తారక్ పొన్నప్ప
తారక్ పొన్నప్ప కన్నడ సినిమాకు చెందిన భారతీయ నటుడు. అయితే, ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చిత్రాలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో దేవర (2024), పుష్ప 2 (2024)లలో కీలక పాత్రలు పోషించాడు.[1][2]
తారక్ పొన్నప్ప | |
---|---|
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | ఆచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ |
వృత్తి | మోడల్, నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2017 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రాధిక నానయ్య |
కెరీర్
మార్చుఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసిన తారక్ పొన్నప్ప మోడల్ గా కెరీర్ ప్రారంబించి కన్నడ చిత్ర పరిశ్రమలో అజరామర (2017)తో అడుగుపెట్టాడు. 2018లో బృహస్పతి చిత్రంలో నటించాడు. ఆయన విజయవంతమైన పాన్ ఇండియా ఫిల్మ్ సీక్వెల్స్ కె.జి.ఎఫ్: చాప్టర్ 1 (2018), కె.జి.యఫ్ చాప్టర్ 2 (2022)లలో దయా పాత్రను పోషించినందుకు ప్రసిద్ధి చెందాడు.
ఓరియన్ ఫెస్టివల్ ఆఫ్ గివింగ్, కర్ణాటక ఫ్యాషన్ వీక్ (2013), ఫెమినా వెడ్డింగ్ షో (2015) వంటి అనేక ఫ్యాషన్ షోలలో ఆయన మోడలింగ్ చేశాడు. ఆయన జాన్ ప్లేయర్స్, నాకౌట్ సోడా, శశి వంగపల్లి కోచర్ వంటి వివిధ బ్రాండ్‌ల వాణిజ్య ప్రకటటనలోనూ కనిపించాడు. అలాగే, ఆయన కన్నడ టెలివిజన్ ఛానల్ కలర్స్ సూపర్‌లో ప్రసారం అయిన షో రాజా రాణి (2018)లోనూ చేసాడు. విమర్శకుల ప్రశంసలు పొందిన కన్నడ షార్ట్ ఫిల్మ్ ఆవర్త (2019)లో అతను ఆంథోనీ అనే యువ గ్యాంగ్‌స్టర్‌గా ప్రధాన పాత్ర పోషించాడు. ఇది ఆయనకు సైమా(SIIMA) అవార్డ్స్ లో ఉత్తమ నటుడి విభాగంలో అవార్డును తెచ్చిపెట్టింది.
మూలాలు
మార్చు- ↑ "పుష్ప 2 ట్రైలర్.. ఈ అర గుండు నటుడు ఎవరంటే? | Pushpa 2 Trailer Telugu Tarak Ponnappa Half Head Getup | Sakshi". web.archive.org. 2024-12-03. Archived from the original on 2024-12-03. Retrieved 2024-12-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Chitrajyothy (18 November 2024). "Pushpa 2: సినిమా స్వరూపాన్నే మార్చే పాత్ర.. తారక్". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.