తిమింగలము
తిమింగలము (ఆంగ్లం Whale) వెచ్చటి రక్తాన్ని కలిగిన నీటిలో నివసించే ఒక పెద్ద క్షీరదము. చాలాకాలం పూర్వమే సముద్ర ప్రయాణం చేస్తున్న నావికులు భారీ శరీరం, బలమైన తోక కలిగిన ఈ సముద్ర జీవిని గుర్తించడం జరిగింది. వీటిని అమెరికా అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఒకటిగా చేర్చింది. 19, 20 వ శతాబ్దాల్లో తిమింగల వేటగాళ్ళు విపరీతంగా వీటిని వేటాడటంతో ఈ పరిస్థితి నెలకొన్నది..[1] మానవుల్లాగే ఇవి కూడా క్షీరదాలు కావడంతో శ్వాసించడానికి కావల్సిన ఆక్సిజన్ కోసం నీటి ఉపరితలంపైకి వస్తాయి.
తిమింగలాలు Temporal range: Early Eocene - Recent
| |
---|---|
Humpback Whale breaching | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Infraclass: | |
Superorder: | |
Order: | సిటేసియా Brisson, 1762
|
Suborders | |
Mysticeti | |
Diversity | |
[[List of cetaceans|Around 88 species; see list of cetaceans or below.]] |
పరిణామం, వర్గీకరణ
మార్చుసిటేసియా (Cetacea) జీవులు అన్నీ భూమి మీద నివసించే క్షీరదాలైన ఆర్టియోడాక్టిలా క్రమానికి చెందిన జీవుల నుండి పరిణామం చెందాయి. ప్రస్తుతం తిమింగలాలు, హిప్పోపొటమస్ ఈ రెండింటినీ సిటార్టియోడాక్టిలా (Cetartiodactyla) అధిక్రమంలో వర్గీకరించారు. నిజానికి హిప్పోలకు అతి దగ్గరి బంధువులు తిమింగలాలు. ఇవి రెండూ సుమారు 54 మిలియన్ సంవత్సరాల క్రితం ఒకే జంతువు నుండి పరిణామం చెందాయని శాస్త్రజ్ఞుల భావన.[2][3] తిమింగలాలు సుమారు 50 మిలియన్ సంవత్సరాల క్రితం నీటిలో ప్రవేశించాయి.[4]
సిటేసియా జీవుల్ని రెండు ఉపక్రమాలుగా విభజించారు:
- బెలీన్ తిమింగలాలు (Baleen whales): వీటికి బెలీన్ అనే కెరటిన్ తో చేయబడిన జల్లెడ వంటి నిర్మాణము పైదవడకు అమరివుంటుంది. దీని సహాయంతో ప్లాంక్టన్లను నీటి నుండి వడపోస్తుంది.
- దంతపు తిమింగలాలు (Toothed whales): వీటికి దంతాలు ఉంటాయి. వీని సహాయంతో చేపలు, స్క్విడ్లు మొదలైన పెద్ద చేపల్ని ఆహారంగా తీసుకుంటుంది. పరిసరాల్ని శబ్ద తరంగాల ద్వారా స్కానింగ్ చేయడం వీని లక్షణం.
తిమింగలాల వేట
మార్చుతిమింగిలాల వేటను వేలింగ్ (Whaling) అంటారు. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, వివిధ ప్రభుత్వాలు తిమింగలాలు అంతరించిపోతున్న విషయాన్ని గుర్తించాయి. 16వ శతాబ్దం నుండి 20వ శతాబ్దపు మధ్యకాలం వరకు జరిపిన ఈ వేలింగ్ కు ప్రధానమైన కారణం వీటినుండి లభించే నూనె, మాంసం, కొన్ని సుగంధద్రవ్యాలు తయారీ కోసం చంపుతారు.[5]
అంతర్జాతీయ వేలింగ్ కమిషన్ (International Whaling Commission) 1986 సంవత్సరంలో వేలింగ్ పై ఆరు సంవత్సరాల నిషేధాన్ని విధించింది; ఇది ఈ నాటికీ కొనసాగుతుంది.
కొన్ని జాతుల చిన్న తిమింగలాలు ఇతర చేపల వలల్లో చిక్కుకొంటాయి. ముఖ్యంగా టూనా చేపల కోసం వేటాడే వారికి ఇవి లభిస్తాయి. కొన్ని దేశాలలో ఇప్పటికీ తిమింగలాల వేట కొనసాగుతునే ఉన్నది.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-02-14. Retrieved 2009-02-17.
- ↑ Northeastern Ohio Universities Colleges of Medicine and Pharmacy (2007, December 21). "Whales Descended From Tiny Deer-like Ancestors". ScienceDaily. Retrieved 2007-12-21.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Dawkins, Richard (2004). The Ancestor's Tale, A Pilgrimage to the Dawn of Life. Boston: Houghton Mifflin Company. ISBN 0-618-00583-8.
- ↑ "How whales learned to swim". BBC News. 2002-05-08. Retrieved 2006-08-20.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-02-13. Retrieved 2009-02-17.
బయటి లింకులు
మార్చు- WikiAnswers: questions and answers about whales
- Whale Evolution
- Greenpeace work defending whales
- Save the Whales, founded in 1977
- AquaNetwork Marine Mammal Project
- Oldest whale fossil confirms amphibious origins
- Research on dolphins and whales from Science Daily
- Whale and Dolphin Conservation Society - latest news and information on whales and dolphins
- The Oceania Project - Caring for whales and dolphins
- Whales Tohorā Exhibition Minisite from the Museum of New Zealand Te Papa Tongarewa
- Whales in Te Ara the Encyclopedia of New Zealand
- Orca and other whales video at Squid Force