తాలిపేరు ప్రాజెక్టు
తెలంగాణ రాష్ట్రంలోని ఒక మధ్య తరహా నీటిపారుదల పథకం
తాలిపేరు ప్రాజెక్టు (తాలిపేరు రిజర్వాయర్) అనేది తెలంగాణ రాష్ట్రంలోని ఒక మధ్య తరహా నీటిపారుదల పథకం.[1] ప్రాజెక్టు పూర్తిస్థాయి 74 మీటర్లు.
తాలిపేరు ప్రాజెక్టు | |
---|---|
అధికార నామం | తాలిపేరు ప్రాజెక్ట్ |
ప్రదేశం | పెద మిడిసిలెరు, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా |
అక్షాంశ,రేఖాంశాలు | 18°6′10″N 80°51′55″E / 18.10278°N 80.86528°E |
ఆవశ్యకత | నీటి పారుదల |
స్థితి | వాడుకలో ఉంది |
ప్రారంభ తేదీ | 1985 |
నిర్మాణ వ్యయం | రూ 52.98 కోట్లు |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | ఆనకట్ట |
నిర్మించిన జలవనరు | తాలిపేరు నది |
Height | 25 మీటర్లు (82 అడుగులు) |
పొడవు | 2762 మీటర్లు (9062 అడుగులు) |
Spillways | 25 |
Spillway type | వక్రరేఖ చిహ్నం |
Spillway capacity | 53043 క్యూసెక్యులు |
జలాశయం | |
సృష్టించేది | తాలిపేరు రిజర్వాయర్ |
మొత్తం సామర్థ్యం | 0.73 Tmcft |
క్రియాశీల సామర్థ్యం | 0.51 Tmcft |
పరీవాహక ప్రాంతం | 24000 ఎకరాలు |
ప్రదేశం
మార్చుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పెద మిడిసిలెరు గ్రామం దగ్గర తాలిపేరు నది మీద ఈ తాలిపేరు ప్రాజెక్టు నిర్మించబడింది.[2]
లక్ష్యం
మార్చుఈ ప్రాజెక్ట్ 5.0 టి.ఎం.సి నీటిని ఉపయోగించుకుంటూ, ఈ ఆయకట్టు ద్వారా చెర్ల, దమ్ముగూడెం మండలాల్లోని గ్రామాలకు చెందిన సుమారు 25000 ఎకరాలకు సాగునీరును అందిస్తుంది.
నీటి విడుదల
మార్చు- 2018 జూలైలో ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్‌గఢ్ అడవుల్లో కురుస్తున్న వర్షాల వల్ల ఈ ప్రాజెక్టుకు భారీ ఇన్‌ఫ్లోలు రావడంతో 2018 జూలై 12 నాటికి జలాశయంలో నీటిమట్టం 72.97 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టులోని మొత్తం 27 క్రెస్ట్ గేట్లలో 14 గేట్లను తెరిచి 9234 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడుదల చేశారు.[3]
- 2022 సెప్టెంబరులో తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ప్రాజెక్టు 25 గేట్లలో 11 గేట్లను ఎత్తి 22వేల 644 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు.[4]
- 2023 జూలైలో తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో 2023 జూలై 18న 22 గేట్లను రెండడుగుల మేర ఎత్తి 26,958 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.[5]
మూలాలు
మార్చు- ↑ సాక్షి. "తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్ట్‌లు". Retrieved 27 November 2017.
- ↑ "Taliperu Dam D02295". Archived from the original on 2018-09-29. Retrieved 27 November 2017.
- ↑ "Taliperu reservoir brimming". The Hindu. 2018-07-12. ISSN 0971-751X. Archived from the original on 2018-07-13. Retrieved 2023-07-18.
- ↑ Kommuru, Jyothi (2022-09-10). "Taliperu Project: తాలిపేరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద". www.hmtvlive.com. Archived from the original on 2023-07-18. Retrieved 2023-07-18.
- ↑ "Flood Water Flow - భద్రాచలం వద్ద గోదారి పరవళ్లు… పెరుగుతున్న నీటి మట్టం …". Prabha News. 2023-07-18. Archived from the original on 2023-07-18. Retrieved 2023-07-18.