తాలిపేరు నది
(తాలిపేరు నుండి దారిమార్పు చెందింది)
తాలిపేరు నది గోదావరి నదికి ఉపనది. ఇది చత్తీస్‌గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలో పుట్టి, ఖమ్మం జిల్లాలో చర్ల మండలంలో తెలంగాణలో ప్రవేశించి, చర్ల వద్ద గోదావరిలో కలుస్తుంది. ఇది గోదావరికి ఎడమ వైపున ప్రవహించే ఉపనది. ఈ నది పరీవాహక ప్రాంతం 31.46 చ.కి.మీ.
ఈ నదిమీద చర్ల మండలం లోని పెద్దమిడిసిలేరు గ్రామం వద్ద తాలిపేరు ప్రాజెక్టును నిర్మించారు. ఈ ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయాన్ని తాలిపేరు జలాశయం అనిపిలుస్తారు. దీని నుండి రెండు కాలువలు - కుడి, ఎడమ - సాగునీటిని తీసుకువెళ్తాయి. కుడి కాలువ పొడవు 46.46 కి.మీ. పొడవుండగా, ఎడమ కాలువ 10.44 కి.మీ దూరం ప్రవహిస్తుంది. ఈ కాలువల ద్వారా చర్ల, దుమ్మగూడెం మడలాల్లోని 17 గ్రామాల్లో 24,700 ఎకరాల భూమికి సాగునీరు అందుతోంది.[1]
మూలాలు
మార్చు- ↑ "TALIPERU PROJECT" (PDF). తెలంగాణ ప్రభుత్వం. Archived (PDF) from the original on 4 జూన్ 2020. Retrieved 4 జూన్ 2020.