తిరుపతి స్వామి
తిరుపతి స్వామి (1966 - జూన్ 11, 2001) తమిళ, తెలుగు సినిమా దర్శకుడు, విలేకరి. 1998 లో తెలుగులో వచ్చిన గణేష్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించి నంది అవార్డులు అందుకుంది. తర్వాత తెలుగులో నాగార్జున, సౌందర్య ప్రధాన పాత్రల్లో ఆజాద్ (2000), తమిళంలో విజయకాంత్ హీరోగా నరసింహ (2001) అనే చిత్రాలకు దర్శకత్వం వహించాడు. జూన్ 2001 లో చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.[1][2]
తిరుపతిస్వామి | |
---|---|
జననం | 1966 చెన్నై, తమిళనాడు |
మరణం | 2001 జూన్ 11 చెన్నై, తమిళనాడు | (వయసు 31–32)
వృత్తి | సినీ దర్శకుడు, విలేకరి |
క్రియాశీల సంవత్సరాలు | 1998 - 2001 |
జీవిత విశేషాలు
మార్చుతిరుపతి స్వామి చెన్నైలోని వన్నార్‌పేట లోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. అంబేద్కర్ కళాశాల నుండి న్యాయవిద్యలో మాస్టర్స్ పట్టా పుచ్చుకున్నాడు.[3] ఆనంద వికటన్ పత్రికలో జర్నలిస్టుగా పనిచేశాడు.[4][5]
కెరీర్
మార్చుతిరుపతి స్వామి మొదట దర్శకుడు సురేష్ కృష్ణ దగ్గర వీర (1994), బాషా (1995) సినిమాలకు సహాయకుడిగా పనిచేశాడు. తర్వాత 1998 లో వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన గణేష్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం ఐదు విభాగాల్లో నంది పురస్కారం అందుకుంది. 2000 లో ఇతను నాగార్జున కథానాయకుడిగా ఆజాద్ అనే మరో విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2001 లో తమిళ కథానాయకుడు విజయకాంత్ నటించిన నరసింహ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది.[6]
మూలాలు
మార్చు- ↑ "Film Review: Narasimha". The Hindu. 2001-07-20. Archived from the original on 2010-11-26. Retrieved 2014-04-24.
- ↑ "rediff.com, Movies: The Rediff Review: Narasimha". Rediff.com. 2001-08-01. Retrieved 2014-04-24.
- ↑ "No place for sentiments". Chennai Online. Archived from the original on 24 December 2001. Retrieved 12 January 2022.
- ↑ "Indiainfo: Tamil: Interviews - Tirupathi Swami: Home coming". movies.indiainfo.com. Archived from the original on 21 November 2001. Retrieved 12 January 2022.
- ↑ "Entertainment News: Latest Bollywood & Hollywood News, Today's Entertainment News Headlines". Archived from the original on 9 July 2001.
- ↑ "TAMIL CINEMA 2000". cinematoday2.itgo.com. Archived from the original on 19 March 2016. Retrieved 2014-04-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)