తిరుప్పాణ్ ఆళ్వార్

(తిరుప్పానాళ్వార్ నుండి దారిమార్పు చెందింది)

తిరుప్పాణ్ అల్వార్ లేదా తిరుపనాళ్వార్ హిందూ మతంలో వైష్ణవ సంప్రదాయానికి అనుబంధంగా పేరుగాంచిన దక్షిణ భారతదేశంలోని పన్నెండు మంది ఆళ్వారులలో ఒకడు. అళ్వార్ల శ్లోకాలను నలైరా దివ్య ప్రబంధం గా సంకలనం చేశారు. వైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు 108 ఉన్నాయి. 108 దేవాలయాలు వైష్ణవ దివ్య దేశాలుగా వర్గీకరించబడ్డాయి. పన్నిద్దరు (12) ఆళ్వారులు తమ రచనలయిన పాశురములలో ఈ 108 విష్ణు రూపాలను కొలిచారు. తిరుప్పాణాళ్వార్ పన్నెండు అళ్వార్ల క్రమంలో పదకొండవ వాడిగా పరిగణించబడతాడు.

తిరుప్పాణ్ ఆళ్వార్
అల్వర్తిరునగరి ఆలయం లో తిరుపాన్ యొక్క గ్రానైట్ విగ్రహంతో పాటు ఉత్సవ విగ్రహం
వ్యక్తిగతం
జననం2760 BCE[1][2]
ఉరయూర్
మతంహిందూ
Philosophyవైష్ణవం, భక్తి
Senior posting
Literary worksఅలలానాతి పిరాన్
Honorsఆళ్వారులు

హిందూ పురాణం ప్రకారం అతను పానార్ కులానికి చెందిన దంపతులకు జన్మించాడు. తిరుప్పాణాళ్వార్ శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం లోని ప్రధాన దైవం రంగనాథస్వామికి అనుబంధంగా ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అతను ఆ దైవంలోనే ఐక్యం అయినట్లు నమ్ముతారు.

తిరుప్పాణాళ్వార్ యొక్క పది శ్లోకాలను అమలనాతిపిరన్ అని పిలుస్తారు. అతని రచనలు నాలాయిరం దివ్య ప్రబంధంలోని 4000 చరణాలలో పది శ్లోకాలు. తిరుప్పాణాళ్వార్ రచనలు వైష్ణవ మతం యొక్క తాత్విక, వేదాంత ఆలోచనలకు దోహదపడ్డాయి.

దక్షిణ-భారత వైష్ణవ దేవాలయాలలో తిరుపనాళ్వార్ చిత్రాలు ఉంటాయి. అతనితో సంబంధం ఉన్న ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. తిరుపనాళ్వార్ అవతార ఉత్సవం శ్రీరంగంలో జరుపుతారు. వోరైయూర్‌లోని అఘగియా మనవాలా పెరుమాళ్ ఆలయంలో పది రోజులు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. తిరుప్పాణాళ్వార్, ఇతర అళ్వార్ర్‌ల శ్లోకాలు రోజువారీ ప్రార్థనలలో భాగంగా దక్షిణ భారతదేశంలోని చాలా విష్ణు దేవాలయాలలో పఠిస్తారు.

ఆళ్వారులు

మార్చు

ఆళ్వారులు లేదా అళ్వార్లు శ్రీవైష్ణవ సంప్రాదాయంలోనూ, తమిళ సాహిత్యంలోనూ విశిష్టమైన స్థానం కలిగిన విష్ణు భక్తులు. తమ పాశురాలతో విష్ణువును కీర్తించి దక్షిణాదిన భక్తి సంప్రదాయాన్ని పరిమళింపజేశారు. వీరు పాడిన (రచించిన) పాశురాలు అన్నీ (నాలుగు వేలు) కలిపి దివ్య ప్రబంధం లేదా నాలాయిరం లేదా ద్రవిడ వేదం అనబడుతాయి. భక్తి, పారవశ్యము, శరణాగతి - ఇవి ఈ అళ్వారుల జీవితంలోనూ, రచనలలోనూ, వారిని గురించిన గాథలలోనూ ప్రముఖంగా కానవచ్చే అంశాలు. ఆళ్వారులు అందించిన సాంస్కృతిక వారసత్వం వలన వైదిక కర్మలతోనూ, సంస్కృతభాషా సాహిత్యాలతోనూ ప్రగాఢంగా పెన వేసుకొని పోయిన హిందూ మతాచారాలు దక్షిణాదిన కొంత స్వతంత్రతను సంతరించుకొన్నాయి.[3] కుల వ్యవస్థను తోసిపుచ్చడం కూడా ఆళ్వారుల జీవితంలోనూ, శ్రీవైష్ణవ సిద్ధాంతాలలోనూ ముఖ్యమైన అంశాలు. ఆళ్వారుల ఔన్నత్యాన్ని గురించి ఎన్నో అలౌకికమైన ఘటనలు, మహత్తులు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఆళ్వారులు అందరూ దైవాంశ సంభూతులనీ, సామాన్య జనానీకానికి భక్తిని ప్రబోధించి శ్రీమన్నారాయణుని పదపద్మాలను చేరుకొనే మార్గాన్ని ఉపదేశించిన మహనీయులనీ ప్రధానమైన విశ్వాసం.శైవభక్తుల చరిత్రనుగూర్చి పెరియ పురాణము అను గ్రంథముతెలుపునట్లే వైష్ణవాచార్యుల చరిత్రను తెలిపేది గురుపరంపర అనుగ్రంథము. అందు వీరిని గూర్చి అనేకమైన అద్భుత కథలు ఉన్నాయి.

ప్రారంభ జీవితం

మార్చు

[4] తిరుప్పాణ్ ఆల్వార్ 8 లేదా 9 వ శతాబ్దంలో శ్రీరంగం సమీపంలోని అలగపురి అనే చిన్న గ్రామంలో రోహిణి నక్షత్రం లో బుధవారం పుర్తుర్మాది సంవత్సరంలో కార్తిగై (నవంబరు-డిసెంబరు) నెలలో జన్మించాడు. పానార్లు సంగీతకారులు, సాంప్రదాయ సంగీత పాటలు పాడే కులానికి చెందినవారు. వారు ప్రేక్షకులను పారవశ్యం, ఆనందం కలిగించే సంగీతాన్నందించే సామర్థ్యం కలిగి ఉండెవారు.[5] తరువాత సాంప్రదాయ ఇతిహాసాల ప్రకారం తమిళ పానార్ సమాజాన్ని చారిత్రాత్మకంగా బహిష్కరించినట్లుగా తెలుస్తుంది. అయితే వారు పళనియప్పన్ వారు ఎప్పుడూ బహిష్కరించబడలేదు లేదా అంటరానివారు కాదు అని తెలిపాడు. తమిళ హాజియోగ్రాఫికల్ సాహిత్యం ప్రకారం ఈ సమాజం సాంప్రదాయకంగా అంటరానివారిగా పరిగణించబడింది. వాస్తవానికి వారు ఈ రోజు వరకు అంటరానివారు కాదు. వాస్తవానికి మధ్యయుగ శాసనాల ప్రకారం వారి సంస్కృత నాటకాన్ని ప్రదర్శించడానికి దేవాలయాలలో ఆలయ నృత్యకారులుగా పాటలు పాడినట్లు, శిక్షణ ఇవ్వడానికి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి.[6] పళనియప్పన్ అందులో ఇలా పేర్కొన్నాడు: "పానార్ల సామాజిక స్థితికి సంబంధించిన సాంప్రదాయిక అభిప్రాయాల గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మధ్యయుగ కాలంలో తమిళనాడులో వాస్తవానికి నివసిస్తున్న పానార్ల గురించి ఎటువంటి నిజమైన డేటా వారికి తెలియజేయబడలేదు. ఇటువంటి నిజమైన డేటా మనకు తమిళ శాసనాల నుండి వాస్తవంగా అందుబాటులో ఉంది. ఇది పానార్ల యొక్క సామాజిక స్థితి యొక్క భిన్నమైన చిత్రాన్ని ప్రదర్శిస్తుంది ".

అతను విష్ణు ఛాతీపై ఉన్న చిన్న గుర్తు యొక్కఅంశ (రూపం) అని నమ్ముతారు (పురాణాల ప్రకారం అందరు ఆళ్వార్లు విష్ణువు యొక్క కొంత భాగానికి అవతారాలు), దీనిని శ్రీమన్నారాయణుని ఛాతీపై శ్రీవత్సం అని పిలుస్తారు.

మూలాలు

మార్చు
  1. L. Annapoorna (2000). Music and temples, a ritualistic approach. p. 23. ISBN 9788175740907.
  2. Sakkottai Krishnaswami Aiyangar (1911). Ancient India: Collected Essays on the Literary and Political History of Southern India. pp. 403–404. ISBN 9788120618503.
  3. "About Alvars". divyadesamonline.com divyadesamonline.com. Archived from the original on 2007-06-21. Retrieved 2 July 2020.
  4. Govindāchārya 1902, pp. 137-138
  5. Rajarajan, R.K.K. "Master-Slave Ambivalence in the hagiography of the Āḻvārs" (in ఇంగ్లీష్). {{cite journal}}: Cite journal requires |journal= (help)
  6. Palaniappan, S. "Hagiography Versus History: The Tamil Pāṇar in Bhakti-Oriented Hagiographic Texts and Inscriptions", Hagiography Versus History”, 2016.

బాహ్య లంకెలు

మార్చు