తెలంగాణ క్రికెట్ అసోసియేషన్

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ కార్యకలాపాల పాలకమండలి. ఈ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రాంతంలో ఉంది.[1] తెలంగాణ గ్రామీణ ప్రాంతాలను గ్లోబల్ అరేనాతో అనుసంధానం చేయడం, ప్రతిభావంతులైన సార్వత్రిక సంస్థల మద్దతుతో రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు ప్రోత్సాహం అందించడం, తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ అవసరాలను తీర్చడం బిసిసిఐ, ఐసిసి వంటి క్రికెట్ సంస్థలకు అనుగుణంగా పని చేయడం ఈ అసోసియేషన్ ముఖ్య లక్ష్యం.[2]

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లోగో

చరిత్ర మార్చు

తెలంగాణకు చెందిన పార్లమెంట్ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, క్రికెటర్లు, భారత మాజీ వికెట్ కీపర్ పి. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 1986లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ స్థాపించబడింది. దీనికి గోవర్ధన్ రెడ్డి స్థాపక సభ్యుడు, గౌరవ పోషకుడిగా ఉన్నాడు, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 జూన్ లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రారంభమైంది.

అసోసియేట్ మెంబర్‌షిప్ మార్చు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ) హైదరాబాద్ వెలుపల ఉన్న ఆటగాళ్ళకు తగిన ప్రాతినిధ్యం, అవకాశాలు లేవని పేర్కొంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టిసిఏ) భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అసోసియేట్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది.[3] బిసిసిఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ని ఆరు వారాల్లోగా ( 2018 జూన్ 15కి ముందు) తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ద్వారా విన్నవించి నిర్ణయం తీసుకోవాలని 2018 మే 4న బాంబే హైకోర్టు ఆదేశించింది.[4]

2018 మే 30న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధుల ఆహ్వానం మేరకు బిసిసిఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ని దాని ప్రధాన కార్యాలయంలో కలుసుకున్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అసోసియేట్ సభ్యత్వంపై తమ వాదనను సమర్పించారు.[5][6]

పోటీలు మార్చు

2014-15లో "తెలంగాణ గోల్డ్ కప్ 2015"లో పేరుతో రాష్ట్రస్థాయిలో టౌర్నమెంట్ నిర్వహించబడింది. తెలంగాణ జిల్లాల నుండి ఎంపిక చేసిన 64 రెవెన్యూ డివిజన్ స్థాయి క్రికెట్ జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నాయి. తెలంగాణాలోని గ్రామీణ ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ప్రతిభ కలిగిన యువ క్రికెటర్లు ఉన్నారిని టిసిఏ గుర్తించింది.

మూలాలు మార్చు

  1. "Telangana Cricket Association". Tcricket. Retrieved 5 November 2021.
  2. "Welcome to The Telangana Cricket Association". www.tcricket.in. Retrieved 2021-11-05.
  3. "Telangana Cricket Association request associate member status from BCCI". Hindustan Times. 11 May 2018. Retrieved 5 November 2021.
  4. "Bombay High Court Urges CoA Look Into Telangana's Membership Appeal". mid-day.com. 11 May 2018. Retrieved 5 November 2021.
  5. "BCCI CoA invites Telangana Cricket Association for a meeting on May 30". telanganatoday.com. 21 May 2018. Retrieved 5 November 2021.
  6. "TCA presents their case to CoA members". telanganatoday.com. 30 May 2018. Retrieved 5 November 2021.

బయటి లింకులు మార్చు