తిక్కా ఆకుమచ్చ తెగులు
వేరుశనగ పంటలో ముఖ్యంగా తిక్కా ఆకుమచ్చ తెగులు పంటను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. ఈ తెగులు సర్కొస్పోర అరచిడికోల అనే శిలీంద్రం ద్వారా పంటẾకు వ్యాపిస్తుంది. ఈ తిక్క ఆకుమచ్చ తెగులు 2 రకాలు.[1]
ముందుగా వచ్చే ఆకు మచ్చ తెగులు
మార్చులక్షణాలు
మార్చువేరుశెనగ పైరుకు ముందుగా ఈ ఆకుమచ్చ తెగులు సోకుతుంది. కాబట్టి దీనిని ముందుగా వచ్చే ఆకు మచ్చ తెగులు అంటారు . పైరుపై ఈ తెగులు విత్తిన 30 రోజులు తరువాత కనిపిస్తుంది. మొదట ఆకుల పైన చిన్న చిన్న మచ్చలు ఏర్పడును . ఇవి పెరిగి గుండ్రటి 1-10 మిల్లీ మీటర్ల ల వ్యాసం గల గోధుమ వర్ణంగల నల్లటి మచ్చలు ఏర్పడతాయి . ఈ మచ్చ చుట్టూ పసుపు పచ్చని వలయం ఉన్న మచ్చలు ఆకుల పై భాగాన నిర్దిష్టంగా కనిపించును . ఈ శిలీంద్రపు బీజాలు మచ్చపై భాగాన పెరగడం చేత మచ్చలకు నలుపు వర్ణం ఏర్పడును . ఈ మచ్చలు ఆకు అంతటా వ్యాపించి ఆకులు ఎండి రాలిపోవును . ఈ శిలీంధ్రం ఆకు తొడిమె, కాండపు భాగాన్ని కూడా ఆశిస్తుందిి.
ఆలస్యంగా వచ్చే ఆకు మచ్చ తెగులు
మార్చులక్షణాలు
మార్చుఈ తెగులు పంట విత్తిన 40-45 రోజుల తరువాత వేరుశనగ పైరు పై ఈ తెగులు లక్షణాలు కనపడతాయి . ఆకులపైన నిర్దరితమైన చిన్న చిన్న మచ్చలు ఏర్పడి అవి పెరిగి గుండ్రంగా మారి నలుపు లేదా ముదురు గోధుమ వర్గానికి మారును . సామాన్యంగా ఈ మచ్చల చుట్టూ పసుపు పచ్చని పలయాలు ఉండవు . ఆకు, అడుగు భాగాన శిలీంధ్ర బీజాల పెరుగుదల వలన నల్లటి మచ్చలు అగుపడును . ఈ మచ్చలలో శిలీంద్రబీజాల వలయాలుగా ఉండును . ఈ శిలిద్ధం ఆకు తొడిమె, కాండాన్ని కూడా ఆశించును . ఈ ఆకు మచ్చ తెగులు వాతావరణంలో అధిక తేమ కలిగి ఉండి ఉష్ణోగ్రత 26-30సెం.గ్రే, ఉన్నపుడు, వేరుశనగ తరువాత వేరుశనగ వేసినప్పుడు, తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.[2]
వ్యాప్తి
మార్చుఇది విత్తనాలలోను, పంట అవశేషాలలో జీవిస్తుంది . గాలి ద్వారా ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతుంది .
యాజమాన్య పద్ధతులు
మార్చు1.ఆరోగ్యవంతమైన విత్తనానాన్ని ఎన్నుకోవాలి.
2.విత్తనం విత్తేముందు బీజామృతంతో విత్తనశుద్ధి చేయాలి.
3.తెగులును తట్టుకొనే రకాలైన వేమన, నవీన్, తిరుపతి - 3 వంటి రకాలను విత్తుకోవాలి
నివారణ
మార్చుసేంద్రియ నివారణ
మార్చు1. 6లీ. పుల్లటి మజ్జిగను 100 లీ. నీటిలో కలిపి ఎకరా పొలంలో పిచికారి చేయాలి.
2.4లీ. శొంఠి పాల కషాయాన్ని 200 లీ. నీటికి కలిపి ఎకరా పొలంలో పిచికారి చేయాలి.
రసాయన నివారణ
మార్చు1.కార్బండిజం, మాంకోజెట్ ను పొలం పై పిచికారి చేయాలి.[3]
మూలాలు
మార్చు- ↑ "తెగుళ్ల నివారణ". వ్యవసాయ శాఖ తెలంగాణ. Archived from the original on 2021-05-16. Retrieved 2021-05-23.
- ↑ "వేరు శనగకు వైరస్ తెగులు". ప్రజా శక్తి jan 2, 2020.
- ↑ వివిధ పంటలకు వచ్చే చీడ పీడలు వాటి యాజమాన్య పద్ధతులు. ఏకలవ్య ఫౌండేషన్ సేంద్రియ వ్యవసాయం.