ప్రధాన మెనూను తెరువు

కొన్ని ఊళ్ళను లేదా కొన్ని ప్రాంతాలను దాటి ప్రవహించు జల ప్రవాహాన్ని కాలువ (Canal) అంటారు. నదులకు ఆనకట్టలు కట్టి నిలువ ఉంచిన నీటిని నిర్ణయించబడిన మార్గాలలో మళ్ళించేందుకు కాలువలు త్రవ్వుతారు. ఆకాలువలకు ఉపకాలువలు, వాటికి ఉపకాలువలు ఇలా విస్తరింపబడి నీటిని తీసుకెళుతుంటాయి.

ఒక పెద్ద కాలువ

కాలువలు రకాలుసవరించు

కాలువలలో ముఖ్యముగా రెండు రకాలు ఉన్నాయి.

పంటకాలువలుసవరించు

 
ఒక పంట కాలువ

ఇవి నది నుండి మొదలై దశలలో ఒకదాని నుండి మరొకటి విడివడుతూ ఆఖరుకు చిన్న కాలువగా మారింతమవుతుంది. పెద్ద కాలువకు కొన్ని నిర్ణయించబడిన ప్రాంతములలో ఉపకాలువలను విడదీసేందుకు లాకు అనే చిన్న ఆనకట్టలాంటి కట్టడం ఉంటుంది. దీని వద్ద కాలువ నుండి రెండు దిశలలో ఉపకాలువలు ప్రారంభమవుతాయి. అలా పెద్దకాలువ నుండి చిన్నకాలువలు అనేకం పుట్టి అవి పంటచేల మధ్యవరకూ విస్తరింపబడి ఉంటాయి. వీటి ద్వారా పంటలకు కావలసిన నీరు అందుతుంది.

మరొక విధానంలో వీటి ద్వారా చెరువులు నింపుకొని అవసరమైనపుడు పంటలకు వాడుకొంటారు. తాగునీటి అవసరాలకు వాడుకొంటారు.

మురుగు కాలువలుసవరించు

పంటకాలువలు చివరకు పిల్లకాలువలుగా, పంట బోదెలుగా మారి చివరలో ఒక పెద్ద కాలువలో కలుస్తాయి.దీనినినే మురుగు కాలువ అంటారు. సాధారణంగా రెండు పంట కాలువల మధ్య ఒక మురుగు కాలువ ఉంటుంది. ఆలాగే గ్రామ, పట్టణాలలో బోదెలు, డ్రైనేజీలు, వాడకపు పిల్లకాలువలు ప్రవహించి ఆఖరున మురుగు కాలువలో కలుస్తాయి.

కాలువల విస్తరణసవరించు

ఆంధ్రప్రాంతంలో కాలువల నిర్మాణము, విస్తరణ, వర్గీకరణలు అపర భగీరధునిగా పేరు పడిన సర్ ఆర్ధర్ కాటన్ అనే బ్రిటిషర్ కాలంలో అధికంగా జరిగింది. దీని ద్వారా ఎక్కువ అభివృద్ధి పొందినది గోదావరి జిల్లాలు కొన్ని ఇతర ప్రాంతములు.

కాలువల ఉపయోగాలుసవరించు

  • చెరువులకు నీరందించడం
  • పంట లకు నీరందించడం
  • వరద నీటిని మళ్ళించడం
  • ఈతలు కొట్టేందుకు
  • పడవ ల, లాంచీ ల రవాణాకు

అతి పెద్దకాలువలుసవరించు

ప్రపంచం
ఆంధ్ర ప్రదేశ్

ఇవి కూడా చూడండిసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కాలువ&oldid=1978481" నుండి వెలికితీశారు