తెరతీయగరాదా దేవా (పాట)

తెరతీయగరాదా దేవా 1947లో విడుదలైన పల్నాటి యుద్ధం (1947) చిత్రంలోని పాట. ఈ పాటను ఘంటసాల, కన్నాంబ ఆలాపించారు. ఈ పాటకు సాహిత్యం అందించింది సముద్రాల రాఘవాచార్య, సంగీతం అందించింది గాలి పెంచల నరసింహారావు.

పల్నాటి యుద్ధం మువీ పోస్టరు

విశేషాలు మార్చు

ఈ పాట పల్నాటి యుద్ధం చిత్రంలో చివరి గీతం. ఈ చిత్రం విషాదాంతం, యుద్ధానికి కారణమైన నాగమ్మ, బ్రహ్మనాయుడు, మలిదేవరాజు మాత్రమే మిగిలిపోతారు. రణరంగంలో రక్తపాతాన్ని చూసిన నాగమ్మ మనసు కరిగిపోతాయి, ఆమె బ్రహ్మనాయుడి కాళ్ళపై పడుతుంది. వారిరువురూ పరివర్తన హృదయాలతో రక్తసిక్తమైన చేతులు జోడించి గుడిలో పశ్చాతాపంతో చెన్నకేశవుని వేడుకొంటారు. తెరతీయరా అన్న అన్నమయ్య ధోరణిలో గీతాన్ని రాశారు సముద్రాల. ఘంటసాల గొంతులో శుద్ధ శాస్త్రీయత రవళించిన గీతమిది. ఈ పాటను బ్రహ్మనాయుడైన డా. గోవిందరాజుల సుబ్బారావు, నాగమ్మ అయిన కన్నాంబ మీద చిత్రీకరించారు. ఘంటసాల గోవిందరాజుల సుబ్బారావుకి పాడగా, కన్నాంబ తానే పాడుకున్నారు. ఇది ఒక అరుదైన గీతం, ఎందుకంటే ఇది ఘంటసాల, కన్నాంబ పాడిన ఏకైక యుగళగీతం. గాలి పెంచల నరసింహారావు ఈ పాటకు అద్భుతమైన సంగీతం అందించారు.

పాట మార్చు

బ్రహ్మనాయుడు:

తెరతీయగరాదా దేవా

తెరతీయగరాదా దేవా

తెరతీయగరాదా దేవా

తెరతీయగరాదా

నాగమ్మ:

తనవారూ పెరవారలనీ

తనవారూ పెరవారలనీ

తరతమ భావములు మానీ

తరతమ భావములు మానీ

బ్రహ్మనాయుడు:

జగదానందమే పరమార్థముగా

జగదానందమే పరమార్థముగా

నరులు బ్రతుకరాదా కాదా

నరులు బ్రతుకరాదా కాదా

తెరతీయగరాదా


ఇద్దరు:

సత్యము శివము సుందరమౌ

సాత్విక రూపము నిత్యముకాదా

మాలో ఇక అనురాగము సమత

మాలో ఇక అనురాగము సమత

శాంతి శాశ్వతము కావా

శాంతీ శాశ్వతమూ కాదా

మూలాలు మార్చు

  • జీవితమే సఫలము - సీనియర్ సముద్రాల సినీగీతాలకు సుమధుర వ్యాఖ్య (మొదటి సంపుటి) - డాక్టర్‌.వి.వి.రామారావు - పుట 220

లింకులు మార్చు