తెలంగాణ ఉన్నత విద్యా మండలి
తెలంగాణ ఉన్నత విద్యా మండలి T G C H E (Telangana Council of Higher Education) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక ఉన్నత విద్యా మండలి 2014లో స్థాపించబడింది. హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్ లో ఉంది.UGC యూనివర్సిటీ గ్రాండ్ కమీషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయం చేసి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నత విద్య పరిశోధన, శాస్త్రీయ సాంకేతిక సంస్థలలో ప్రమాణాలను సమన్వయం చేయడానికి ఏర్పడిన చట్టబద్ధత గల సంస్థ[1][2].
ఇతర పేర్లు | టీ జీ.సి.హెచ్.ఇ |
---|---|
ఛాన్సలర్ | పొ.వి బాల కిష్టారెడ్డి - చైర్మన్ |
వైస్ ఛాన్సలర్ | పొ.ఇటిక్యాల పురుషోత్తం - వైస్ చైర్మన్ |
రెక్టర్ | విష్ణుదేవ్ వర్మ, గవర్నర్ తెలంగాణ |
చిరునామ | జేఎన్టీయూ మాసబ్ ట్యాంక్ మహావీర్ హాస్పిటల్ రోడ్,హైదరాబాద్., హైదరాబాదు, తెలంగాణ, 500028, భారతదేశం |
కాంపస్ | పట్టణం హైదరాబాద్ |
భాష | తెలుగు ,ఆంగ్లం |
అనుబంధాలు | UGC యూజీసీ |
జాలగూడు | http://www.tgche.ac.in/ |
చరిత్ర
మార్చు1986 జాతీయ విద్యా విధానంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విద్య రంగం నిర్వహణ, నాణ్యత[3], ప్రాముఖ్యత, ఉపాధి కోసం ఉన్నత విద్యా రంగంలో ఏకీకృత కార్యక్రమాల తయారీకి బాధ్యత వహించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చట్ట బద్ధమైన సంస్థ. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని నిబంధనల ప్రకారం 1988 APSCHE చట్టం16 ను ఆమోదించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి TSCHE తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ఉనికిలోకి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం TS స్థానంలో TG అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో TGCHE గా ఏర్పడింది[4].
ఉద్దేశాలు
మార్చుమానవ విలువలతో కూడిన విద్యను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించడం. నాణ్యమైన విద్యను అందరికీ అందించడం. సమానమైన ప్రవేశం, శ్రేష్టతను నిర్ధారించడానికి రాష్ట్ర ఉన్నత విద్యా సంస్థలకు నిధులు సమకూర్చడం.
ఇప్పటివరకు పనిచేసిన చైర్మెన్ ల జాబితా
మార్చు•1.ఆచార్య తుమ్మల పాపిరెడ్డి (05 ఆగష్టు 2014 నుండి ఆగస్టు 2021 వరకు) ఆదిలాబాద్ జిల్లా చెందిన పొ .టి పాపిరెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తొలి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఆయన 5 ఆగష్టు 2014 నుండి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ఆ పదవిలో ఏడేళ్ల కు పైగా పని చేసి ఆగష్టు 2021 న వైదొలిగారు[5].
•2.ఆర్.లింబాద్రి (24 ఆగస్టు 2021 నుండి వరకు 21 జూలై 2023)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్.ఆర్.లింబాద్రి ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా 27 జూన్ 2023 న
నియమిస్తూ ప్రభుత్వ విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో జారీ చేసింది.
2021 ఆగష్టు 24 న ఉన్నత విద్య మండలి తాత్కాలిక హోదాలో ప్రభుత్వం నియమించింది. 2021 నుండి 2023 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆయన సేవలను పరిగణలోకి తీసుకున్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం 2023 లో పూర్తి స్థాయిలో చైర్మన్ హోదాను కట్టబెట్టింది[6].
•3.వి.బాలకిష్టా రెడ్డి (06 డిసెంబర్ 2024 నుండి) జేఎన్టీయూ హెచ్ ఇన్ ఛార్జి వీసీ గా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి నియమితులయ్యాడు. అక్టోబర్/2024లో సెర్చ్ కమిటీ సమావేశం నిర్వహించి గవర్నర్ విష్ణు దేవ్ వర్మ ఆమోదంతో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ జీవో జారీ చేశారు[7].
విశ్వవిద్యాలయాలు
మార్చుతెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా సంస్థలు[8]
సిలబస్ పునరుద్ధరణ
మార్చుతెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీ విద్యార్థుల కోసం సిలబస్ ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. విద్యార్థుల కోరకై పాఠ్యాంశాలను పునరుద్ధరించే పనులను వేగవంతం చేసింది.ఏడేళ్ల క్రితం చివరిగా మార్చిన UG సిలబస్ ను పునరుద్ధరణ కోసం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కమిటీ కి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆధ్వర్యంలో ప్యానెల్స్ ఏర్పాటు చేసింది.
ఇది కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Telangana Council of Higher Education". www.tgche.ac.in. Retrieved 2024-12-08.
- ↑ "Higher Education – Telangana State Portal". www.telangana.gov.in. Retrieved 2024-12-08.
- ↑ ABN (2024-10-29). "Hyderabad: టీ-శాట్‌లో ఉన్నత విద్య ప్రసారాలు". Andhrajyothy Telugu News. Retrieved 2024-12-08.
- ↑ Velugu, V6 (2024-06-01). "తెలంగాణ ఉన్నత విద్యా మండలి పేరు మార్చిన ప్రభుత్వం". V6 Velugu. Retrieved 2024-12-08.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా పాపిరెడ్డి కొనసాగింపు | Continuation of Papi Reddy as Chairman of Higher Educational Institutions | Sakshi". www.sakshi.com. Retrieved 2024-12-08.
- ↑ ABN (2023-06-27). "ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ లింబాద్రి". Andhrajyothy Telugu News. Retrieved 2024-12-08.
- ↑ "Telangana Higher Education: ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా బాలకిష్టారెడ్డి". EENADU. Retrieved 2024-12-08.
- ↑ "Higher Education – Telangana State Portal". www.telangana.gov.in. Retrieved 2024-12-08.