తిరువారూర్ జిల్లా

తమిళనాడు లోని జిల్లా

తిరువారూర్ జిల్లా, తమిళనాడు రాష్టం లోని జిల్లాలలో ఒకటి. జిల్లా వైశాల్యం 2161 చ.కి.మీ. ఉంది.జిల్లా కేంద్రంగా తిరువారూర్ పట్టణం ఉంది. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం జిల్లాలో 1,264,277 మంది జనాభా ఉన్నారు. ప్రతి 1,000 మంది పురుషులకు 1,017 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది.[2]

Thiruvarur district
திருவாரூர் மாவட்டம்
District
Mangrove Forests, Muthupet
Location in Tamil Nadu, India
Location in Tamil Nadu, India
Country India
రాష్ట్రంతమిళనాడు
Municipal CorporationsThiruvarur
ప్రధాన కార్యాలయంThiruvarur
BoroughsKudavasal, Mannargudi, Nannilam, Needamangalam, Thiruthuraipoondi, Thiruvarur, Valangaiman.
Government
 • CollectorS.Natarajan, IAS
భాషలు
 • అధికారTamil
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
610xxx
టెలిఫోన్ కోడ్04366
ISO 3166 code[[ISO 3166-2:IN|]]
Vehicle registrationTN-50[1]

చరిత్ర

మార్చు

1991 వరకు తిరువారూర్, నాగపట్టణం జిల్లాలు తంజావూరు జిల్లాలో భాగంగా ఉన్నాయి. తరువాత తంజావూరు జిల్లా నుండి తిరువారూర్, నాగపట్టినం జిల్లాలు విభజించబడి నాగపట్టినం జిల్లా రూపొందించబడింది. 1997 లో నాగపట్టినం జిల్లాను విభజించుటద్వారా తిరువారూర్ జిల్లా రూపొందించబడింది.[3]

గణాంకాలు

మార్చు
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19015,15,656—    
19115,43,671+0.53%
19215,32,715−0.20%
19315,47,925+0.28%
19415,88,632+0.72%
19516,82,392+1.49%
19617,45,666+0.89%
19718,69,636+1.55%
19819,80,972+1.21%
199111,00,096+1.15%
200111,69,474+0.61%
201112,64,277+0.78%
మూలం:[4]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, తిరువారూర్ జిల్లాలో 1,264,277 జనాభా ఉంది.[2] ప్రతి 1,000 మంది పురుషులకు 1,017 స్త్రీల లింగ నిష్పత్తిగా ఉంది. ఇది జాతీయ సగటు 929 కంటే చాలా ఎక్కువ. మొత్తం జనాభాలో 20.39% పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. జనాభా మొత్తములో 121,973 మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. వీరిలో 62,280 మంది పురుషులు కాగా, 59,693 మంది స్త్రీలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు వారు 34.08% మంది ఉన్నారు.అలాగే షెడ్యూల్డ్ తెగలు వారు 0.24% మంది ఉన్నారు. జిల్లా సగటు అక్షరాస్యత 74.86% ఉంది.ఇది జాతీయ సగటు 72.99% కంటే ఎక్కువ ఉంది. జిల్లాలో మొత్తం 3,27,219 గృహాలు ఉన్నాయి. మొత్తము జనాభాలో 5,40,168 మంది కార్మికులు ఉన్నారు, వీరిలో 60,508 మంది సాగుదారులు, 2,00,126 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు, 7,264 మంది గృహ పరిశ్రమలపై ఆధారపడినవారు, 144,527 మంది ఇతర కార్మికులు, 127,743 మంది ఉపాంత కార్మికులు, 9,375 మంది ఉపాంత కార్మికులు ఉన్నారు. 99.40% జనాభా మాట్లాడే భాష తమిళం. భారతదేశ 640 జిల్లాలలో జనాభా పరంగా తిరువారూర్ 382వ స్థానంలో ఉంది.[2] జిల్లా జనసాంద్రత చదరపు కిల్లోమీటరుకు 533.[2] 2011 గణాంకాలను అనుసరించి కుటుంబ నియంత్రణ శాతం 8.43%.[2] అలాగే అక్షరాస్యత శాతం 83.26%.[2] 2011 తిరువారూరు నగరీకరణ శాతం 20.29% ఉంది.[5]

మతాల ప్రకారం తిరువూర్ జిల్లా జనాభా (2011)[6]
మతం శాతం
హిందూ
  
89.60%
ముస్లిం
  
7.60%
క్రిష్టియన్లు
  
2.63%
ఇతరులు
  
0.17%

జిల్లా లోని ప్రధాన పట్టణాలు

మార్చు

తిరువారూర్, మన్నార్గుడి, తిరుతురైపూండి, కూతనల్లూర్, ముత్తుపేట, కుడవాసల్, నీడమంగళం

జిల్లా లోని ప్రసిద్ధ వ్యక్తులు

మార్చు
  • కె బాలచందర్, త్యాగరాజు శ్రీనివాస అయ్యర్, ధనరాజ్ పిళ్ళై, కర్నాటక సంగీత త్రిమూర్తులు, ఎస్.ఎస్.. వాసన్, కె అంబళగన్, టి ఆర్.బాలు

పాలనా విభాగాలు

మార్చు

తిరువారూరు జిల్లా 8 తాలూకాలుగా విభజించబడి ఉన్నాయి.

  • కుడైవాసల్
  • మన్నార్కుడి
  • నన్నిలం
  • నీడామంగళం
  • తిరుతురైపూండి
  • తిరువారూర్
  • వలంగైమన్
  • కూతనల్లూర్

మూలాలు

మార్చు
  1. www.tn.gov.in
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. Mohan, Gopu (5 April 2011). "Boyhood friend waits for CM to come home". The Financial Express. p. 3.
  4. Decadal Variation In Population Since 1901
  5. "census india". Archived from the original on 2015-04-25. Retrieved 2014-03-28.
  6. "Table C-01 Population by Religion: Tamil Nadu". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.

వెలుపలి లింకులు

మార్చు