తిరుపతి - జమ్ము తావి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్
తిరుపతి - జమ్ము తావి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు యొక్క పూర్తిగా 3-టైర్ ఎసి స్లీపర్ బోగీలు కలిగిన రైలు. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి ని, జమ్మూ, కాశ్మీర్‌లోని జమ్మూ తావిని కలుపుతుంది. ఇది ప్రస్తుతం వారాంతములో (వీక్లీ బేసిస్) 22705/22706 రైలు నంబర్లతో నడుపుతున్నారు. [1][2]
సారాంశం | |
---|---|
రైలు వర్గం | హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ |
తొలి సేవ | 15 జూన్ 2017 |
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే |
మార్గం | |
మొదలు | తిరుపతి (TPTY) |
ఆగే స్టేషనులు | 12 |
గమ్యం | జమ్ము తావి (JAT) |
ప్రయాణ దూరం | 2,985 కి.మీ. (1,855 మై.) |
సగటు ప్రయాణ సమయం | 51 గం. 55 ని.లు |
రైలు నడిచే విధం | వీక్లీ[a] |
సదుపాయాలు | |
శ్రేణులు | ఎసి 3 టైర్ |
కూర్చునేందుకు సదుపాయాలు | లేదు |
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది |
ఆహార సదుపాయాలు | ఉంది |
చూడదగ్గ సదుపాయాలు | Large windows |
వినోద సదుపాయాలు | లేదు |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | 2 |
పట్టాల గేజ్ | బ్రాడ్ గేజ్ |
వేగం | 57 km/h (35 mph) విరామములతో సగటు వేగం |
సర్వీస్
మార్చు- రైలు నం. 22705 / తిరుపతి - జమ్ము తావి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం ప్రారంభమవుతుంది. ఇది 56 కి.మీ/గం. సరాసరి వేగంతో 2985 కి,మీ, దూరాన్ని గం.51 : 50 ని.లలో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది.
- రైలు నం. 22706 / జమ్ము తావి - తిరుపతి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ప్రారంభమవుతుంది. ఇది 55 కి.మీ./గం. సరాసరి వేగంతో 2985 కి,మీ, దూరాన్ని గం. 53 : 55 ని.లలో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది.
ప్రయాణ మార్గం
మార్చుఈ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్(22705) ప్రతి మంగళవారం సాయంత్రం గం.5.10 ని.కి తిరుపతి నుంచి బయల్దేరి గురువారం రాత్రి గం.9.10 ని.కి జమ్ము తావి చేరుకుంటుంది. తిరుపతి నుంచి రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఆదోనీ, మంత్రాలయం రోడ్డు, రాయచూర్ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది. అక్కడ్నుంచి ఖాజీపేట, రామగుండం, నాగపూర్, ఢిల్లీ, అంబాలా, లూథియానా, మీదుగా జమ్ముతావి వెళుతుంది.
బోగీలు
మార్చురైలు, స్టేషన్ల గురించి సమాచారాన్ని చూపించడానికి ఎల్‌ఈడి స్క్రీన్ ప్రదర్శన యొక్క లక్షణాలతో భారతీయ రైల్వేలు రూపొందించిన పూర్తిగా 3-టైర్ ఎసి ఎల్‌హెచ్‌బి కోచ్లు, రైలు వేగం మొదలైనవి, ప్రకటన వ్యవస్థ ఉంటుంది. ఇది టీ, కాఫీ, పాలు, వెండింగ్ యంత్రాలు, కంపార్ట్మెంట్లో బయో టాయిలెట్లను కూడా, సిసిటివి కెమెరాలు కలిగి ఉంది.
కూర్పు
మార్చుఈ రైలులో పదహారు ఎసి III టైర్ కోచ్లు, ఒక ప్యాంట్రీ కార్, రెండు జెనరేటర్ పవర్ కార్ కోచ్లు ఉంటాయి.
- 16 ఎసి III టైర్
- 1 ప్యాంట్రీ కార్
- 2 జనరేటర్ పవర్ కార్
లోకో లింకు
మార్చుఈ రైలు లాలాగూడా లోకో షెడ్ యొక్క డబ్ల్యుఎపి-4 లేదా డబ్ల్యుఎపి-7 ఇంజను ద్వారా లాగబడుతుంది.
ఇవి కూడా చూడండి
మార్చునోట్స్
మార్చు- ↑ Runs once in a week for every direction.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-03-27. Retrieved 2018-05-25.
- ↑ http://www.indianrail.gov.in/mail_express_trn_list.html