గణేష్ (1998 సినిమా)

1998 సినిమా

గణేష్ 1998 లో తిరుపతి స్వామి దర్శకత్వంలో వచ్చిన సినిమా. వెంకటేష్, రంభ, మధుబాల ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటేష్ సోదరుడైన డి. సురేష్ బాబు నిర్మించాడు. తన వృత్తిలో నీతి నిజాయితీగా ఉండే ఒక విలేకరి మెడికల్ మాఫియా వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చెప్పే కథ యిది. ఈ సినిమాకు వెంకటేష్ కు నంది అవార్డు లభించింది.[1] ఈ చిత్రంతో సహా తెలుగులో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన తిరుపతి స్వామి రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

‌గణేష్
దర్శకత్వంతిరుపతి స్వామి
రచనపరుచూరి సోదరులు (మాటలు), తిరుపతి స్వామి (కథ, చిత్రానువాదం)
నిర్మాతదగ్గుబాటి సురేష్ బాబు
తారాగణంవెంకటేష్,
రంభ,
మధుబాల
ఛాయాగ్రహణంకె. రవీంద్రబాబు
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
జూన్ 19, 1998 (1998-06-19)
సినిమా నిడివి
166 నిమిషాలు
భాషతెలుగు

తారాగణం

మార్చు

నిర్మాణం

మార్చు

1997 విజయదశమి రోజు ఈ చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఒకే సారి రెండు చిత్ర నిర్మాణాలు జరుగుతుండేవి. ఒకటి రామానాయుడు ఆధ్వర్యంలో జరిగితే మరొకటి ఆయన పెద్దకొడుకు సురేష్ బాబు ఆధ్వర్యంలో జరుగుతుండేది. ఈ సినిమా నిర్మాణం సురేష్ బాబు నేతృత్వంలో జరిగింది.[2] ఇదే సమయంలో రామానాయుడు శివయ్య చిత్ర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నాడు.[1] దర్శకుడు సురేష్ కృష్ణ శిష్యుడైన తిరుపతి స్వామి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

అభివృద్ధి

మార్చు

తిరుపతి స్వామి స్వయంగా విలేకరి, అభ్యుదయ వాది. తన వృత్తిలో ఎదురైన కొన్ని విస్మయకర సంఘటనల ఆధారంగా కథ తయారు చేసుకున్నాడు. నిర్మాత సురేష్ బాబు దగ్గరకు వెళ్ళి ఆయనను ఒప్పించేదాకా కథలు చెబుతుంటాననీ, ప్రతి దానినీ తన దగ్గర చిత్రానువాదం ఉందని చెప్పాడు. కానీ తిరుపతి స్వామి చెప్పిన మొదటి కథే సురేష్ బాబుకు ఆకట్టుకుంది.[1]

పురస్కారాలు

మార్చు

ఈ చిత్రానికి ఉత్తమ నటుడిగా వెంకటేష్ తో బాటు, ఉత్తమ ప్రతినాయకుడిగా కోట శ్రీనివాసరావుకు, ఉత్తమ సంభాషణల రచయితగా పరుచూరి సోదరులకు, ఉత్తమ రూపశిల్పిగా రాఘవకు, మూడవ ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాలు అందుకున్నది. ఆ సమయంలో తన కెరీర్లో చేసిన మంచి సినిమాల్లో దీన్ని ఒకటిగా వెంకటేష్ పేర్కొన్నాడు.[2]

పాటలు

మార్చు
  • ఆదా బర్సే అందరికి ఆదాబర్సే (గానం: మనో)
  • అయ్యో రామా అయ్యో రామా (గానం: ఉదిత్ నారాయణ్)
  • సిరి సిరి మువ్వలు (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
  • హిందీలోనా చుమ్మా (గానం: మనో)
  • రాజహంసవో (గానం: హరిహరన్)

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 యు., వినాయకరావు (2014). మూవీ మొఘల్. హైదరాబాదు: జయశ్రీ పబ్లికేషన్స్. p. 237.[permanent dead link]
  2. 2.0 2.1 "మెడికల్ మాఫియాపై 'గణేష్' పంజా - Nostalgia". iDreamPost.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-09-23. Retrieved 2020-08-29.