినిమాల రికార్డులను కూడా బద్దలుకొట్టింది ముండే యు.కే దే సినిమా.
హరిందర్ గిల్ దర్శకత్వం వహించిన, కొత్త నటులు గోల్డీ సోమల్, గవియె చాహల్, ప్రబలీన్ నటించిన మెహందీ వాలే హాత్(2006) సినిమా తూర్పు పంజాబ్ లో కూడా హిట్ అయింది.
2010
మార్చు2010లో 16 సినిమాలు విడుదలయ్యాయి పంజాబీ సినీ రంగంలో. మెల్ కరాదే రబ్బా సినిమా అన్ని రికార్డులనూ బద్దలుకొట్టి దాదాపుగా 110మిలియన్లు వసూలు చేసింది. ఇంతవరకూ ఈ రికార్డును ఏ పంజాబీ సినిమా కూడా దాటలేకపోయింది. ఏప్రిల్ లో విడుదలైన బబ్బూ మాన్స్ ఎకమ్ కూడా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాతో బ్రిటిష్-పంజాబీ నటి మండే టకార్ పాలీవుడ్ కు పరిచయమయ్యారు. హరిందర్ గిల్ దర్శకత్వం వహించిన జవానీ జిందాబాద్ సినిమా కెనెడాలో చాలా పెద్ద హిట్ గా నిలిచింది. 2010 మార్చిన విడుదలైన్ ఈ సినిమాలో ప్రఖ్యాత పంజాబీ గాయకుడు రాజ్ బరార్, పూజా కన్వాల్, గగ్గు గిల్, గుర్ కీర్తన్ తదితరులు నటించారు. హరిందర్ గిల్ దర్శకత్వం వహించిన చన్నా సచ్చీ ముచ్చీ సినిమా ఆగస్టులో విడుదలైంది. గురుదాస్ మన్, జుహీ చావ్లా, దివ్యా దత్తా నటించిన సుఖ్ మని సినిమా కూడా వచ్చింది.
2011
మార్చు2011లో హర్ష్ దీప్ కౌర్, యామీ గౌతం లు నటించిన ఏక్ నూర్ సినిమా విడుదలైంది. సెప్టెంబరులో ఛవన్ దరియా సినిమా వచ్చింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఐష్ అమితోజ్ కౌర్, పంజాబీ సినీ రంగంలో మొట్టమొదటి మహిళా దర్శకురాలు, నిర్మాత, రచయిత్రి కూడా. గుల్షాన్ గ్రోవర్, నీనా గుప్తా, మన్ ప్రీత్ సింగ్, లఖ్విందర్ వదాలీ, క్రిస్తా కనన్, రానా రణబీర్ తదితరులు నటించారు ఈ సినిమాలో.
ఆ ఏడాది చివర్లో సిమెర్జిత్ సింగ్ దర్శకత్వంలో గురుదాస్ మాన్ నటించిన చాక్ జవానా సినిమా విడుదలైంది.
2011 ఫిబ్రవరిలో మొట్టమొదటిసారిగా పిటిసి పంజాబీ చానెల్ పిటిసి పంజాబీ సినిమా అవార్డులు నిర్వహించింది. ఈ అవార్డులు కళాకారులకు మంచి ఉత్సాహం నింపాయి అని చెప్పొచ్చు. ఓం పురి, ప్రేం చోప్రా, గురుదాస్ మాన్, గుడ్డు ధనోయా, ప్రీతీ సప్రూ, రజా మురద్, సతీశ్ కౌల్, మన్మోహన్ సింగ్, అమరిందర్ గిల్, గిప్పీ గ్రెవల్, జస్బీర్ జస్సీ, పునీత్ ఇస్సార్, రాకేశ్ బేడీ, రమా విజ్, సదన్షు పాండే, అక్రితి కక్కర్ వంటి హేమాహేమీలు పాల్గొన్నారు ఈ అవార్డుల ఫంక్షన్లో.
అప్పటిదాకా వస్తున్న ప్రవాస భారతీయ కథలకు భిన్నంగా 2011లో మంచి కథలతో లయన్ ఆఫ్ పంజాబ్, దిల్జీత్ దోసంజ్, ధర్తీ వంటి సినిమాలు వచ్చాయి.
2011లో విడుదలైన జిన్హే మేరా దిల్ లుటాయా సినిమా అత్యధికంగా 125 మిలియన్లు వసూలు చేసింది. మన్ దీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే ధీరజ్ రతన్, నిర్మాత బట్రా షోబిజ్ ప్రైవేట్ లిమిటెడ్. గిప్పీ గ్రెవెల్, దిల్జిత్ దోసంజ్, నీరు బాజ్వా, జస్వీందర్ భల్లా తదితరులు నటించారు. ఈ సినిమా వల్ల పంజాబీ సినీ పరిశ్రమ స్థాయి పెరిగింది.
2011 సెప్టెంబరులో క్సహిట్జ్ చౌదరి దర్శకత్వంలో విడుదలైన యారో ఓ దిల్దారా సినిమా మంచి హిట్. హర్భజన్ మాన్, తులిప్ జోషి, కబీర్ బేడి, గురుప్రీత్ గుగ్గీలు నటించారీ సినిమాలో. అక్టోబరు లో యువరాజ్ హంస్, హరీష్ వర్మలు నటించిన యార్ అన్ ముల్లే కూడా పెద్ద హిట్.
2012
మార్చుఈ సంవత్సరాన్ని పంజాబీ సినీ పరిశ్రమ గోల్డెన్ ఇయర్ ఆఫ్ పంజాబీ సినిమాగా పేర్కొంది. పంజాబీ సినీ చరిత్రలో భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్టైల్లో మీర్జా-ది అన్ టోల్డ్ స్టోరీ సినిమా విడుదలైంది. యో యో హనీ సింగ్, గిప్పీ గ్రెవల్ నటించారు ఈ సినిమాలో. 2012 జూలై వచ్చిన జట్ & జులియట్ పంజాబీ సినీ పరిశ్రమలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో దిల్జీత్ దోసంజ్, నీరూ బాజ్వాలు సూపర్ స్టార్ లుగా ఎదిగారు. ఈ సినిమా రీమేక్ హక్కులను హిమేష్ రష్మియా 3.5కోట్లకు కొనుగోలు చేశారు. 2012 జూలైలో విడుదలైన కారీ ఆన్ జట్టా సినిమా జట్ & జూలియట్ తరువాత అంత పెద్ద హిట్ అయింది. పంజాబీ సినీ పరిశ్రమలో మొట్టమొదటి సీక్వెల్ కూడా 2012లోనే విడుదలైంది. యారన్ నాల్ బహరాన్ సినిమాకు సీక్వెల్ గా యారాన్ నాల్ బహరాన్ 2 వచ్చింది.
సెప్టెంబరులో మాన్ జీ దర్శకత్వం వహించిన ఆజ్ దే రన్జే సినిమా విడుదలైంది. అక్టోబరులో గుర్బిర్ గ్రెవల్ దర్శకత్వం వహించిన సాదీ వఖ్రి హై షాన్ సినిమా సంగీతపరంగా మంచి హిట్ గా నిలిచింది. సంగీత దర్శకుడు దిల్ ప్రీత్ భాటియా అందించిన బాణీలు ప్రేక్షకులను బాగా అలరించాయి. పాశ్చాత్య సంప్రదాయ సంగీతం, పంజాబీ జానపద సంగీతాల ఫ్యూజన్ గా ఉంటాయి ఈ పాటలు.
2012లో చాలా కొత్త నిర్మాణ సంస్థలు మొదలయ్యాయి. అలాగే మంచి హాస్యభరితమైన సినిమాలు కూడా నిర్మించాయి ఈ సంస్థలు. పంజాబీ సినీ రంగంలో బిన్ను ధిల్లాన్, గురుప్రీత్ గుగ్గీ, జస్విందర్ భల్లా, రాణా రణబీర్, కరంజిత్, అన్మోల్, బి.ఎ.శర్మ వంటి హాస్యనటులు స్టార్ లుగా ఎదిగారు.
2012 ఆగస్టులో కెనెడాలోని టొరొంటోలో మొట్టమొదటిసారిగా పంజాబీ అంతర్జాతీయ ఫిల్ం ఎకాడమీ అవార్డులు నిర్వహించబడ్డాయి. ఎంతోమంది పంజాబీ స్టార్స్ పాల్గొన్న ఈ పురస్కారాల ఫంక్షన్ చాలా పెద్ద సక్సెస్ అయింది. పంజాబీ సినిమా రంగం చాలా కాలం తరువాత నిలదొక్కుకుంది. ప్రతీ సంవత్సరం సినిమా రిలీజుల సంఖ్య పెరిగింది. పంజాబీ భాషకు చెందిన ప్రముఖ బాలీవుడ్ కళాకారులు తమ స్వంత సినీ రంగంలో పనిచేసేందుకు ఆసక్తి చూపడం మొదలుపెట్టారు. స్వప్రాంత స్టార్స్ ఎదిగారు. పంజాబీ ఫిలిం ఫెస్టివల్, అమృత్ సర్, మా బోలీ అంతర్జాతీయ పంజాబీ ఫిలిం ఫెస్టివల్, వాన్ కవర్, పంజాబీ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్, టొరొంటో వంటి సినిమా అవార్డుల ఫంక్షన్లు మొదలై, ఏటా నిర్వహిస్తున్నారు.
2013
మార్చు2013 కూడా పంజాబీ సినీ రంగానికి కలిసి వచ్చిన సంవత్సరం. దిల్జీత్ దోసంజ్, నీరు బాజ్వా, గిప్పీ గ్రెవల్, సుర్వీన్ చావ్లా వంటి పంజాబీ సూపర్ స్టార్ల సినిమాలు విడుదలై మంచి హిట్ లు అందుకున్నాయి. జాట్ & జూలియట్ 2 విడుదలై జాట్ & జూలియట్ 1 రికార్డుల్ని బద్దలు కొట్టింది. ఈ సినిమా పాకిస్థానీ పంజాబ్ లో 15 థియేటర్లలో విడుదలై పాకిస్థానీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.[12] 1980, 1990ల కాలం నాటి పంజాబ్ రాష్ట్ర పరిస్థితులు ముఖ్య కథాంశంగా తెరకెక్కిన సిద్దా హక్ సినిమా ఆ సంవత్సరానికి రెండో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అక్షయ్ కుమార్ నిర్మాణంలో గిప్పీ గ్రెవల్ నటించిన భాజీ ఇన్ ప్రాబ్లం సినిమా మరో అతిపెద్ద హిట్. ఈ సినిమాలో క్రికెట్ క్రీడాకారుడు హర్భజన్ సింగ్ కూడా నటించడం ఒక ఆకర్షణ. జిమ్మీ షెర్గిల్ తీసిన సాదీ లవ్ స్టోరీ(దిల్జీత్ దోసంజ్), రోషన్ ప్రిన్స్, సమీక్షా నటించిన ఫెర్ మామ్లా గద్బద్ గద్బద్, యో యో హనీ సింగ్ నటించిన తు మేరా 22 మే తేరా 22 సినిమా, గిప్పీ గ్రెవల్ నటించిన లక్కీ దీ అన్ లక్కీ స్టోరీ, సింగ్ వర్సెస్ కౌర్, పగ్రీ సింగ్ డా తాజ్ వంటి హిట్లను చూసింది 2013 సంవత్సరం.
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా ఎ గుడ్ డే టు డై హార్డ్ సినిమా గిప్పి గ్రెవల్ డబ్బింగ్ తో పంజాబీ భాషలో విడుదల చేశారు.
పంజాబ్ లోని సామాజిక పరిస్థితులపై వచ్చిన చాలా చిత్రాలు విజయం సాధించడమే కాక విమర్శకుల, ప్రజల ప్రశంసలు కూడా అందుకున్నాయి. అలాంటి కోవలోకి చెందిన నాబర్ సినిమా జాతీయ అవార్డు అందుకుంది. పంజాబ్ లోని విద్యా వ్యవస్థ గురించి వచ్చిన స్టుపిడ్ 7, చండీగడ్ విద్యార్థి రాజకీయాల ఆధారంగా తీసిన సికందర్, సిద్దా హక్, అవినీతి, సామాజిక సమస్యలపై వచ్చిన బిక్కర్ బాయ్ సెంటిమెంటల్, మతానికి సంబంధించిన విషయాలపై చర్చించిన దస్తార్, పంజాబ్ బోల్దా, హానీ, దిల్ పరదేశీ హో గయా వంటి సినిమాలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి.
ఈ సంవత్సరంలోనే పంజాబీ సినీ చరిత్రలో మొట్టమొదటి 3డి చిత్రం విడుదలైంది. మన్నీ పర్మర్ నిర్మించి, దర్శకత్వం వహించిన పెహచాన్ 3డి సినిమా మంచి విజయం సాధించింది.
ఇర్ఫాన్ ఖాన్ నటించిన కిస్సా సినిమా భారతీయ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ లో 4 అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ నటునిగా ఇర్ఫాన్, ఉత్తమ నటిగా తిలోత్తమా షోమి, ఉత్తమ దర్శకునిగా అనూప్ సింగ్, ఉత్తమ సినిమాటోగ్రఫర్ గా సెబస్టియన్ ఎడ్షిమిడ్ లు పురస్కారాలు అందుకున్నారు.[13]
2014
మార్చు2014లో దాదాపు 42 సినిమాలు విడుదల కాగా అందులో 80శాతం కామెడీ సినిమాలే.[14] చార్ సాహిబ్జాదే(3డి), దిల్జీత్ దోసంజ్ నటించిన పంజాబ్ 1984, గిప్పీ గ్రెవల్ నటించిన జాట్ జేమ్స్ బాండ్, డిస్కో సింగ్, డబుల్ డీ ట్రబుల్, మిస్టర్ & మిస్సెస్ 420, గోరెయాను డఫ్ఫా కరో వంటి సినిమాలు బ్లాక్ బ్లస్టర్లుగా నిలిచాయి.[15] కిర్పాన్: ది స్వార్డ్ ఆఫ్ హానర్, ఫతే, రోమియో రంజా, యోద్ధా ది వారియర్, బాజ్ వంటి యాక్షన్ చిత్రాలు విడుదలయ్యాయి. జనవరిలో వచ్చిన పటియాలా డ్రీమ్స్ రొమాంటిక్ థ్రిల్లర్.[16] 1984 సిక్కుల ఊచకోత సంఘటన ఆధారాంగా పంజాబ్ 1984, కామ్ దే హీరే, 47 టు 84 హన్ మే కిస్ను వతన్ కహుంగా వంటి సినిమాలు ప్రేక్షకులను కదిలించాయి. ఆ గయే ముండే యుకే డే, ముండెయన్ టోన్ బచ్కే రహీ, సిమ్రన్ కౌర్ ముండీ, దిల్ విల్ ప్యార్ వ్యార్ వంటి సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి.
ఈ సంవత్సరంలోనే చాలామంది నటులు, గాయకులు పంజాబీ సినిమా రంగానికి పరిచయమయ్యారు. ధర్మేంద్ర, పూనమ్ ధిల్లాన్ నటించిన డబుల్ డి ట్రబుల్, ప్రఖ్యాత బాలీవుడ్ హాస్యనటుడు రజాక్ ఖాన్ నటించిన మ్యారేజ్ డా గ్యారేజ్, బాలీవుడ్ నటి జరీనా ఖాన్ నటించిన జట్ జేమ్స్ బాండ్, గాయకుడు గారీ సంధు నటించిన రోమియో రంజా వంటి సినిమాలు విడుదలయ్యాయి.
చార్ సాహిబ్జాదీ సినిమా మొట్టమొదటి పంజాబీ 3డి యానిమేటెడ్ చారిత్రిక సినిమా 70కోట్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మధ్యప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ సినిమాకు పన్ను రాయితీ ఇచ్చాయి.[13]
కెనెడా-పంజాబీ సినిమా వర్క్ వెదర్ వైఫ్ సినిమా 87వ ఆస్కార్ అవార్డు లలో ప్రదర్శింపబడిన సినిమా. 79 ఉత్తమ ఒరిజినల్ సాంగ్స్ కు ఎంపికైన ఏకైక కెనడియన్ సినిమా ఇదే. 72వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఉత్తమ విదేశీ చిత్రాల జాబితాలో 53వ చిత్రంగా నిలిచింది. హర్ ప్రీత్ సందు, రీమా నగ్రా, దిల్ బాగ్ బ్రర్, కిరత్ భట్టల్ నటించిన ఈ సినిమాకు హర్ ప్రీత్ నే దర్శకత్వం వహించారు.[17]
2015
మార్చు2015వ సంవత్సరంలో చాలా మంది దర్శకులు కొత్త కథలు, కొత్త నటులతో ముందుకు వచ్చారు. దిల్జీత్ దోసంజ్, నీరూ బాజ్వా, మండే తఖర్ నటించిన సర్దార్ జీ బ్లాక్ బస్టర్ అయింది. పంజాబీ సినీ చరిత్రలో 50కోట్ల మైలురాయి దాటి వసూలు చేసింది ఈ సినిమా. అమరిందర్ గిల్, సర్గుణ్ మెహతా, అదితి శర్మ, బిన్ను ధిల్లన్ నటించిన అంగ్రెజ్ సినిమా రెండో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1945నాటి ప్రేమకథా చిత్రం ఇది.[18]
పంజాబీ సినీ రంగంలో బలమైన కథ, దర్శకత్వంతో కొన్ని సినిమాలు వచ్చాయి. నవనైత్ సింగ్ దర్శకత్వం వహించి, జిమ్మీ షెర్గిల్, మహియే గిల్ నటించిన షరీక్ సినిమా, జతిందర్ మౌహర్ దర్శకత్వంలో వచ్చిన కిస్సా పంజాబ్(7 వివిధ కథల్ని కలిపి తీసిన సినిమా), అధర్వ్ బలుజా దర్శకత్వం వహించిన జడ్జ్ సింగ్ ఎల్.ఎల్.బి(మొట్టమొదటి పంజాబీ కోర్ట్ నేపథ్యం కలిగిన సినిమా), బల్జిత్ సింగ్ దర్శకత్వంలో, గిప్పీ గ్రెవల్ నటించిన ఫరార్(గిప్పీ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు) వంటి సినిమాలు ఈ కోవలోకి చెందినవే. పంజాబీ సినీ చరిత్రలోనే మొదటిసారి 13కోట్లతో నిర్మించిన సినిమా ఫరార్. దిల్దరియాన్, హీరో నామ్ యాద్ రఖీ, మిట్టీ నా ఫరోల్ జోగియా, ఓహ్ యారా ఐన్వయి ఐన్వయి లుట్ గయా, ముండే కమాల్ దేలు మరికొన్ని హిట్ చిత్రాలు. ది మాస్టర్ మైండ్ జిందా సుఖా, పటా పటా సింగన్ డా వైరి, నానక్ షాహ్ ఫకీర్ వంటి సినిమాలు వివాదాల్లో చిక్కుకున్నాయి. ఇప్పటికీ నానక్ షాహ్ ఫకీర్ సినిమా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నిషేధంలోనే ఉంది.
2016
మార్చు1997లో విడుదలైన మేళా, ట్రక్ డ్రైవర్, సర్దారీ, ప్రీతన్ డే పెహ్రెదార్, పచ్టావా సినిమాలు అన్నీ ఫ్లాప్ లుగా మిగిలాయి. గగ్గూ గిల్ నటించిన సినిమాలు కూడా విజయం సాధించలేకపోయాయి. పంజాబీ, హిందీ భాషలు కలిపి ట్రైన్ టు పాకిస్థాన్ సినిమా తీశారు. తరువాత ఫిలిం ఫెస్టివల్స్ కోసం ఈ సినిమాను పూర్తిగా పంజాబీ భాషలోకి అనువదించారు.
అవార్డులు
మార్చుపంజాబీ సినిమా రంగంలో ఇచ్చే ఈ అవార్డుల వల్ల కళాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తోంది.
ఫిలిం ఫెస్టివల్స్
మార్చుపంజాబ్ ప్రభుత్వ సినిమా పాలసీ
మార్చు2013లో పంజాబ్ వారసత్వ, పర్యాటక ప్రమోషన్ బోర్డ్, జాతీయ ఫిలిం డవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్.ఎఫ్.డి.సి) సంయుక్తంగా పంజాబ్ ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీ, ఫిలిం పర్యాటకం ప్రొమోషన్ పాలసీ 2013లను రూపొందించాయి. పంజాబ్ రాష్ట్ర ఫిలిం కమిషన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ పాలసీ ప్రకారం 75శాతం పంజాబీ సంభషణలున్న పంజాబీ సినిమాకు 5శాతం వినోదపు పన్ను రాయితీ ఇస్తుంది ప్రభుత్వం.[30] కానీ 2016 మార్చిలో పంజాబీ భాషను, సంస్కృతినీ పెంపొందించడానికి పంజాబ్ ప్రభుత్వం పంజాబీ సినిమాలపై వినోదపు పన్ను పూర్తిగా రద్దు చేసింది.[31][32]
పంజాబ్ లోని గ్రామీణ సినిమా హాళ్ళు
మార్చుగ్రామస్థుల సౌకర్యార్ధం పంజాబ్ లోని గ్రామాల్లో సినిమా హాళ్ళు నిర్మించారు. 1లేదా 2 స్క్రీన్ లతో, 100 సీట్ల సామర్ధ్యంతో ఉంటాయి ఈ హాళ్ళు.[33]
ప్రభుత్వం ఇచ్చే సినిమా పురస్కారాలు
మార్చు2014వ సంవత్సరం నుంచి పంజాబ్ ప్రభుత్వం 1కోటి రూపాయల బడ్జెట్ తో సినిమా పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించింది. ఆ సంవత్సరంలోని ఉత్తమ చిత్రాలకు, ప్రతిభావంతులైన దర్శకులు, నటులకు రూ.25లక్షలు, రూ.15లక్షలు, రూ.10లక్షల చొప్పున బహుమతులు ప్రకటిస్తోంది.[34]
పంజాబీ ఫిలిం సిటీ
మార్చుపంజాబ్ లోని అజిత్ గఢ్ త్వరలో పాలీవుడ్ నెట్వర్క్ కు కేంద్రబింధువు కాబోతోంది. ఈ నగరంలో ప్రభుత్వం పాలీవుడ్ ఫిలిం సిటీ నిర్మించడానికి నిర్ణయించింది.[35] పాలీవుడ్ కు సహకారం ఇవ్వడం కోసం పంజాబ్ ప్రభుత్వం ఫిలింసిటీ, ఫిలిం ఇన్స్టిట్యూట్ నిర్మిస్తోంది. ఇన్నాళ్ళూ పంజాబ్ సినీ రంగం అనుభవించిన ఇబ్బందులను దూరం చేసేందుకు ఈ ఫిలిం సిటీ నిర్మిస్తున్నామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. మొదట్లో పంజాబ్ ప్రభుత్వం ప్రకృతి సౌందర్యం దృష్ట్యా ఫిలింసిటీని రూప్ నగర్ లో నిర్మించాలనుకున్నా, మౌలిక సదుపాయాల దృష్ట్యా, రాజధాని చండీగఢ్ కు అందుబాటులో ఉన్న కారణంగా మొహాలి(అజిత్ గఢ్)కు మార్చింది. త్వరలో అజిత్ గఢ్ లో జాతీయ ఫిలిం అండ్ టివి ఇన్స్టిట్యూట్, పూణెకు అనుబంధంగా ఒక ఫిలిం, టివి ఇన్స్టిట్యూట్ ను స్థాపించబోతున్నారు. పంజాబ్ గ్రామాల్లోనూ, చారిత్రిక కట్టడాల్లోనూ, గోల్డెన్ టెంపుల్ లోనూ సినిమా షూటింగ్ లకు అనుమతించమంటూ చాలామంది దర్శకులు, నిర్మాతలు ప్రభుత్వాన్ని ఇప్పటికే చాలా ప్రతిపాదనలు చేశారు. ఇవే కాకుండా ఇరుకైన మార్గాలు కలిగిన అమృత్ సర్, పాటియాలా, కపుర్తలా, భతిండా వంటి చారిత్రిక పట్టణాల్లోనూ షూటింగులకు అనుమతించమని ప్రతిపాదిస్తున్నారు.
పంజాబీ ఫిలిం స్టుడియోలు
మార్చు- Joke Factory[36] అజిత్ గఢ్ లో ప్రముఖ హాస్యనటుడు జస్పాల్ భట్టి కుటుంబానికి జోక్ ఫ్యాక్టరి[36] అనే ఫిలిం స్టుడియో ఉంది. చాలా సినిమాలు, టివి షోలు ఈ స్టుడియోలోనే రూపొందుతున్నాయి. 5 కనల్స్ కు సరిపడా ఇండస్ట్రియల్ ఏరియాలో నిర్మించిన ఈ స్టుడియో వింతైన అలంకరణలు నిర్మాణ సంస్థలను ఆకట్టుకుంటున్నాయి. 40 నుంచి 50 అడుగుల వెడల్పైన పెద్ద సౌండ్ షూటింగ్ ఫ్లోర్, ప్రధాన స్టుడియో, పెద్ద లాన్, ఔట్ సైడ్ షూట్ లు ప్రధాన ఆకర్షణలు ఈ స్టుడియోలకు.
ప్రధాన నిర్మాణ సంస్థలు
మార్చు- బేసిక్ బ్రదర్స్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్(సూర్యా సినిమాస్, వైట్ హిల్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లతో కలిపి).
- స్టూడియో 7 ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ సినిమాలు, టీవీ షో నిర్మాణాల దగ్గర నుంచి, ఈవెంట్ మేనేజ్ మెంట్, వినోద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. కెనెడాలోని పంజాబీలు ఎక్కువగా ఉండే సర్రే ప్రదేశంలో ఉంది ఈ నిర్మాణ సంస్థ.
పంజాబ్ లోని ఫిలిం ఇన్స్టిట్యూట్
మార్చుప్రైవేట్
మార్చు2008లో చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలు విడుదలయ్యాయి. హషర్, యారియన్, మేరా పింద్, లాఖ్ పరదేశీ హోయి, హెవెన్ ఆన్ ఎర్త్, సత్ శ్రీ అకల్ వంటి సినిమాలు ఆ ఏడాదిలో వచ్చాయి. 2009లో విడుదలైన జగ్ జియోదేయే దేహ్ మేలే సినిమా పెద్ద హిట్ అయింది. తేరే మేరేకి రిష్తా కూడా విజయం సాధించింది. కానీ మన్మోహన్ సింగ్ దర్శకత్వం వహించి, జిమ్మీ షెర్గిల్, గుర్ ప్రీత్ ఘుగ్గీలు నటించిన ముండే యు.కే దే సినిమా పంజాబీ సినీ రంగ చరిత్రలో కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాగా నిలిచింది.
ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు
మార్చు- మొహాలీలో 12ఎకరాల్లో, 115కోట్లతో ప్రభుత్వం ఫిలిం ఇన్స్టిట్యూట్ నిర్మించనుంది. 48 కోర్సులతో, డిప్లమో, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, కమర్షియల్ ఫొటోగ్రఫీ, కెమెరా స్టుడియో ఆపరేషన్స్ వంటి కోర్సులు ప్రవేశ పెట్టనున్నారు. వీటిలో దర్శకత్వం, నటన, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ ఇంజినీరింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్ రైటింగ్, మేకప్, నిర్మాణం వంటి కళలు, మాస్ కమ్యూనికేషన్లో జర్నలిజం, ఎడ్వర్టైజింగ్, కమ్యూనికేషన్ డవలప్ మెంట్, మీడియా మేనేజ్ మెంట్ వంటి కోర్సులు కూడా ఉంటాయి. దాదాపు 2850మంది విద్యార్థులతో ఈ ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టాలనే యోచనలో పంజాబ్ ప్రభుత్వం ఉన్నట్టు వివరించింది.[37]
వాణిజ్య వైఖరి
మార్చుపంజాబీ సినీ పరిశ్రమ చాలా వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం దీని విలువ 50కోట్లు.[38] 4,000కోట్ల విలువైన బాలీవుడ్ తో పోటీ పడటానికి పాలీవుడ్ ఇంకా ఎదగాల్సి ఉంది. కానీ ట్రేడ్ పండితుల ప్రకారం ఇప్పటికి ఉన్న దానికంటే ఈ రంగం రెండింతలు వేగంగా పెరుగుతుందని అంచనా.
పంజాబీ సినీ రంగం ఎన్నో బాలారిష్టాలను దాటుకుని ముందుకు సాగుతోంది. ఈ సినీ రంగ జీవిత ఆదాయం 30కోట్లను దాటి 40కోట్లకు పెరిగింది. కానీ నిజానికి నిర్మాతలు 50శాతమే ఉన్నారు.
పంపణీ రంగం
మార్చునాణ్యతను పెంచుకుంటూనే, పంజాబీ సినిమాను మంచి పంపణీ చేసుకుంటోంది పాలీవుడ్. పంజాబ్ ప్రాంతంలోనే కాక దేశంలో పంజాబీలు ఎక్కువగా ఉన్న రోజురి గార్డెన్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ లోని రుద్రపూర్, బజ్పూర్, కాశీపూర్,[39] హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా, కంగ్రా, హమిర్పూర్, జమ్మూ,[40] హర్యానా వంటి ప్రదేశాల్లో కూడా సినిమాలు విడుదల చేస్తోంది. భారత్ లోని తూర్పు పంజాబ్ సర్క్యూట్, ఢిల్లీ సర్క్యూట్, రాజస్థాన్ సర్క్యూట్(గంగనగర్, హనుమన్ ఘఢ్ వంటి ప్రదేశాలు)ల్లో పంజాబీ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ఇంతకుముందు ఢిల్లీ లాంటి నగరాల్లో కేవలం 5 ప్రింట్లు విడుదల చేసేవారు. కానీ ఇప్పుడు దాదాపు 30 ప్రింట్లు విడుదల చేస్తున్నారు. పంజాబీ సినిమాలకు 50శాతం వసూళ్ళు విదేశాల నుండి వస్తాయి. పంజాబీలు ఎక్కువగా ఉండే కెనడా, యుకె,[41] యు.ఎస్.ఎ, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఐరోపా వంటి దేశాల నుంచి మంచి వసూళ్ళు సాధిస్తోంది పంజాబీ సినీ రంగం. కెనడా దేశంలో పంజాబీ సినిమా నిర్మాణం, షూటింగ్ కూడా ఎక్కువగా జరుగుతోంది.[42][43][44] అంతేకాదు భారత్ తరువాత పంజాబీ సినిమాకు కెనడానే అతిపెద్ద మార్కెట్.[45]
ఈమధ్యనే దేశంలో పంజాబీల సంఖ్య తక్కువగా ఉండే హైదరాబాద్, కలకత్తా, గుజరాత్, ఇండోర్, భోపాల్(మధ్యప్రదేశ్), పాట్నా(బీహార్), బెంగళూరు, నాందేడ్, భువనేశ్వర్ వంటి నగరాల్లోనూ పంజాబీ సినిమాలు విడుదలై, విజయాలు సాధిస్తున్నాయి. అలాగే ఓవర్ సీస్ మార్కెట్లో పంజాబీలు తక్కువగా ఉండే ఆస్ట్రియా, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్ లాండ్స్, సింగపూర్, మలేషియా, హాంగ్ కాంగ్, పాకిస్థాన్ వంటి దేశాల్లో పంజాబీ సినిమా మార్కెట్ వెతుక్కుంటోంది.[46]
పంజాబ్ లో దాదాపు 196 సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి.[47] గత ఐదేళ్లలో చాలా మల్టీప్లక్స్ లు వచ్చాయి పంజాబ్ లో. 2007లో పంజాబ్ మొత్తం మీద 4 మల్టీప్లక్స్ లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 36కు చేరింది. ఇంకా 99 నిర్మాణంలో ఉన్నాయి.[48] ఎప్పుడూ లేని రీతిలో ఈ మల్టీప్లక్స్ ల వల్లా పంజాబీ మధ్యతరగతి ప్రేక్షకుల సంఖ్య పెరిగింది.
శాటిలైట్ రైట్స్
మార్చుపంజాబీ సినీరంగం ప్రస్తుతానికి శాటిలైట్ రైట్స్ విషయంలో వెనుకబడి ఉందనే చెప్పాలి. పెద్దగా శాటిలైట్ మెకానిజం లేకపోవడం వల్ల, పంజాబీ సినిమాల్లో శాటిలైట్లకు సరిపోయే ఆప్షన్లు లేకపోవడంతో శాటిలైట్ రిలీజులు జరగటం లేదు. కేవలం 4-5పంజాబీ చానెళ్ళు మాత్రమే పంజాబీ పాటల్ని ప్రసారం చేస్తున్నాయి.[49][50]
పంజాబ్ సెన్సార్ బోర్డ్
మార్చుపంజాబీ సినిమాల్లోని పాటల్లో అసభ్యకరమైన సాహిత్యం, వీడియోలు అరికట్టేందుకు పంజాబ్ ప్రభుత్వం 2012లో పంజాబ్ సెన్సార్ బోర్డును ప్రారంభించింది.[51] అప్పటి పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి స్వరన్ సింగ్ ఫిల్లువర్, సాంస్కృతిక వ్యవహారాల శాఖా అధికారులు, ప్రముఖ కళాకారులు, రచయితల సమావేశంలో మాట్లాడుతూ " ఈ మధ్య కొన్ని పాటల్లో అసభ్యకరమైన సాహిత్యం రాస్తున్నారు. సినిమాల్లోని పాటల్లోనూ, వీడియోల్లోనూ కొంతమంది కళాకారులు అసభ్య పదజాలం వాడుతున్నారు. నిజమైన పంజాబీ సంస్కృతి జానపద పాటల్లోనూ, జానపద నృత్యాలు, నాటకాలు, సాహిత్యంలోనూ ఉంది. వాటి పాళ్ళు పంజాబీ సినిమాల్లో, పాటల్లో పెంచేందుకు, అసభ్య విషయాలు అరికట్టేందుకు పంజాబ్ సెన్సార్ బోర్డును ఏర్పాటు చేస్తున్నా"మని వివరించారు.
Remakes of Punjabi Films
మార్చు- పంజాబీ బ్లాక్ బస్టర్ సినిమా జాట్ & జూలియట్ ను బెంగాలీలోకి బెంగాలీ బాబు ఇంగ్లిష్ మేమ్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా బెంగాలీలో కూడా అతి పెద్ద హిట్ అయింది.
జాట్ & జూలియట్ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ నిర్మాణ సంస్థ, హిమేశ్ రేషమ్మియా హెచ్.ఆర్ మ్యూజిక్ సంయిక్త నిర్మాణంలో రాబోతోందీ చిత్రం.అక్షయ్ కుమార్, నీరూ బాజ్వా నటించబోతున్నారు ఈ సినిమాలో.
- అక్షయ్ కుమార్ నిర్మాణంలో వచ్చిన భాజీ ఇన్ ప్రాబ్లెమ్ సినిమాను తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో రీమేక్ చేయనున్నారు.[52]
- సింగ్ వర్సెస్ కౌర్ సినిమాను రామానాయుడు నిర్మాణంలో నాగచైతన్య హీరోగా తీద్దామనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ పైకి రాలేదు.[53]
- హిట్ పంజాబీ సినిమా డబుల్ దీ ట్రబుల్ సినిమాను ధర్మేంద్ర హిందీలో తీయబోతున్నారు.[54]
- తెలుగు సినీ నిర్మాత వాసు మంతెన సర్దార్ జీ, జాట్ & జూలియట్2 సినిమాలను తెలుగులో నిర్మిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు.[55]
పంజాబీలోకి డబ్ అయిన సినిమాలు
మార్చు- 1994లో, అక్షయ్ కుమార్, సునిల్ శెట్టి నటించిన హిందీ సినిమా దో షేర్ డబ్ అయింది.[56]
- హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఏ గుడ్ డే టు డై హార్డ్ సినిమాను పంజాబీ సూపర్ స్టార్ గిప్పీ గ్రెవల్ వాయిస్ ఓవర్ తో డబ్ చేశారు.[57]
- 2014లో విడుదలైన భారతదేశంలోని మొట్టమొదటి ఛాయాగ్రహణ వాస్తవిక(ఫోటో రియలిస్టిక్) పర్ఫార్మెన్స్ సంగ్రహ చిత్రం(కాప్చర్ ఫిలిం) కొచ్చిడయన్ సినిమాను పంజాబీ భాషలోకి అనువదించారు.[57]
జతీయ అవార్డు విజేతలు
మార్చుపన్నా లాల్ మహేశ్వరి దర్శకత్వంలో వచ్చిన సట్లజ్ దే కంధే(1964), నానక్ నాం జహజ్ హై(1969) సినిమాలు రెండిటికీ జాతీయ ఫిలిం అవార్డ్ ల మెరిట్ సర్టిఫికెట్ వచ్చాయి.
చిత్రధ్ దర్శకత్వం వహించిన చౌదరీ కమాలీ సింగ్(1962), జగ్గా(1964), సస్సీ పున్ను(1964), సట్లజ్ దే కంధే(1967) చన్ పరదేశీ(1980), సురిందర్ దర్శకత్వంలో వచ్చిన మర్హి డా దీవా(1989), బల్వంత్ దుల్లత్ దర్శకత్వంలోని కచేరీ(1994), మే మా పంజాబ్ దీ(1998ఓ, మనోజ్ పుంజ్ దర్శకత్వం వహించిన షాహిద్-ఇ-మొహొబ్బత్ బూటా సింగ్(1999), చిత్రధ్ దర్శకత్వంలో వచ్చిన షాహీద్ ఉదం సింగ్(2000), మనోజ్ పుంజ్ దర్శకత్వం వహించిన దేశ్ హోయా పరదేశ్(2005), వారిస్ షాహ్:ఇష్క్ డా వారిస్(2006) సినిమాలు ఉత్తమ ఫీచర్ ఫిలిం అవార్డులు గెలుచుకున్నాయి. అన్హే ఘోరే డా డాన్(2011) సినిమా జాతీయ ఉత్తమ దర్శకుడూ, సినిమాటోగ్రఫీ, ఫీచర్ ఫిలిం అవార్డులు అందుకుంది. 60వ జాతీయ ఫిలిం అవార్డుల్లో నబర్(2013) సినిమా జాతీయ ఉత్తమ ఫీచర్ ఫిలిం ఇన్ పంజాబీ అవార్డు గెలుచుకుంది.[58] 1984-86లో జరిగిన పంజాబ్ అల్లర్ల నేపథ్యంతో వచ్చిన పంజాబ్ 1984(2014) సినిమా 62వ జాతీయ ఫిలిం అవార్డలలో ఉత్తమ పంజాబీ చిత్రంగా ఎంపికైంది.[59]
పంజాబ్ సమాంతర సినిమా
మార్చునిజంగా చెప్పుకోవాలంటే పంజాబీ సినిమాల్లో అర్ధవంతమైన సినిమాలు తక్కువ.[60] అందుకే పంజాబీ సినీరంగం సమాంతర సినిమాను ఏర్పరుచుకుంది.[61][62] పంజాబీ దళితుల కష్టంష్టాలు, ఆర్థిక అసమానతలు, సాంఘిక వేర్పాటు వంటి అంశాలను ఆధారం చేసుకుని తీసిన మర్హి డా దేవా(1989) సినిమా జాతీయ అవార్డు గెలుచుకుంది. అట్టడుగు ప్రజల జీవిత చిత్రణ ఆధారంగా వచ్చిన అన్హే ఘోరే డా డాన్(2011) సినిమా కూడా జాతీయ పురస్కారం అందుకుంది.[63] ఎక్కువ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడిన ఏకైక పంజాబీ సినిమా ఇదే. 68వ వెనీస్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడటమే కాక స్పెషల్ జ్యూరీ అవార్డ్ గెలుచుకుంది. అబుదాబీ ఫిలిం ఫెస్టివల్ లో 50వేల డాలర్ల బ్లాక్ పెరల్ ట్రోఫీను కూడా అందుకుంది. 55వ బి.ఎఫ్.ఐ లండన్ ఫిలిం ఫెస్టివల్, 49వ న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్, 16వ బుసాన్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో కూడా ప్రదర్శాంచారు ఈ సినిమాను.[64] పనాజీ, గోవాలో నిర్వహించిన 43వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2012లో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ పికాక్ అవార్డును కూడా గెలుచుకుంది.[65] 1947 భారత విభజన సమయం తరువాత పశ్చిమ పంజాబ్ లో గల పరిస్థితులు, 1970లో ఒక తల్లీ, కొడుకుల కథ ఖామోష్ పానీ(2003) సినిమా కూడా ఈ కోవకు చెందిందే.
షార్ట్ ఫిలిమ్స్
మార్చు- నూరన్(2014), పంజాబీ రచయిత బల్వంత్ గార్గి కథ రబ్బో మరసన్, కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో షార్ట్ ఫిలిం కార్నర్ విభాగంలో ప్రదర్శింపబడింది.[66]
- సుత్తా నాగ్(2014), సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న సుత్తా నాగ్ అనే చిన్న కథ ఆధారంగా తీసిన సినిమా. రచయిత రాం సారూప్ అన్ఖీ. 50ఏళ్ళ క్రితం పంజాబ్ ప్రాంతంలో ఆడవారు అనుభవించిన కష్టనష్టాలు ఇతివృత్తంగా తీసిన సినిమా ఇది. టొరొనొటోలో జరిగిన పంజాబీ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించిన సినిమా ఇది.[67]
- ఖూన్(2015) గురుబచ్చన్ సింగ్ భుల్లార్ రాసిన చిన్న కథ ఆధారంగా తీసిన ఈ సినిమాను కూడా టొరొనొటోలో నిర్వహించిన పంజాబీ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు.[68]
- జిందగీ ఎ లైఫ్ కిన్నెర్(2012), జగ్దేవ్ ధిల్లాన్ కథ ఆధారంగా తీసిన ఈ సినిమా హిజ్రాల జీవితాన్ని, కష్టనష్టాల్నీ కళ్ళకు కడుతూ తీసిన సినిమా. హర్మ అగర్వాల్ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలిం టొరొనొటో పంజాబీ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్, ఢిల్లీ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడింది.[68]
References
మార్చు- ↑ "Pollywood the word for punjabi cinema".
- ↑ "Pollywood directory will furnish contact details of over 1500 eminent personalities and also struggling new comers in the Punjabi film and music industry".
- ↑ "The theme of the film Police in Pollywood - Balle Balle by Gautam Productions is that the police will now direct and produce Punjabi films".
- ↑ "Pollywood Directory (A first of its own kind of initiative to organize Punjabi Cinema)". Archived from the original on 2021-12-23. Retrieved 2016-07-08.
- ↑ "According to NFDC, Punjabi film industry has produced 900 to 1,000 films till 2009".
- ↑ Gokulsing, K.; Wimal Dissanayake (2004). Indian popular cinema: a narrative of cultural change. Trentham Books. p. 24. ISBN 978-1-85856-329-9.
- ↑ Encyclopedia of Indian Cinema.
- ↑ "The Sunday Tribune - Spectrum". tribuneindia.com. Retrieved 30 March 2015.
- ↑ "mazhar.dk - An infotainment website". mazhar.dk. Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 30 March 2015.
- ↑ "The Voice Next Door".
- ↑ "Dukh Bhanjan Tera Naam (1974) Full Cast & Crew".
- ↑ "Sidhu was the man behind the wide release of Jatt and Juliet 2 in Pakistan last October".
- ↑ 13.0 13.1 "Qissa won awards".
- ↑ "This year around 42 films released and 80 percent of those films are similar. They are all comedies, that too slapstick. So, the audience will ultimately get bored of it. We need to make more movies with strong content to make the industry grow".
- ↑ "Punjab 1984, Jatt James Bond and Chaar Sahibzaade, these three films gave the industry the much needed hope and support to run a little more". Archived from the original on 2021-10-27. Retrieved 2016-07-10.
- ↑ "BNN" Archived 2014-12-29 at the Wayback Machine.
- ↑ "Surrey-based Punjabi film Work Weather Wife shortlisted for Academy Award". Archived from the original on 2015-01-15. Retrieved 2016-07-10.
- ↑ "Punjab 1984, Jatt James Bond and Chaar Sahibzaade, these three films gave the industry the much needed hope and support to run a little more". Archived from the original on 2021-10-27. Retrieved 2016-07-10.
- ↑ "Punjabi International Film Academy Awards at Toronto".
- ↑ "The highly anticipated PTC Punjabi Film Awards".
- ↑ "Fourth `Punjabi Film Festival` concludes in Amritsar". Archived from the original on 2016-03-04. Retrieved 2016-07-10.
- ↑ "Amritsar plays host to second Punjabi film festival". Archived from the original on 2016-03-03. Retrieved 2016-07-10.
- ↑ "Film festival will showcase stories from Sikh perspective".
- ↑ "2012 Sikh International Film Festival Guide: Sikhs Explore Pride, Prejudice in Films".
- ↑ "TORONTO SIKH FILM FESTIVAL RETURNS".
- ↑ "Chaitanya's uncourtly tale of law at Chandigarh Cinema Festival". hindustantimes.com/. 30 August 2015. Archived from the original on 5 సెప్టెంబరు 2015. Retrieved 6 September 2015.
- ↑ "Students' strike is a brave act, say three FTII alumni". The Indian Express. 1 September 2015. Retrieved 6 September 2015.
- ↑ "Setting a new benchmark". The Indian Express. 29 August 2015. Retrieved 6 September 2015.
- ↑ "Fourth edition of the Chandigarh Cinema Festival kicks off". hindustantimes.com/. 28 August 2015. Archived from the original on 13 జూలై 2016. Retrieved 6 September 2015.
- ↑ Rohan DuaRohan Dua, TNN (8 October 2013). "Debt-ridden Punjab to end 10-yr waiver of entertainment tax". The Times of India. Retrieved 23 August 2015.
- ↑ "Entertaining a few pleasant thoughts!: As the Punjab finance minister announces 'no more entertainment tax' during the budget session, people related to the entertainment industry raise a toast to a brighter future". Archived from the original on 2016-04-28. Retrieved 2016-07-11.
- ↑ Service, Tribune News (15 March 2016). "Punjab gets election-year budget, strong on social welfare". tribuneindia.com/news/punjab/punjab-gets-election-year-budget-strong-on-social-welfare/209178.html. Archived from the original on 19 ఏప్రిల్ 2016. Retrieved 19 April 2016.
- ↑ India, Press Trust of (28 September 2013). "Punjab to announce new film policy, set up rural cinema halls". Business Standard News. Retrieved 23 August 2015.
- ↑ "Cinema halls in rural Punjab: Sukhbir". hindustantimes.com/. 28 September 2013. Archived from the original on 13 జూలై 2016. Retrieved 23 August 2015.
- ↑ "Punjab to set up film city". Archived from the original on 2016-01-21. Retrieved 2016-07-11.
- ↑ 36.0 36.1 "Bhatti's Joke Factory". Archived from the original on 2014-07-14. Retrieved 2016-07-11.
- ↑ Priya YadavPriya Yadav, TNN (15 May 2013). "Punjab govt sets up Film Institute to promote Punjabi film industry". The Times of India. Retrieved 23 August 2015.
- ↑ "Punjabi Film Tax".
- ↑ "Punjabi community settled in Udham Singh Nagar".
- ↑ "new Punjabi movie "Proud to be a Sikh" is being released in Jammu".
- ↑ "Over 50 per cent of the revenue for all Punjabi films comes from the overseas market. North America leads, followed by the UK. New Zealand is a promising emerging market".
- ↑ "Victoria's romantic air attracts Bollywood film crew".
- ↑ "Victoria meets Bollywood: Punjabi stars shoot film on Inner Harbour".
- ↑ "Big Picture: Craigdarroch Castle turns into little India".
- ↑ "At least 50 percent of the money is recovered from overseas," Sahni said, adding that Canada is a strong market for Punjabi cinema".
- ↑ "Housefull, far & beyond: Punjabi films are now capturing sizeable markets in territories outside Punjab, both in India and abroad".[permanent dead link]
- ↑ "Punjab also has the lowest number of screens in India, a mere 196".
- ↑ "new Multiplexes In Punjab". Archived from the original on 2016-03-31. Retrieved 2016-07-12.
- ↑ "challenge Punjabi filmmakers face is getting satellite rights".
- ↑ "Punjabi film industry do not have many choices for a satellite release".
- ↑ "Punjab to set up own censor board, Central Board of Film Certification miffed".
- ↑ "Akshay Kumar's Punjabi film to be remade in South". Archived from the original on 2013-12-13. Retrieved 2016-07-12.
- ↑ "Punjabi film Singh vs Kaur in its Telugu version". Archived from the original on 2016-02-19. Retrieved 2016-07-12.
- ↑ "Dharmendra to Remake Punjabi Hit 'Double Di Trouble' in Hindi". Archived from the original on 2016-03-03. Retrieved 2016-07-12.
- ↑ "Punjabi movies 'Sardaar Ji', 'Jatt & Juliet 2' to get Telugu adaptation".
- ↑ "Do Sher (Punjabi Dubbed)".
- ↑ 57.0 57.1 "Kochadaiiyaan to release in Tamil, Telugu, Bhojpuri, Hindi, Marathi and Punjabi".
- ↑ "nabar".
- ↑ "Film on 1984 wins National Award".
- ↑ "Only 20 % of Punjabi movies meaningful". Archived from the original on 2015-08-03. Retrieved 2016-07-15.
- ↑ "Reel vs real Punjab".
- ↑ "Independent films are changing the image of Punjabi cinema". Archived from the original on 2016-04-28. Retrieved 2016-07-15.
- ↑ "Gurvinder Singh's "Anhey Gorhey Da Daan" which won multiple National Awards in 2012 deals with the rural working class and the plight of Dalit Sikhs in Bhatinda belt of the State but it is dubbed as niche for an audience which is not considered to be experimental".
- ↑ Jatinder Preet (2011-10-02). "Punjabi Film Making Waves at International Film Festivals". The Sunday Guardian. Archived from the original on 2016-03-04. Retrieved 2016-07-15.
- ↑ "Punjabi cinema's cannes debut". Archived from the original on 2015-07-13. Retrieved 2016-07-15.
- ↑ "'Sutta Naag' was also premiered at the IFFSA, PIFF in 2013". Archived from the original on 2015-09-13. Retrieved 2016-07-15.
- ↑ "Khoon, the film received critical acclaim at the Toronto Punjabi Film Festival". Archived from the original on 2016-03-04. Retrieved 2016-07-15.
- ↑ 68.0 68.1 "Zindagi a life". Archived from the original on 2016-08-15. Retrieved 2016-07-15.