తారక రామా తీర్థ సాగరం ప్రాజెక్టు
తారక రామా తీర్థ సాగరం ప్రాజెక్టు, చంపావతి నది నీటిని విజయనగరం జిల్లా వ్యవసాయం, తాగునీటి అవసరాల కొరకు వినియోగించటానికి తలపెట్టిన నీటిపారుదల ప్రాజెక్టు. దీనికి 2005 లో శంకుస్థాపన చేయగా, 2024 లో ఇంకా పనులు కొనసాగుతున్నాయి.[1][2]
వివరాలు
మార్చువై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2005 లో ప్రారంభించారు. బ్యారేజు ద్వారా చంపావతి నీటిని కాలువకు మళ్లించి, నిర్మిస్తున్న జలాశాయంలో నిల్వచేస్తారు. ఈ జలాశయం నుండి, విజయనగరం నగరానికి తాగునీరు, 25,000 ఎకరాలకు సాగు నీరు, భోగాపురం విమానాశ్రయానికి నీరు సరఫరా చేస్తారు.[3]
కోటగండ్రేడు బ్యారేజు
మార్చుకోటగండ్రేడు గ్రామం వద్ద నీటిని మళ్లించే 184 మీటర్ల బ్యారేజు పనులు పూర్తిచేసారు. ప్రాజెక్టులో మిగతా పనులు పూర్తికాకపోవడం వలన ఈ బ్యారేజు వాడకంలో లేదు.
మళ్లింపు కాలువ
మార్చునీటిని నూతనంగా నిర్మిస్తున్న జలాశయానికి తరలించడానికి, 13.8 కిలోమీటర్ల కాలువ నిర్మించాల్సి ఉంది. ఇందులో ఒక కిలోమీటరు పొడవు గల సొరంగాన్ని రామతీర్థం సమీపంలో కొండల వద్ద తవ్వాల్సిఉంది.
జలాశయం
మార్చుకుమిలి, సరిపల్లి, సీతారామునిపేట గ్రామాలను ఆనుకొని జలాశాయాన్ని నిర్మిస్తున్నారు. దీనికి 9 కిలోమిటర్ల పొడువు గల డ్యాము, మూడు డైక్‌లు నిర్మిస్తున్నారు.[4]
భూ సేకరణ
మార్చుప్రాజెక్టు నిర్మాణానికి, 3,448 ఎకరాలు అవసరం. అందులో ఇంకా 230 ఎకరాలు సేకరించాల్సి ఉంది.[3]
వివాదాలు
మార్చుప్రాజెక్టు వ్యయం రూ. 200 కోట్ల నుండి, రూ. 800 కోట్లకు పెరిగి, నిర్మాణం పదే పదే ఆలస్యం కావడంతో, భూ సేకరణ వలన నష్టపోయిన కుటుంబాలు, ఆనకట్ట రైతులు ఆందోళనలు చేసారు.[5]
మూలాలు
మార్చు- ↑ Correspondent, D. C. (2023-04-30). "Jagan to lay foundation stone for Tarakarama project on May 3". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). Retrieved 2024-11-03.
- ↑ India, The Hans (2018-05-12). "Tarakarama Teertha Sagar project remains a distant dream". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-11-03.
- ↑ 3.0 3.1 "యుద్ధ ప్రాతిపదికన 'తారకరామతీర్థ' పనులు | AP Govt Steps To Complete Taraka Rama Tirtha Project | Sakshi". www.sakshi.com. Retrieved 2024-11-03.
- ↑ "TARAKA RAMA THIRTHA SAGARAM RESERVOIR PROJECT".
- ↑ Service, Express News (2022-03-30). "Government to focus on Polavaram rehabilitation and resettlement". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-11-03.