తూర్పు సియాంగ్ జిల్లా
తూర్పు సియాంగ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా.[2] దీని పరిపాలనా కేంద్రం పసిఘాట్ పట్టణం
తూర్పు సియాంగ్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | పసిఘాట్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,005 కి.మీ2 (1,546 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 99,019[1] (2,011) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 73.5%[1] |
• లింగ నిష్పత్తి | 962[1] |
Website | అధికారిక జాలస్థలి |
చరిత్ర
మార్చు1989లో ఈ ప్రాంతం పశ్చిమ సియాంగ్ జిల్లా నుండి కొంత భూభాగం వేరు చేసి తూర్పు సియాంగ్ జిల్లా రూపొందించబడింది.[3] ఒక దశాబ్ధం తరువాత 1999లో తూర్పు సియాంగ్ జిల్లాలో కొంత భూభాగం వేరు చేసి ఎగువ సియాంగ్ జిల్లా రూపొందించబడింది.[3]
భౌగోళికం
మార్చుతూర్పు సియాంగ్ జిల్లా కేంద్రంగా పసిఘాట్ పట్టణం ఉంది. జిల్లా వైశాల్యం 4,005 చ.కి.మీ.[4] జిల్లా వైశాల్యం ఇండోనేషియా లోని నియాస్ ద్వీపం వైశాల్యానికి సమానం.[5]
పరిపాలనా విభాగాలు
మార్చుఉప విభాగాలు
మార్చుజిల్లాలో 3 విభాగాలు ఉన్నాయి.[6]
భ్లాకులు
మార్చుజిల్లాలో 3 బ్లాకులు ఉన్నాయి.[6]
తాలూకాలు
మార్చుపరిపాలనను సులభతరం చేయడానికి, తూర్పు సియాంగ్ జిల్లా 15 సర్కిల్లుగా విభజించబడింది (తాలూకా/తహసిల్/తహశీల్) ఇవి ఉప-జిల్లాలను సూచించే పరిపాలనా విభాగాలు. సర్కిల్లు బహుళ గ్రామాలు, కొన్ని పట్టణాలను కలిగి ఉంటాయి.[7]
శాసన వ్యవస్థ
మార్చుతూర్పు సియాంగ్ జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: పాంగింగ్, నరి-కొయు, పశ్చిమ పసిఘాట్, తూర్పు పసిఘాట్, మెబొ. ఇవన్నీ అరుణాచల్ తూర్పు లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.[8]
జనాభా గణాంకాలు (2011)
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు సియాంగ్ జిల్లాలో మొత్తం జనాభా 99,214. వీరిలో 50,116 మంది పురుషులు కాగా, 49,098 మంది మహిళలు ఉన్నారు.[9] జిల్లా పరిధిలో మొత్తం 19,107 కుటుంబాలు ఉన్నాయి. తూర్పు సియాంగ్ జిల్లా సగటు లింగ నిష్పత్తి 980.
జిల్లా మొత్తం జనాభాలో 27.9% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 72.1% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 80.1% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 69.6% ఉంది. జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 978 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 980గా ఉంది
0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 12955, ఇది మొత్తం జనాభాలో 13%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 6517 మంది మగ పిల్లలు ఉండగా, 6438 మంది ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి 988, ఇది తూర్పు సియాంగ్ జిల్లాలోని సగటు లింగ నిష్పత్తి (980) కంటే ఎక్కువ.
తూర్పు సియాంగ్ జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 72.54%. తూర్పు సియాంగ్ జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 68.26%, స్త్రీల అక్షరాస్యత రేటు 57.77%.
భాషలు
మార్చుజిల్లాలో ఆది, సినో-టిబెటన్ భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ భాషను దాదాపు 1,40,000 మంది మాట్లాడుతున్నారు. ఇది టిబెటన్, లాటిన్ లిపిలో వ్రాయబడుతుంది.[10] తరువాత స్థానంలో గాలో (అంతరించి పోతున్న భాష) ఉంది. ఇది సినో-టిబెటన్ కుటుంబానికి చెందిన భాష.[11]
వృక్షజ్జాలం, జంతుజాలం
మార్చు1978లో జిల్లాలో 190 చ.కి.మీ వైశాల్యంలో " డీ' ఎరింగ్ మెమోరియల్ (లాలి) శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది. [12]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "District Census 2011". Census2011.co.in.
- ↑ "Arunachal Pradesh Population Census 2011, Arunachal Pradesh Religion, Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-19.
- ↑ 3.0 3.1 Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1113. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11.
Nias 4,048km2
- ↑ 6.0 6.1 "Subdivision & Blocks | District East Siang, Government of Arunachal Pradesh | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-19.
- ↑ "Circles in East Siang district, Arunachal Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-19.
- ↑ "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 ఆగస్టు 2011. Retrieved 21 March 2011.
- ↑ "East Siang District Population Religion - Arunachal Pradesh, East Siang Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-19.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Adi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Galo: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 25 September 2011.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)