తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు (పుస్తకం)

తెలంగాణలోని చారిత్రక స్థలాల గురించి రాయబడిన పుస్తకం


తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు అనేది తెలంగాణలోని చారిత్రక స్థలాల గురించి రాయబడిన పుస్తకం. చరిత్ర పరిశోధకుడు డా. ద్యావనపల్లి సత్యనారాయణ రాసిన ఈ పుస్తకం 2016లో తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రచురించబడింది. ఈ పుస్తకానికి 2016లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహితీ పురస్కారం వచ్చింది.[1][2]

తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు (పుస్తకం)
కృతికర్త: డా. ద్యావనపల్లి సత్యనారాయణ
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): తెలంగాణలోని చారిత్రక స్థలాలు
ప్రచురణ: తెలంగాణ రిసోర్స్ సెంటర్
విడుదల: 2016
పేజీలు: 160

పుస్తక నేపథ్యం

మార్చు

తెలంగాణ చారిత్రక వైభవాన్ని చాటే పదహానే కొత్త ఆవిష్కరణలతో, చారిత్రక స్థలాలను పర్యాటక వనరులుగా, చారిత్రక స్థలాల విశేషాలతో, పరిశోధకులు, పర్యాటకులు, విద్యార్థులు ఆసక్తికరంగా చదివేలా ఈ పుస్తకం రూపొందించబడింది.[3]

విషయసూచిక

మార్చు

గుహా చిత్రాలు

మార్చు
  • 1. నల్లముడి అక్షరాలలోద్దిలో ఆదిమానవుల చిత్రాలు
  • 2. 'రామ'గిరి 'పాండవ'లొంకలో ప్రాజీన చిత్రాలు
  • 3. మన్నెంకొండలో మధ్యరాతి యుగపు చిత్రాలు
  • 4. దొంగలగట్టులో తొలి దేవత గోవు చిత్రాలు
  • 5. రాచకొండలోగుహా చిత్రాలు, గుడి చిత్రాలు, భూగర్భ కాలువలు

చారిత్రక స్థలాలు

మార్చు
  • 6. ఇంద్రపాలనగరంలో 1580 ఏళ్ళ కిందటి బౌద్ధ శిల్పాలు
  • 7. వేపలసింగారంలో వింత పాదం శిలాజం
  • 8. మల్లూరు గుట్టపై బృహత్ శిలా ఉద్యానవనం
  • 9. బమ్మెర పోతనకు ముందటి చరిత్ర
  • 10. తిమ్మాయిపల్లిలో కొత్తరాతి యుగం నుండి కుబేరాలయం దాకా
  • 11. మన్ననూరులో కాలాపానీ కారాగారం
  • 12. అక్కమహాదేవి గుహలు
  • 13. భువనగిరి భువనైక సౌదర్యం
  • 14. చైతన్యపురిలో హైదరాబాద్ మొదటి బౌద్ధ విహారం/శాసనం
  • 15. కీసరగుట్ట 1600 ఏళ్ళ కిందటి రాజధాని
  • 16. వీణవంక చారిత్రక సౌదర్యం

పుష్కర గోదావరి తీర క్షేత్రాలు

మార్చు
  • 17. గోదావరి అందాలు - చారిత్రక చందాలు
  • 18. గోదావరి నదీ లోయ నాగరికత

అనుబంధాలు

మార్చు
  • 19. ఇక మన చరిత్రను మనం రాసుకుందాం
  • 20. తెలంగాణ చారిత్రక వారసత్వం - ఒక విహంగ వీక్షణం

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (23 December 2018). "పది మందికి తెలుగు విశ్వవిద్యాలయ అవార్డులు". www.andhrajyothy.com. Archived from the original on 8 July 2020. Retrieved 27 October 2021.
  2. డైలీహంట్, నమస్తే తెలంగాణ (23 December 2018). "తెలుగు వర్సిటీ 2016 సాహితీ పురస్కారాలు". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2020. Retrieved 27 October 2021.
  3. తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు, డా. ద్యావనపల్లి సత్యనారాయణ, తెలంగాణ రిసోర్స్ సెంటర్, హైదరాబాదు.