తెలంగాణ బోనాలు (పుస్తకం)


తెలంగాణ బోనాలు అనేది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన పుస్తకం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్న బోనాల పండుగ చరిత్ర, సంస్కృతి, పండుగ పద్ధతుల గురించి ప్రొఫెసర్ ననుమాస స్వామి పరిశోధన చేసి రాసిన ఈ పుస్తకానికి తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సంపాదకులుగా వ్యవహరించారు.[1]

తెలంగాణ బోనాలు
కృతికర్త: ప్రొఫెసర్ ననుమాస స్వామి
సంపాదకులు: మామిడి హరికృష్ణ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): తెలంగాణ బోనాల చరిత్ర, సంస్కృతి, పద్ధతులు
ప్రచురణ: సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ
విడుదల: జూలై, 2021
పేజీలు: 88
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-81-942686-3-5

పుస్తక నేపథ్యం

మార్చు

తెలంగాణ సంస్కృతిలో ప్రధానంగా కనిపించే మూలాంశాలలో పల్లె జీవన సంస్కృతి, అమ్మ తల్లి ఆరాధన అనేవి ప్రధానమైనవి. అమ్మ తల్లి ఆరాధనకు బోనం అనేది శిఖరాయమానంగా నిలుస్తున్న ఉత్సవం. బోనాల పండుగని, దీనిలోని విశేషాలను సంవత్సరాల నుంచి, కొనసాగుతూ వస్తున్న వివిధ రకాల రీతులను, రివాజులను, పద్ధతులతో ఈ పుస్తకం ప్రచురించబడింది. ఈ పుస్తకంలో బోనాల పండుగలోని విశిష్టతలను ఎంతో పరిశోధనాత్మకంగా, చారిత్రక, సాంస్కృతిక అవగాహనతో కూర్చడం జరిగింది.[2]

విషయసూచిక

మార్చు
  1. శాక్తేయం పూర్వ రంగం
  2. శక్త్యారాధన ఆవిర్భావం: బోనాలు పూర్వ చరిత్ర, ఆది శక్తి అవతారం రేణుక, ఆషాఢ బోనాలు, శ్రావణ బోనాలు
  3. రాజధాని బోనాలు చరిత్ర: గోల్కొండ బోనాలు, బల్కమ్ పేట బోనాలు, లష్కర్ బోనాలు, లాల్ దర్వాజా బోనాలు, ధూల్ పేట బోనాలు, పాంగ్యం (పంచ పురోహితులు), పదింట ఆచారవంతులు, శివ సత్తులు. పోతరాజులు, గ్రామాధికారులు-పనిపాటలవారు
  4. బోనాలు (సాంస్కృతిక) పూజాద్రవ్యాలు: ఘటం తయారి, బోనం తయారి, కుంభం తయారి, తొట్టెలు (ఉయ్యాల), ఫలహారబండ్లు, ప్రభలు, వేపాకులు, గవ్వ, రతి (పటం), రంగం కార్యక్రమం, పసుపు, శోభా యాత్ర
  5. స్థల పురాణాలు (ఐతిహ్యాలు): ఆలంపురీ మాహాత్మ్యం (కైఫీయత్), సవదత్తి ఎల్లమ్మ, మాహురాల (మైసాపురం), ఓరుగల్లు ఏకవీర (ఎల్లమ్మ), ఉస్నాబాద్ ఎల్లమ్మ, మైసిగండి మైసమ్మ, ఏడుగురు అక్కల కథ
  6. అనంతమైన శాస్త్రీయత: పర్యావరణ పరిశుభ్రత, అంకురార్పణ - అంతర్యం, ఆరోగ్య చిరు ధాన్యాలు, ప్రమిద (జ్యోతి), కల్లుసాక, ప్రాణి బలిహారం (బలి)
  7. పురాగాథలు - గ్రామదేవతా కొలుపులు: సత్యాన్నబోనం, మాత మహిమ, బలి తంతు.
  8. బోనాలు ఉత్సవ సాహిత్యం

మూలాలు

మార్చు
  1. తెలంగాణ బోనాలు, ప్రొఫెసర్ ననుమాస స్వామి, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, జూలై 2021.
  2. తెలంగాణ బోనాలు, ప్రొఫెసర్ ననుమాస స్వామి, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, జూలై 2021, పుట. 9