తిరువనంతపురం మెయిల్
'తిరువనంతపురం మెయిల్' (మలయాళం: തിരുവനന്തപുരം മെയിൽ), (తమిళం: திருவனந்தபுரம் மெயில்), (తిరువనంతపురం మెయిల్ / చెన్నై మెయిల్) రోజువారీ తిరువనంతపురం, ఛెన్నై మధ్య నడుస్తున్న ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.[1][2] ఇది భారతీయ రైల్వేలు లోని దక్షిణ రైల్వే జోన్ లో అత్యంత ప్రతిష్ఠాత్మక రైళ్లు యందు ఇది ఒకటి. ఈ రైలు కొట్టాయం ద్వారా నడుస్తుంది. ఈ రైలు దక్షిణ భారతదేశం లోని (తిరువంతపురం, కొల్లం, కొచీ, త్రిస్సూర్, కోయంబత్తూరు, చెన్నై) ఆరు (6) పెద్ద నగరాలను కలుపుతుంది.
సారాంశం | |
---|---|
స్థానికత | తమిళనాడు, కేరళ |
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ రైల్వే జోన్ |
మార్గం | |
మొదలు | తిరువనంతపురం సెంట్రల్/చెన్నై సెంట్రల్ |
ఆగే స్టేషనులు | 18 |
గమ్యం | చెన్నై సెంట్రల్/తిరువనంతపురం సెంట్రల్ |
ప్రయాణ దూరం | 909 కి.మీ. (565 మై.) |
సగటు ప్రయాణ సమయం | 16 గం. 00 ని.లు తిరువనంతపురం వైపు, 16 గం. 40 ని.లు చెన్నై వైపు |
రైలు నడిచే విధం | ప్రతిరోజు |
రైలు సంఖ్య(లు) | 12623 / 12624 |
సదుపాయాలు | |
శ్రేణులు | మొదటి ఎసి, 2 టైర్ ఎసి, 3 టైర్ ఎసి, స్లీపర్ క్లాస్, జనరల్ |
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది |
పడుకునేందుకు సదుపాయాలు | కోచేట్టే కార్ |
ఆటోర్యాక్ సదుపాయం | లేదు |
ఆహార సదుపాయాలు | ఉంది |
చూడదగ్గ సదుపాయాలు | పెద్ద కిటికీలు |
వినోద సదుపాయాలు | లేదు |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | 7 |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
విద్యుతీకరణ | 25 కెవి ఎసి 50 హెర్ట్జ్ |
వేగం | ఈరోడ్ జంక్షన్, చెన్నై సెంట్రల్ మధ్య 110 కి.మీ./గం. → విరామాలతో 80 కి.మీ./గం. చేరుతుంది. |
చరిత్ర
మార్చురైలు 1940 సం.లో, నం..19 / 20 వంటి నంబర్లతో మద్రాసు - కొచ్చిన్ హార్బర్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ పేరుతో పరిచయం చేయబడింది. తరువాత మద్రాసు - కొచ్చిన్ హార్బర్ టెర్మినస్ మెయిల్ అనే పేరుగా నామకరణం చేయబడింది. డీజిల్ ఇంజను (లోకో) 1961 సం.లో ఈ రైలుకు ఇవ్వబడింది. కొట్టాయం ద్వారా తిరువనంతపురం సెంట్రల్ వరకు రైలు మార్గము అనుసంధానం పూర్తయిన పిదప, ఈ రైలును తరువాత తిరువనంతపురం వరకు విస్తరించారు.
మరిన్ని విశేషాలు
మార్చుగతంలో ఈ రైలుకు డబ్ల్యుఎపి-4 విద్యుత్తు ఇంజనుతో అనుసంధానించ బడింది. ఆ త్రువాత ఇప్పుడు డబ్ల్యుఎపి-7 ఇంజను ద్వారా నడుస్తున్నది. దక్షిణ రైల్వే యందు డబ్ల్యుఎపి-7 ఇంజను ద్వారా నడుస్తున్న అతి కొద్ది రైళ్లు యందు ఇది ఒకటి. ఎర్నాకుళం - తిరువంతపురం రైలు మార్గము (లైన్) విద్యుద్దీకరణ పూర్తి కాక ముందు ఏ ప్రత్యామ్నాయం లేదు, కానీ రెండు డబ్ల్యుడిఎంలు (ఈరోడ్ డీజిల్ లోకో షెడ్ నుండి ) ద్వారా ఈ రైలును నడిపించ బడ్డది. ఒకే డబ్ల్యుడిఎం డీజిల్ లోకోమోటివ్ నకు పరిమిత హాలింగ్ సామర్ధ్యం ఉండుట వలన, 110 కి.మీ./గం. వద్ద ఈ 24 కోచ్‌లు రైలు నడుపుటకు రెండు డీజిల్ వాహనములు ఉపయోగించుటకు కారణం అయ్యింది. విద్యుదీకరణ తరువాత, ఒకే ఒక డబ్ల్యుఎపి4 విద్యుత్ లోకోమోటివ్ నకు మొత్తం రైలును నడుపుటకు తగినంత సామర్ధ్యం ఉంది. ఆ తరువాత డబ్ల్యుఎపి-7 ఇంజను ఈ రైలుకు అనుసంధానించ బడింది. ఆ విధంగా భారతీయ రైల్వేలు యందు ఒక లోకోమోటివ్ వెంటనే ఎకాఎకీగా పొదుపు చేయబడింది. అలాగే వేగంగా త్వరణం లభించుట వలన కారణంగా సమయం ఎంతో ఆదా అవుతూ ఉంది.
సమయములు
మార్చుభారతీయ రైల్వేలు యొక్క రైళ్ళ సంఖ్యా వ్యవస్థ ప్రకారం, రైలుకు ప్రస్తుతం డౌన్ దిశలో ప్రయాణం కోసం సంఖ్య 12623 (చెన్నై సెంట్రల్ - తిరువనంతపురం సెంట్రల్), అప్ దిశలో కోసం సంఖ్య 12624 (చెన్నై సెంట్రల్ - తిరువంతపురం సెంట్రల్) కేటాయించబడింది. క్రిందకి ప్రయాణం దిశలో, రైలు గంటల 19.45 ని.ల వద్ద బయలుదేరి, గంటల 11.45 ని.లకు తదుపరి రోజు తిరువనంతపురం చేరుకుంటుంది. ఎగువ దిశలో, రైలు 14.50 గంటలకు బయలుదేరి 07.30 గంటలకు చెన్నై చేరుకుంటుంది. దీని సమయములు కేరళలోని అత్యంత కచ్చితమైన సమయ పాలనలు ప్రత్యేకంగా కాయంకుళం జంక్షన్ (KYJ), ఎర్నాకుళం నార్త్ (ERN) మధ్య నివసిస్తున్న ప్రజల సేవల కొరకు పాటించే వాటిలలో ఇది ఒకటి. విరామములు ఈ ప్రాంతంలో ఎక్కువ, రైలు ప్రధానంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల కోసమే అని సంకేతం చూపిస్తుంది. ఇది 60 కి.మీ./ గం.కు సగటు వేగంతో నడుస్తుంది. దీని గరిష్ఠ వేగం 90 కి.మీ./ గం. చెన్నై - కాట్పాడి - - సేలం - ఈరోడ్ - పాలక్కాడ్ - త్రిస్సూర్ ప్రాంతం మార్గములో ఉంటుంది. ఇటీవల నవీకరణలను ప్రకారం చెన్నై - కాట్పాడి - సేలం - ఈరోడ్ - పాలక్కాడ్, త్రిస్సూర్ ప్రాంతములలో ఇది కూడా 120 కి.మీ./ గం.కు వేగాన్ని తాకినా తాకుతుంది.
ఈ రైలు శతాబ్ది / రాజధాని రైళ్ళు కాని వాటిలో ఇది ఒకటి. దీనికి జోలార్‌పేట జంక్షన్ స్టేషను వద్ద విరామం (హల్ట్) లేదు. చెన్నై - కోయంబత్తూర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ 70 కి.మీ./ గం.కు వేగంతో 7 గంటల 495 కి.మీ. దూరాన్ని పూర్తి చేయండంలో తిరువనంతపురం మెయిల్ కూడా చెన్నై - కోయంబత్తూర్ విభాగంలో, దానితో పాటుగా వేగంగా ప్రయాణించే రైలు అనే రికార్డును కలిగి ఉంది.
కోచ్ కూర్పు
మార్చుకేరళ లోని ఎ/సి మొదటి తరగతి కోచ్‌లు కలిగిన చాలా కొన్ని రైళ్లు యందు తిరువనంతపురం మెయిల్ ఒకటి. రైలుకు ఎ/సి ఫస్ట్ క్లాస్, ఎ/సి 2-టైర్, ఎ/సి 3-టైర్, రెండవ తరగతి స్లీపర్, సాధారణ కంపార్ట్మెంట్లు కలిగి మొత్తం 24 కోచ్‌లు ఉన్నాయి.
విరామాలు
మార్చు- తిరువనంతపురం సెంట్రల్
- వర్కాల శివగిరి
- కొల్లాం జంక్షన్
- కాయంకుళం
- మవేలికర
- చెంగన్నూర్
- తిరువల్ల
- చంగనస్సేరి
- కొట్టాయం
- త్రిప్పునితర
- ఎర్నాకుళం టౌన్
- అలూవా
- అన్గామాలి
- త్రిస్సూర్
- పాలక్కాడ్ జంక్షన్
- కోయంబత్తూర్ జంక్షన్
- ఈరోడ్ జంక్షన్
- సేలం జంక్షన్
- కాట్పాడి జంక్షన్
- చెన్నై సెంట్రల్
తిరువనంతపురం సెంట్రల్‌లో బయలుదేరు రైళ్ళు
మార్చుతిరువనంతపురం సెంట్రల్‌లో బయలుదేఱి వివిధ ప్రాంతములకు పోవు ఎక్స్ ప్రెస్ రైళ్ళ పట్టిక
సంఖ్య | రైలు సంఖ్య | గమ్య స్థానము | రైలు పేరు |
---|---|---|---|
1. | 16723/16724 | చెన్నై ఎగ్మోర్ | అనంతపురి ఎక్స్ ప్రెస్ |
2. | 12623/12624 | చెన్నై సెంట్రల్ | చెన్నై మెయిల్ |
3. | 12695/12696 | చెన్నై సెంట్రల్ | చెన్నై ఎక్స్ ప్రెస్ |
4. | 12697/12698 | చెన్నై సెంట్రల్ | చెన్నై వీక్లీ ఎక్స్ ప్రెస్ |
5. | 22207/22208 | చెన్నై సెంట్రల్ | చెన్నై ఏ.సి. ఎక్స్ ప్రెస్ |
6. | 16331/16332 | ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్ | ముంబై ఎక్స్ ప్రెస్ |
7. | 16345/16346 | ముంబై లోకమాన్య తిలక్ టర్మినస్ | నేత్రావతి ఎక్స్ ప్రెస్ |
8. | 12625/12626 | క్రొత్త ఢిల్లీ | కేరళ ఎక్స్ ప్రెస్ |
9. | 12431/12432 | హజ్రత్ నిజాముద్దీన్ | రాజధాని ఎక్స్ ప్రెస్ |
10. | 12643/12644 | హజ్రత్ నిజాముద్దీన్ | స్వర్ణ జయంతి ఎక్స్ ప్రెస్ (ఆలప్పుళ మీదుగా) |
11. | 22633/34 | హజ్రత్ నిజాముద్దీన్ | నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ (ఆలప్పుళ మీదుగా) |
12. | 22653/54 | హజ్రత్ నిజాముద్దీన్ | నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ (కోటయం మీదుగా) |
13. | 22655/56 | హజ్రత్ నిజాముద్దీన్ | నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ (ఆలప్పుళ మీదుగా) |
14. | 16323/16324 | షాలీమార్ | షాలీమార్ ఎక్స్ ప్రెస్ |
15. | 16325/16326 | ఇండోర్ | అహల్యానగరి ఎక్స్ ప్రెస్ |
16. | 22647/22648 | కోర్బా | కోర్బా ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా) |
17. | 16333/16334 | వేరావల్ | వేరావల్ ఎక్స్ ప్రెస్ |
18. | 12515/12516 | గౌహతి | గౌహతి ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా) |
19. | 12507/12508 | గౌహతి | గౌహతి ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా) |
20. | 16347/16348 | మంగుళూరు సెంట్రల్ | మంగుళురు ఎక్స్ ప్రెస్ |
21. | 16603/16605 | మంగుళూరు సెంట్రల్ | మావేళి ఎక్స్ ప్రెస్ |
22. | 16629/16630 | మంగుళూరు సెంట్రల్ | మలబార్ ఎక్స్ ప్రెస్ |
23. | 17229/17230 | హైదరాబాదు దక్కన్ | శబరి ఎక్స్ ప్రెస్ |
24. | 12511/12512 | గోరఖ్ పూర్ | రప్తి సాగర్ ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా) |
25. | 12075/12076 | కోళిక్కోడ్ (లేక క్యాలికట్) | కోళిక్కోడ్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ |
26. | 12081/12082 | కణ్ణూర్ | కణ్ణూర్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ |
27. | 16301/16302 | షోర్నూరు | వేనాడు ఎక్స్ ప్రెస్ |
28. | 16303/16304 | ఎఱణాకుళము | వాంచాడు ఎక్స్ ప్రెస్ |
29. | 16341/16342 | గురువాయూరు | ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్ |
30 | 16343/16344 | పాలక్కాడు టౌన్ (లేక పాల్ఘాట్) | అమృతా ఎక్స్ ప్రెస్ |
31. | 16349/16350 | నీలాంబూరు రోడ్డు | రాజ్య రాణి ఎక్స్ ప్రెస్ |
తిరువనంతపురం సెంట్రల్ నుండి బయలుదేఱు ప్యాసింజర్ రైళ్ళ పట్టిక
సంఖ్య | రైలు సంఖ్య | గమ్య స్థానము |
---|---|---|
1. | 56313 | నాగర్ కోవిల్ |
2. | 56311 | నాగర్ కోవిల్ |
3. | 56315 | నాగర్ కోవిల్ |
తిరువనంతపురం సెంట్రల్ మీదుగా పోవు ఎక్స్ ప్రెస్ రైళ్ళ పట్టిక
సంఖ్య | రైలు సంఖ్య | ఆరంభ స్థానము | గమ్య స్థానము | రైలు పేరు |
---|---|---|---|---|
1. | 16605/16606 | నాగర్ కోవిల్ | మంగుళూరు | ఎర్నాడు ఎక్స్ ప్రెస్ |
2. | 12659/12660 | నాగర్ కోవిల్ | షాలిమార్ | గురుదేవ్ ఎక్స్ ప్రెస్ |
3. | 16335/16336 | నాగర్ కోవిల్ | గాంధీధాం | నాగర్ కోవిల్-గాంధీధాం ఎక్స్ ప్రెస్ |
4. | 16381/16382 | కన్యకుమారి | ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్ | కన్యకుమారి-ముంబై ఎక్స్ ప్రెస్ |
5. | 16525/16526 | కన్యకుమారి | బెంగుళూరు | ఐల్యాండ్ ఎక్స్ ప్రెస్ |
6. | 16317/16318 | కన్యకుమారి | జమ్మూ టావి | హిం సాగర్ ఎక్స్ ప్రెస్ |
7. | 19577/19578 | తిరునెల్వేలి | హాప | తిరునెల్వేలి- హాప ఎక్స్ ప్రెస్ |
8. | 22619/22620 | తిరునెల్వేలి | బిలాస్పూర్ | బిలాస్పూర్ ఎక్స్ ప్రెస్ |
9. | 15905/15906 | కన్యకుమారి | డిబ్రూఘర్ | వివేక్ ఎక్స్ ప్రెస్ * |
10. | 16127/16128 | గురువాయూరు | చెన్నై ఎగ్మోర్ | గురువాయూరు-చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్ |
11. | 16649/16650 | నాగర్ కోవిల్ | మంగుళూరు సెంట్రల్ | పరశురాం ఎక్స్ ప్రెస్ |
- వివేక్ ఎక్స్ ప్రెస్ దేశములో అత్యధిక దూరము ప్రయాణించు రైలు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
- http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- http://www.indianrail.gov.in/index.html
- http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537