తెప్ప
తెప్ప (ఆంగ్లం Raft) అతి ప్రాచీనమైన చిన్న పడవ. ఇవి స్వదేశీ వస్తువులచే నిర్మిస్తారు. తెప్పల్ని నీటి మీద ప్రయాణించడానికి, చేపలు పట్టుకోవడానికి జాలరివారిచేత చాలా కాలంగా ఉపయోగంలో ఉన్నాయి.
ఉత్సవాలు
మార్చుకొన్ని ఉత్సవాలు తెప్పల మీద జరిపితే వాటిని తెప్పోత్సవాలు అంటారు. ప్రసిద్ధిచెందిన హిందూ దేవాలయాలలో పుష్కరిణిలో గాని లేదా దగ్గరలోనున్న కాలువలు, నదులు, చెరువులలో దేవతా విగ్రహాలను ఊరేగిస్తారు. తిరుమల తెప్పోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. అన్నవరం, సింహాచలం, శ్రీశైలం మొదలైన ఇతర పుణ్యక్షేత్రాలలో కూడా ఈ తెప్పోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి.
Look up తెప్ప in Wiktionary, the free dictionary.
ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |