ద్యావనపల్లి సత్యనారాయణ
డా. ద్యావనపల్లి సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చరిత్రకారుడు.[1] ఆయన పరిశోధనా విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం 2014 కీర్తిపురస్కారాన్ని అందుకున్నారు.[2] ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన సంగ్రహాలయ సంరక్షకులుగా[3] బాధ్యతలు నిర్వర్తించిన సత్యనారాయణ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులుగా ఉన్నారు.
ద్యావనపల్లి సత్యనారాయణ | |
---|---|
జననం | = జూలై 20 మగ్గాల గడ్డ,వెల్గటూర్ మండలం, జగిత్యాల జిల్లా, తెలంగాణ |
వృత్తి | తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు |
ప్రసిద్ధి | చరిత్ర పరిశోధకుడు, రచయిత |
జీవిత విషయాలు
మార్చుసత్యనారాయణ జూలై 20న తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలం, మగ్గాల గడ్డ అనే గ్రామంలోని మధ్య తరగతి చేనేత కుటుంబంలో జన్మించాడు. ఆ గ్రామంలో అందరూ చేనేత కార్మికులే ఉండేవారు. తల్లిదండ్రులు చేనేత కార్మికులు.
స్వగ్రామంలో ఏడవ తరగతి వరకు చదివిన సత్యనారాయణ ఆ తరువాత వెల్గటూర్ గ్రామంలో పదవ తరగతి వరకు చదివాడు. నాగార్జున సాగర్ లోని ఏపిఆర్జేసిలో ఇంటర్మీడియట్ విద్యను చదివి రాష్ట్రస్థాయిలో నాలుగవ ర్యాంక్ సాధించాడు. హైదరాబాదులోని నిజాం కళాశాలలో డిగ్రీ, హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఎంఏ (చరిత్ర) చదివాడు. తెలంగాణలో పర్యావరణ చరిత్ర అనే అంశంపై పిహెచ్.డి. పట్టా అందుకున్నాడు. వివిధ అంశాలపై 14 డిగ్రీలు చేశాడు.
ఉద్యోగం
మార్చుఉపాధ్యాయుడిగా, నిజాం కళాశాలలో లెక్చరర్ గా పాఠాలు బోధించాడు. గ్రూపు 2 పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించి కొంతకాలం అంబేద్కర్ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు ఆడిటర్ గా పనిచేశాడు. ఆ తరువాత గ్రూప్ 1 పరీక్ష కూడా రాసి ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గిరిజన మ్యూజియంలకు క్యూరేటర్ గా ఉన్నారు.
రచనలు
మార్చు- ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర[4]
- ఎనిమిది శతాబ్దాల రామప్ప.[5] (సంపాదకులు)
- తెలంగాణలో కొత్త పర్యాటక స్థలాలు (2012)[5]
- తెలంగాణ చరిత్ర సంస్కృతి [6]
- కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ (ఆంగ్లం, 2015)
- తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు (2016)
- తెలంగాణలో కొత్త విహార స్థలాలు (2014, సెప్టెంబరు 27)
- తెలంగాణలో కృష్ణానదీ నాగరికత (2016)[7]
- భువనైక సౌందర్యం (2017)[8]
పరిశోధనలు
మార్చు- వలిగొండ మండలం తుమ్మలగూడెం గ్రామ శివారులో ఉన్న రెండు పెద్ద గుండ్లపై బుద్ధుడు, ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధాచార్యుడైన ఆచార్య నాగార్జునుడి శిల్పముద్రలు లభించాయి. సా.శ. 435వ సంవత్సరంలో గోవిందరాజు వర్మ అనే రాజు తన 37వ రాజ్యసంవత్సరంలో రూపొందించిన రాగిశాసనాల ఆధారంగా ఆయన ఆధారాలను వెలికితీశారు. ఈ శాసనాల ఆధారంగా ఇంద్రపాలనగరం, బౌద్ధ విగ్రహాల కోసం ఆయన పరిశోధన చేశారు. ఆయన పరిశోధనలో అక్కడ బౌద్ధవిగ్రహాలు ఉన్న మాట నిజమేనని, దాదాపు 1580 ఏళ్ల క్రితమే అక్కడ బుద్ధ పూర్ణిమ నిర్వహించారని తేలింది.[9]
- పాలమూరు జిల్లాలోని వంగూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామ పరిధిలోనున్న చెన్నయవొలం గుట్టల్లో నెలకొన్న ఒక కోవెలలో 17వ శతాబ్దంనాటి శాసనాన్ని ద్యావనపల్లి గుర్తించారు. ఈ శాసనానికి సమీపంలోని తిమ్మినోని చెరువుంది. శాసనంలోనూ నరహరి పేరిట ఒక చెరువు నిర్మించినట్లు ఉంది. ఆ గుట్టపై అనేక గుహల్లో నవీన శిలాయుగం నాటి పురావస్తు ఆధారాలు లభించాయి.[10]
- కొన్ని కుండ ముక్కలు, రాతి ముక్కలు మహబూబ్ నగర్ నుండి 20 కి.మీ దూరంలో గల మన్నెంకొడ వద్ద గల రాతి గుహలలో గల చిత్రాలనుండి కనుగొనబడినవి. తెలంగాణ యొక్క చరిత్ర 10,000 సంవత్సరాల ముందుగా యున్నట్లు ఆధారాలు లభించాయి.[11]
- అమ్రాబాద్ మండలం, మెడిమల్కల సమీపాన పురాతన ఆలయం వద్ద కాకతీయులకు సంబంధించిన శాసనాలు, చిత్రాలు లభ్యమయ్యాయి. వీరవనిత రుద్రమదేవి సా.శ.1296లో మరణించలేదనీ... నల్గొండ జిల్లా చందుపట్లలో వెలుగుచూసిన శిలాశాసనం ప్రకారం సా.శ.1289 నవంబరు చివరివారంలో మృతి చెందిందన్న అంశాన్నే ఈ శిలాశాసనమూ ధ్రువీకరిస్తున్నట్లు సత్యనారాయణ చెప్పారు. మేడిమల్కల (మేడిమ లంకలు) ప్రసిద్ధ మల్లికార్జున దేవాలయం, దానికి అనుబంధంగా కలు మఠం ఉండేవని సా.శ.1290 ఫిబ్రవరి 20 తేదీతోఉన్న శాసనం చెబుతోంది.[12]
పురస్కారాలు
మార్చు- 2014 - తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం (తెలంగాణలో కొత్త విహార ప్థలాలు పుస్తకానికి)
- 2014 - పర్యాటక శాఖ సాహితీ పురస్కారం (తెలంగాణలో కొత్త విహార ప్థలాలు పుస్తకానికి)
- 2015 - సాహితీ పురస్కారం (కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ పుస్తకానికి)
- 2016 - సాహితీ పురస్కారం (తెలంగాణలో కృష్ణానదీ నాగరికత పుస్తకానికి)
- 2017 - సాహితీ పురస్కారం (భువనైక సౌందర్యం పుస్తకానికి)
- 2019 - తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2016 (తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు పుస్తకానికి)[13][14]
మూలాలు
మార్చు- ↑ Ancient Rock Art Found In The Indian 'Valley Of Letters'[permanent dead link]
- ↑ 36 మందికి కీర్తి పురస్కారాలు[permanent dead link]
- ↑ "తెలంగాణ చరిత్ర పితామహుడు- డా. ద్యావనపల్లి సత్యనారాయణ". Archived from the original on 2016-05-10. Retrieved 2016-05-22.
- ↑ తెలంగాణ చరిత్ర ఇంకా గుప్తనిధే[permanent dead link]
- ↑ ఆంధ్రభూమి, తెలంగాణ (15 August 2016). "ఆవిష్కృతమవుతున్న తెలంగాణ అస్తిత్వం". andhrabhoomi.net. Archived from the original on 18 ఆగస్టు 2016. Retrieved 27 October 2021.
- ↑ "పర్యాటక కేంద్రంగా భువనగిరి అభివృద్ధి". Archived from the original on 2016-05-21. Retrieved 2016-05-22.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ 580 ఏళ్ల కిందటే బుద్ధపూర్ణిమ! Sakshi | Updated: May 04, 2015
- ↑ "పాలమూరులో నవీన శిలాయుగం జాడలు". Archived from the original on 2015-06-02. Retrieved 2016-05-22.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Blast from the past". SURESH KRISHNAMOORTHY. The Hindu. 29 July 2015. Retrieved 22 May 2016.
- ↑ నల్లమలలో రుద్రమదేవి మరణ శాసనం[permanent dead link]
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (23 December 2018). "పది మందికి తెలుగు విశ్వవిద్యాలయ అవార్డులు". www.andhrajyothy.com. Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.
- ↑ డైలీహంట్, నమస్తే తెలంగాణ (23 December 2018). "తెలుగు వర్సిటీ 2016 సాహితీ పురస్కారాలు". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.