తిరుక్కడల్‌మలై
తిరుక్కడల్‌మలై (ఆంగ్లం: Tirukadalmalai) ఒక పవిత్రమైన క్షేత్రము. ఇది మహాబలిపురంలో నున్నది;, 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి.
ThiruKadalMallai | |
---|---|
![]() | |
Location in తమిళనాడు | |
భౌగోళికాంశాలు : | 12°37′0″N 80°11′55″E / 12.61667°N 80.19861°ECoordinates: 12°37′0″N 80°11′55″E / 12.61667°N 80.19861°E |
పేరు | |
ఇతర పేర్లు: | Sthalasayana Perumal Kovil |
ప్రదేశము | |
దేశం: | India |
రాష్ట్రం: | తమిళనాడు |
జిల్లా: | మహాబలిపురం |
ప్రదేశం: | మహాబలిపురం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | స్థల శయన పెరుమాల్ |
ప్రధాన దేవత: | నిలమంగై తాయార్ |
దిశ, స్థానం: | తూర్పుముఖము |
పుష్కరిణి: | పుండరిక పుష్కరిణి |
విమానం: | గగనాకార విమానము |
ప్రత్యక్షం: | పుండరీక మహర్షి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ శిల్పకల |
వివరాలుసవరించు
స్థలశయనర్ -జిలమంగై నాచ్చియార్ - తార్ష్య నది - తూర్పుముఖము - భుజంగశయనము - గగనాకార విమానము - పుండరీకునకు ప్రత్యక్షము - పూడత్తాళ్వార్, తిరుమంగై ఆళ్వార్లు కీర్తించింది.
విశేషాలుసవరించు
ఇది పూడత్తాళ్వార్ అవతరించిన స్థలము. ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన సన్నిధి శిథిలమై సముద్రతీరమున ఉంది. ఇది శిథిలము కాగా కొంత దూరములో మరొక సన్నిధిని నిర్మించారు. స్వామి స్థలశయనముగా సేవసాయించు క్షేత్రము ఇదియొక్కటియే.
పుండరీక మహర్షి తామర పుష్పములతో స్వామిని అర్చింపబోయెనట. ఆ సమయమున స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపములో వచ్చి ఆకలిగానున్నది ఆహారమునీయమని అడిగెను. అంతట పుండరీకుడు ఆహారమును తీచుకొని వచ్చుటకు వెడలెను. ఇంతలో స్వామి ఆ తామర పుష్పములను అలంకరించుకొని పుండరీక మహర్షి తలచిన రూపములో శయనించెను. మహర్షి తిరిగివచ్చి స్వామిని సేవించి ఆశ్చర్యపడి వారిని స్థలశయనర్ అని సంబోధించిరి.
ఈ క్షేత్రమున గల జ్ఞానప్పిరాన్ సన్నిధి తప్పక సేవింపవలెను. ఇచ్చట స్వామి తిరుమేనిలో తాయార్లు కుడివైపున వుండుటచే ఈ సన్నిధిని వలనెన్ద్రై అని పేరు.