తునీషా శర్మ

భారతీయ నటీమణులు

తునీషా శర్మ (2002 జనవరి 4 - 2022 డిసెంబరు 24 ) భారతీయ టెలివిజన్, చలనచిత్ర నటి.[1] ఆమె 2015లో భారత్ కా వీర్ పుత్ర – మహారాణా ప్రతాప్‌లో చాంద్ కవార్‌గా నటించింది. చక్రవర్తి అశోక సామ్రాట్‌లో రాజ్‌కుమారి అహంకార, ఇష్క్ సుభాన్ అల్లాలో జరా/బబ్లీగా, ఇంటర్నెట్ వాలా లవ్‌లో ఆధ్యా వర్మ పాత్రలు పోషించినందుకు ఆమె బాగా పేరు తెచ్చుకుంది.

తునీషా శర్మ
2018లో తునీషా శర్మ
జననం(2002-01-04)2002 జనవరి 4
మరణం2022 డిసెంబరు 24(2022-12-24) (వయసు 20)
మరణ కారణంఆత్మహత్య
వృత్తి
  • నటి
క్రియాశీల సంవత్సరాలు2013–2022

2016లో వచ్చిన హిందీ సినిమా ఫితూర్ లో కత్రినా కైఫ్ చిన్నప్పటి పాత్రను పోషించిన ఆమె బార్ బార్ దేఖో, కహానీ 2, దబాంగ్ 3 సినిమాల్లోనూ నటించింది.

బాల్యం మార్చు

2002 జనవరి 4న చండీగఢ్‌లో తునీషా శర్మ జన్మింది. ఆమె తల్లి వనితా శర్మ.

కెరీర్ మార్చు

తునీషా శర్మ తన కెరీర్‌ను 13 ఏళ్లకే సోనీ టీవీలో ప్రసారమైన భారత్‌ కా వీర్‌ పుత్ర - మహారాణా ప్రతాప్‌తో ప్రారంభించింది.[2] ఆమె కలర్స్ టీవీలో వచ్చిన చక్రవర్తి అశోక సామ్రాట్‌లో రాజకుమారి అహంకార పాత్ర పోషించింది. 2016లో ఫితూర్‌ చిత్రంలో యంగ్ ఫిర్దౌస్‌గా తన సినీ రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరంలో బార్ బార్ దేఖోలో యంగ్ దియాగా, కహానీ 2: దుర్గా రాణి సింగ్‌లో మినీగా నటించింది.[3]

2017లో షేర్-ఎ-పంజాబ్: మహారాజా రంజిత్ సింగ్‌లో ఆమె మెహతాబ్ కౌర్‌గా నటించిమెప్పించింది.[4] 2018 నుండి 2019 వరకు కలర్స్ టీవీ ఇంటర్నెట్ వాలా లవ్‌లో ఆధ్య వర్మ పాత్రను ఆమె పోషించింది.[5]

2019లో జీటీవీ ఇష్క్ సుభాన్ అల్లాలో జరా / బాబ్లీగా కనిపించింది. 2021లో సబ్ టీవీ హీరో – గయాబ్ మోడ్ ఆన్ సీజన్ 2లో ఆమె ఎ.ఎస్.పి అదితిగా కనిపించింది. 2022లో ఆమె సోనీ సబ్ షో అలీ బాబా: దస్తాన్-ఈ-కాబుల్ లో షీజాన్ మొహమ్మద్ ఖాన్ సరసన ప్రధాన పాత్ర పోషించింది.[6]

ఫిల్మోగ్రఫీ మార్చు

టెలివిజన్ మార్చు

Year Title Role Notes Ref.
2015 భారత్ కా వీర్ పుత్ర - మహారాణా ప్రతాప్ చంద్ కన్వర్ [7]
చక్రవర్తి అశోక సామ్రాట్ రాజకుమారి అహంకార [8]
భన్వర్ - కలియుగ్ కి హైరాతంగెజ్ కహానియా -
2016 గబ్బర్ పూంచ్‌వాలా సాన్యా [9]
2017 షేర్-ఎ-పంజాబ్: మహారాజా రంజిత్ సింగ్ మెహతాబ్ కౌర్ [10]
2018–2019 ఇంటర్నెట్ వాలా లవ్ ఆద్యా వర్మ [11]
2019–2020 ఇష్క్ సుభాన్ అల్లా జరా/బబ్లీ [12]
2021 హీరో - గయాబ్ మోడ్ ఆన్ ఏఎస్పీ అదితి జామ్వాల్ సీజన్ 2 [13]
2022 అలీ బాబా: దస్తాన్-ఇ-కాబుల్ షెహజాది మరియం చాప్టర్ 1 [14]

స్పెషల్ అప్పియరెన్స్ మార్చు

Year Title Role Ref.
2018 ఇష్క్ మే మార్జవాన్ ఆద్యా వర్మ
సిల్సిలా బడాల్టే రిష్టన్ కా
2021 మేడం సార్ ఏఎస్పీ అదితి జామ్వాల్
వాగ్లే కి దునియా – నయీ పీధి నయే కిస్సే

సినిమాలు మార్చు

Year Title Role Notes Ref.
2016 ఫితూర్ యువ ఫిర్దౌస్ [15]
బార్ బార్ దేఖో యంగ్ దియా [16]
కహానీ 2: దుర్గా రాణి సింగ్ మిన్నీ సిన్హా [17]
2018 కృష్ణ రుహాని [18]
2019 దబాంగ్ 3 హాస్టైల్ గర్ల్ అతిధి పాత్ర [19]

మ్యూజిక్ వీడియోలు మార్చు

Year Title Singer Ref.
2021 సర్దారి(చాప్టర్ 1) మానవగీత్ గిల్ [20]
ప్యార్ హో జాయేగా విశాల్ మిశ్రా [21]
నైనోన్ కా యే రోనా జాయే నా రాజ్ బర్మన్ [22]
2022 తూ బైతీ మేరే సామ్నే [23]
హీరియే అభి దత్ [24]
తూ బైతీ మేరే సామ్నే రాజ్ బర్మన్ [25]
పానీ నా సమాజ్ [26]

మరణం మార్చు

ఆమె 2022 డిసెంబరు 24న టెలివిజన్ సీరియల్ అలీ బాబా: దస్తాన్-ఇ-కాబుల్ సెట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే ఆమె చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె వయసు 20 సంవత్సరాలు.[27]

ఈ కేసును హత్య, ఆత్మహత్య అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సహనటుడు షీజన్‌ మహమ్మద్‌ ఖాన్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఆత్మహత్యకు ప్రేరిపించినట్లు అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసారు.[28]

మూలాలు మార్చు

  1. "About Tunisha Sharma". ZEE5 (in ఇంగ్లీష్). 15 September 2020. Retrieved 11 April 2022.
  2. "Tunisha Sharma: చిత్ర పరిశ్రమలో విషాదం.. యువ నటి ఆత్మహత్య". web.archive.org. 2022-12-25. Archived from the original on 2022-12-25. Retrieved 2022-12-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Tunisha Sharma Filmography". Box Office India. Retrieved 27 March 2017.
  4. "Tunisha Sharma joins 'Sher-E-Punjab'". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 24 February 2017.
  5. "Child actress Tunisha Sharma of Maharana Pratap fame to romance Shivin Narang". The Times of India.
  6. Service, Tribune News. "Tunisha Sharma plays the lead in Alibaba— Dastaan-e- Kabul". Tribuneindia News Service.
  7. "Young brigade take over TV". The Times of India (in ఇంగ్లీష్). 15 November 2018. Retrieved 1 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. "Damanpreet and Tunisha's friendship since Ashoka - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 1 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. "Tunisha Sharma: Work & Personal Life - Zee5 News". ZEE5 (in ఇంగ్లీష్). 15 September 2020. Retrieved 1 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. "When Maharaja Ranjit Singh lead actors Damanpreet and Tunisha discovered their old friendship - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 1 November 2021.
  11. "Shivin Narang is back to work and excited to be paired opposite Fitoor actor Tunisha Sharma". Hindustan Times (in ఇంగ్లీష్). 9 July 2018. Retrieved 1 November 2021.
  12. "Ishq Subhan Allah: Tunisha Sharma makes an entry into the show - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 1 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  13. "Tunisha Sharma to play the new heroine in Hero: Gayab Mode On - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 1 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  14. "Exclusive! I'm elated to be a part of Alibaba-Dastaan-e-Kaabul, says Tunisha Sharma - Times of India". The Times of India.
  15. "Movie review 'Fitoor': Falls short of all expectations". Deccan Chronicle (in ఇంగ్లీష్). 13 February 2016. Retrieved 1 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  16. "Tunisha Sharma: Biography - Zee5 News". ZEE5 (in ఇంగ్లీష్). 15 September 2020. Retrieved 1 November 2021.
  17. "विद्या बालन की यह 'बेटी' अब दिखती है ऐसी, देख लें आप भी". Amar Ujala (in హిందీ). Retrieved 1 November 2021.
  18. "Krina - Title Track | Hindi Video Songs - Times of India". The Times of India.
  19. "Tunisha Sharma: Biography". Zee5 (in ఇంగ్లీష్). 15 September 2020. Retrieved 1 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  20. "Watch New Punjabi Hit Song Music Video - 'Sardari' Sung By Manavgeet Gill | Punjabi Video Songs - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 16 September 2021.
  21. "Vishal Mishra comes out with new love song 'Pyaar Ho Jayega'". ANI News (in ఇంగ్లీష్). Retrieved 16 September 2021.
  22. "ये रिश्‍ता क्या कहलाता है फेम मोहसिन खान का टूटा दिल! Nainon Ka Ye Rona Jaaye Na सॉन्ग हो रहा वायरल". Prabhat Khabar - Hindi News (in హిందీ). Retrieved 8 December 2021.
  23. "Tu Baithe Mere Samne featuring Paras Arora and Tunisha Sharma out now". The Times of India.
  24. Heeriye - YouTube Music (in ఇంగ్లీష్), retrieved 11 April 2022
  25. "Tu Baithe Mere Samne sung by Raj Barman featuring Paras Arora and Tunisha Sharma". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 5 July 2022.
  26. Paani Na Samajh - Paras Arora, Tunisha Sharma | Raj Barman, Vipin Patwa, Kumaar| Zee Music Originals (in ఇంగ్లీష్), retrieved 5 July 2022
  27. "సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. నటి తునీషా శర్మ ఆత్మహత్య". web.archive.org. 2022-12-25. Archived from the original on 2022-12-25. Retrieved 2022-12-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  28. "Tunisha Sharma death: యువ నటి తునిషా ఆత్మహత్య కేసులో సహనటుడు షీజన్‌ అరెస్టు." web.archive.org. 2022-12-26. Archived from the original on 2022-12-26. Retrieved 2022-12-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)