వేరుశనగ
వేరుశనగ (ఆంగ్లం : Groundnut) : వేరుశనగ బలమైన ఆహారము. ఇవి నూనె గింజలు. ఈ గింజలలో నూనె శాతం ఎక్కువ. వంట నూనె ప్రధానంగా వీటి నుండే తీస్తారు. భారత్ యావత్తూ పండే ఈ పంట, ఆంధ్రలో ప్రధాన మెట్ట పంట. నీరు తక్కువగా దొరికే రాయలసీమ ప్రాంతంలో ఇది ప్రధాన పంట.
వేరుశనగ | |
---|---|
![]() | |
Peanut (Arachis hypogea) | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | |
Species: | అ. హైపోజియా
|
Binomial name | |
అరాచిస్ హైపోజియా |
వేరుశెనగ జన్మస్దలము దక్షిణ అమెరికా. వేరుశెనగ ఉష్ణ మండల నేలలో బాగా పెరుగుతుంది. గుల్లగా వుండు వ్యవసాయ భూములు అనుకూలం. ఇండియా, ఛైనా, దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా ఖండ దేశాలలో వేరుశెనగ నూనె వాడకం ఎక్కువ. వేరుశనగ 'లెగుమినస్' జాతికి చెందిన మొక్క. శాస్త్రీయ నామం arachis hypogaea legume'. అన్ని రకాల వాతావరణ పరిస్దితులను తట్టుకోగలదు. వేరుశనగ పుష్పాలు బయట ఫలధికరణ చెందిన తరువాత. మొక్క మొదలు చుట్టు భూమిలోనికి చొచ్చుకు వెళ్ళి కాయలుగా మారును.
ప్రాథమిక లక్షణాలుసవరించు
- ఏక వార్షిక గుల్మం
- విపరీత అండాకారంలో ఉన్న 4 పత్రకాలు గల పిచ్ఛాకార సంయుక్త పత్రం.
- గ్రీవస్థంగా సమూహాలుగా ఏర్పడిన పసుపు రంగు పుష్పాలు.
- 1-4 విత్తనాలు గల దీర్ఘవృత్తాకార ద్వివిధారక ఫలాలు.
వేరుశెనగ పంటసవరించు
వేరుశనగ విత్తన మొలక సమయంలో 14-16 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. తొలకరి వర్షాలు అయ్యాక విత్తడం ఆంధ్రలో పరిపాటి. ఆంధ్ర ప్రదేశ్ లో రాయలసీమలో వేరుశనగ సాగు అధికము.పంట కాయకొచ్చు సమయంలో ఉష్ణోగ్రత 23-25 సెంటిగ్రేడ్ డిగ్రీలు వున్నచో పంట దిగుబడి పెరుగును. పంటకాలంలో వర్షపాతం 12.5-17.5 సెం.మీ.వున్నచో మంచిది.పంటను విత్తు సమయములో 12.5-17.5 సెం.మీ., పంట పెరుగు నప్పుడు 37-60 సెం>మీ. వర్షపాతం వున్నచో మంచిది. వేరుశనగను అన్ని సీజనులలో సాగు చెయ్యవచ్చును.కాని వర్షకాలంలోని ఖరిప్ సీజనులో 80% సాగుచెయ్యడం జరుగుచున్నది. అందులో 90% పంటను కేవలం వర్షం మీదనే ఆధార పడి సాగుచెయ్యడం జరుగుచున్నది. దక్షిణ భారతములో ఖరీప్,, రబీ రెండు సీజనులలో వేరుశనగ పంటను సాగు చెయ్యుదురు. నీటి సదుపాయం గల ప్రాంతాలలో వేసవి కాలంలో జనవరి-మార్చి మధ్య తక్కువ సమయంలో పంటకోతకు వచ్చే రకాలను సాగుచెయ్యుదురు. వేరుశనగలో నూనె, ప్రోటీనులు, కార్బోహైడ్రెట్‌లు,, విటమిన్లు అధిక ప్రమాణములో వుండును. అందుచే వేరుశనగ బలవర్దకమైన ఆహారం. వేరుశనగ గింజలో (Kernel) 43-50% వరకు నూనె,25-30% వరకు ప్రోటిన్లు వుండును. వేరుశనగ విత్తనంల నుండి నూనె తీసిన తరువాత ఆయిల్ కేకులో (నూనె తీసిన వేరుశనగ విత్తనంల పిండి) ప్రోటీన్ శాతం పెరుగును. వేరుశనగ పంటకాలము, విత్తనం వైరైటిని బట్టి 90-150 రోజులు వుండును. గుత్తిరకము (Bunch type) పంటకాలము 90-120 రోజులు. వ్యాప్తి (spreading Type) రకము విత్తనము అయ్యినచో పంటకాలం 130-150 రోజులు వుండును. పై రెండు రకాలను ఎక్కువగా వర్షకాలం (ఖరీప్) లోనే సాగు చెయ్యుదురు. చీడ, పీడలను తట్టుకునే శక్తి గల సంకరజాతి (Hybride) వంగడాలను సాగు చెయ్యడం వలన 20% ఎక్కువ దిగుబడి సాధించవచ్చును. మాములు రకము ఎకరానికి 500-600 కేజిలు దిగుబడి యివ్వగా, హైబ్రిడ్ రకము 900-1200 కేజిలు గిగుబడి యిచ్చును. వేరుసనగ కాయ (pod) లో పొట్టు (shell) 25-30%, గింజ (Kernel) 70-75% వుండును. భారతదేశం లోనే పేరుపొందిన కదిరి-3,5,7,9,71 మొదలగు వేరుశనగ వంగడాలు అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయపరిశోధన కేంద్రం వారి సృష్టి.
హైబ్రిడ్ వేరుశెనగ రకాలుసవరించు
కొన్నిరకాల హైబ్రిడ్ రకాలను దిగువన పెర్కొనడ జరిగింది.
1. ICGS 11: యిది ఎక్కువ దిగుబడి యిచ్చు రకము. చీడపీడలను వర్షాభావ పరిస్దితులను బాగా తట్టుకునే రకము.ఎక్కువగా ఖరిప్‌లో సాగుచెయ్యుదురు.పంటకాలం 120 రోజులు.మహరాష్ట్రలో 1.5 టన్నులు, హెక్టారుకు దిగుబడి వచ్చింది.ఆంధ్ర, కర్నాటకలో ట్రయల్‌రన్‌లో 2.5 టన్నుల దిగుబడి వచ్చింది.కాయలో 70% గింజ వుండును.
2. ICGS 44: యిది కూడా ఎక్కువ దిగుబడి యిచ్చు రకం.పంటకాలం 120 రోజులు.వేసవి కాలంలో ఈ పంటను సాగు చెయ్య వచ్చును.వర్షాభావ పరిస్దితులను తట్తుకొగలదు.సరిగా సాగు చెసిన 3-4 టన్నులు, హెక్టారుకు దిగుబడి యిచ్చును.కాయలో గింజ 70%, పొట్టు 30% వుండును.
3.ICGV 86590: యిది బంచ్ రకమునకు చెందినది. పంటకాలము 96-123 రోజులు. చేడ, పీడలను తట్టుకోగలదు.దిగుబడి హెక్టారుకు 3 టన్నుల వరకు ఉంది. ఈ రకమును ఎక్కువగా ఆంధ్ర, కర్నాటక, కేరళ,, తమిళనాడు లలో సాగు చెయుచున్నారు.
4.ICGV 91114 : యిదికూడా బంచ్ రకమునకు చెందిన వంగడము.పంటకాలము 100 రోజులు.తీవ్రమైన వర్షాభావ పరిస్దితులను తట్టుకోగల వంగడం.పంట దిగుబడి 2.5-3 టన్నులు/హెక్టారుకు.గింజ పెద్దదిగా వుండును.
5.ICGV 89104: బంచ్‌రకమునకు చెందినది.పంటకాల్ము 110-120 రోజులు.అప్లొటాక్షిన్, అస్పరిగిల్లస్, ఫంగస్ వంటి వ్యాధులను నిలువరించ గలదు.దిగుబడి 2.0 టన్నులు/హెక్టరుకు.కాయలో 68% గింజ వుండును.
ఉపయోగాలుసవరించు
- వేరుశనగ విత్తనాల నుంచి లభించే వేరుశెనగ నూనె వంటకాలలో ఉపయోగిస్తారు. దీని నుంచి డాల్డా లేదా వనస్పతిని తయారుచేస్తారు. ఈ నూనెలను సబ్బులు, సౌందర్యపోషకాలు, కందెనలుగా వాడతారు.
- వేరుశనగ విత్తనాలు బలమైన ఆహారం. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి.
- నూనె తీయగా మిగిలిని పిండిని ఎరువుగా, పశువులకు, కోళ్ళకు దాణాగా వాడతారు.