తెనాలి పురపాలక సంఘం

తెనాలి పురపాలక నంఘం
(తెనాలి పురపాలక నంఘం నుండి దారిమార్పు చెందింది)

తెనాలి పురపాలక సంస్థ, తెనాలి నగరంలోని స్థానిక స్వీయ ప్రభుత్వం. దీనిని ప్రత్యేక గ్రేడ్ మున్సిపాలిటీగా వర్గీకరించారు.[1]

తెనాలి పురపాలక సంస్థ
అవతరణ1909
రకంప్రభుత్వేతర సంస్థ
Legal statusస్థానిక స్వీయ ప్రభుత్వం
సంస్థ స్థాపన ఉద్దేశ్యముపౌర పరిపాలన
కేంద్రస్థానంతెనాలి
ప్రాంతం
అధికార భాషతెలుగు
చైర్మెన్కె.తులసి
మునిసిపల్ కమిషనర్ఎస్.శకుంతల

చరిత్ర

మార్చు

1909లొ ఈ సంస్థ స్థాపించబడింది. 1965లొ ప్రత్యేక గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయబడింది.[2]

అడ్మినిస్ట్రేషన్

మార్చు

తెనాలి పురపాలక సంస్థ అధికార పరిధి 15.11 కి.మీ2 (5.83 చ. మై.) విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. దీని పరిధిలో తెనాలి, పినపాడు, చినరావూరు ఉన్నాయి.ఈ సంస్థకి క్రింద నగరంలోని మొత్తం 40 ఎన్నికల వార్డులు ఉన్నవి.[1][2] నగరం ప్రస్తుత మున్సిపల్ మునిసిపల్ కమిషనర్ గా ఎస్.శకుంతల , చైర్‌పర్సన్‌గా, కె.తులసి ఉన్నారు.[3]

ప్రజా పనులు , సేవలు

మార్చు

నగరం నివాసితులు బావులు, పంపు నీటిపై ఆధారపడతారు. డిమాండ్ పెరుగుదల , భూగర్భ జలాల తగ్గుదల వల్ల, అభివృద్ధి చెందుతున్న నగరానికి నీటి అవసరం పెరుగుతుంది. నివాసితుల అవసరాల కోసం నీటి ప్రాజెక్టు ప్రారంభించడంలో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ , పురపాలక సంఘం వారు కృషిచేసారు. వి.ఆర్.ఎస్ , ఆర్.ఎన్. కాలేజ్ వద్ద హెడ్ వాటర్ రిజర్వాయిర్ నిర్మించారు. దీనికి తోడు, ఆరు సర్వీసు రిజర్వాయిర్లు, ఫిల్టరేషన్ ప్లాంట్లు కూడా నిర్మించారు. ఈ రిజర్వాయిర్లకి సీతానగరం వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజి నుండి క్రిష్ణా నది నీరు సరఫరా అవుతుంది.[4][5] పురపాలక సంస్థలో మరొ ముఖ్య విధానం, రెండు చెత్త బుట్టల్లొ చెత్త సేకరణ అమలు, పరిశుభ్రత కోసం మన తెనాలి-ఇది ప్రజల సృష్టి పారిశుధ్యం ప్రచారం.[6]

ప్రాజెక్ట్స్, మౌలిక సౌకర్యాలు

సత్యనారాయణ వి.జి.టి.ఎం.యు.డి.ఎ లేక్ పార్క్ (లేదా వ్హినరావురు పార్క్) ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత డెవలప్మెంట్ అథారిటీ చే నిర్వహించబడుతుంది. ఇది పలు పుష్ప రకాలకు నిలయం. మాజీ మున్సిపల్ చైర్మన్, రవి సత్యనారాయణ పేరు మీద దీనిని స్థాపించారు.[7]

ఏడు పురపాలక సంస్థలు, గుంటూరు నగర పాలక సంస్థ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు, JITF అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సహకారంతో ఏర్పాటు చేయబోయే 15 మెగావాట్ల వ్యర్ధం నుండి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ప్రాజెక్టులో తెనాలి పురపాలక సంఘం కూడా ఒకటి.[8]

పురస్కారాలు , సాధనలు

మార్చు
  • గ్రీన్ లీఫ్ అవార్డ్స్ 2015 - స్వచ్ఛంద సంస్థ సుకూ ద్వారా నిర్వహించబడిన ఉత్తమ వికేంద్రియ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వర్గంలో .[9]
  • 6వ ప్లాస్టికాన్ అవార్డ్స్ 2012 - దీశ్ గ్రీన్ సిటీగా వ్యర్థాల వేర్పాటు నిర్వహణా వర్గంలో .[10]
  • అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ - రాష్ట్రంలోని 31 నగరాల్లో ఒక నగరంగా నీటి సరఫరా, మురుగునీటి సేవలు మిషన్ లో ఒక భాగంగా ఉంది.[11]
  • పట్టణాభివృద్ధి మంత్రిత్వ ద్వారా 2015 లో విడుదల చెసిన సచ్చ భారత్ ర్యంకుల్లొ, తెనాలి పురపాలక సంస్థ దేశంలో 166వ స్థానంలో నిలిచింది.[12]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. 2.0 2.1 "About Tenali". VGTM Urban Development Authority. Archived from the original on 21 August 2015. Retrieved 26 February 2016.
  3. "Contact Details of Commissioners and Mayors of Amrut Cities" (PDF). Atal Mission for Rejuvenation and Urban Transformation. Government of India. Archived from the original (PDF) on 15 ఏప్రిల్ 2016. Retrieved 28 March 2016.
  4. "New project to quench Tenali's thirst". Times of India. Tenali. 3 July 2012. Retrieved 12 March 2016.
  5. "Delay in drinking water project irks residents". The Hindu. Tenali. 24 February 2012. Retrieved 12 March 2016.
  6. "A litter-free town, the aim of 'Mana Tenali'". The Hindu. Tenali. 13 November 2015. Retrieved 19 November 2015.
  7. "A perfect getaway, for children and adults". Tenali. 13 January 2012. Retrieved 14 March 2016.
  8. "Waste-to-energy plant to be set up in Guntur". The Hindu. 7 February 2016. Retrieved 18 February 2016.
  9. "TS and AP NGOs sweep Green Leaf awards". The Hans India. 8 June 2015. Retrieved 12 March 2016.
  10. "Green City award for Tenali". The Hindu. Vijayawada. 2 February 2012. Retrieved 19 December 2015.
  11. Vadlapatla, Sribala (11 August 2015). "Amaravati among 31 AP cities selected for Amruth development". The Times of India. Hyderabad. Retrieved 18 December 2015.
  12. Sandeep Kumar, S (10 August 2015). "Small towns fare better in Swachh Bharat rankings". The Hindu. Vijayawada. Retrieved 30 March 2016.

వెలుపలి లంకెలు

మార్చు