తాళ్ళగూడెం (కామేపల్లి)
ఈ గ్రామం - "తాళ్ళగూడెం (కామేపల్లి)" - పేరు సంబంధిత మండలం పేజీలో లేదు. ఈ పేజీలో ఉన్న సమాచారం సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. లేదా మండలం పేజీలో ఈ గ్రామం వేరే పేరుతో ఉందేమో చూసి, ఉంటే... ఈ రెండు పేజీలను విలీనం చెయ్యాలి |
తాళ్ళగూడెం, ఖమ్మం జిల్లా, కామేపల్లి (ఖమ్మం జిల్లా) మండలానికి చెందిన గ్రామం.[1].
తాళ్ళగూడెం | |
— రెవిన్యూ గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | ఖమ్మం |
మండలం | కామేపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామం గుండా ఖమ్మం-యల్లందు రహదారి పోవుట వలన కామేపల్లి రక్షకబట నిలయం ఇక్కడే నిర్మించారు, మిగిలిన ప్రభుత్వ కార్యాలయములు అన్ని కామేపల్లిలో ఉన్నాయి. ఈ గ్రామంలో తాటి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి.
విద్య
మార్చుఈ గ్రామంలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. విద్యార్థులుపై చదువుల కొరకు దగ్గరలోని శ్రీ సరస్వతి గురుకుల విద్యాలయంపై ఆధారపడతారు.
ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చిన్న గిరిజన గ్రామమయిన "టేకులతండా" ఘనత మాత్రం చాలా పెద్దది. ఈ గ్రామం చదువులపల్లెగా భాసిల్లుతున్నది. ఇక్కడ ఎక్కువమంది చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి అందరికీ ఆదర్శంగా నిలుచుచున్నారు. మొత్తం 511 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 100% అక్షరాస్యత సాధించారు. ఈ గ్రామంలోని మొత్తం 141 గృహాలలో 76 మంది ఉద్యోగులున్నారు. [1]
వ్యవసాయం
మార్చు- వరి
- మిరప
- ప్రత్తి
- ఈ గ్రామంలో రైతులు కామెపల్లి చెరువుపై ఆధారపడును, గాదేపాడు చెరువు నిండి అలుగు పడి, కామెపల్లి చెరువు నిండును. కామెపల్లి చెరువు నిండితే వరి రైతులు నిర్భయంగా వంటారు.
- ప్రత్తి,మిరప రైతులు వర్షాల పైనే అధారపడుతారు.
పాడి
మార్చుఈ గ్రామంలో పశుసంపద ఎక్కువ. మేకలు, గోర్రెలు పెంచేవారు ఎక్కువ. చాల మందికి జీవనాధారం ఇదే.
మూలాలు
మార్చు- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-08.