తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ రాష్ట్రంలోని భాషా, సంస్కృతిని ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన శాఖ. రవీంద్రభారతిలోని కళాభవన్ లో ఈ శాఖ కార్యాలయం ఉంది.[1] ఈ శాఖ 2014, జూన్ 2 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుండి విడిపోయింది.

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ
Telangana logo (New).jpg
సంస్థ అవలోకనం
స్థాపనం జూన్ 2, 2014
అధికార పరిధి తెలంగాణ, భారతదేశం
ప్రధాన కార్యాలయం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
Minister responsible వి. శ్రీనివాస్‌ గౌడ్‌
ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ మామిడి హరికృష్ణ, సంచాలకులు
మాతృ శాఖ భాషా సాంస్కృతిక శాఖ (తెలంగాణ ప్రభుత్వం)

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ చేస్తున్న కృషి అద్వితీయమైనది. తెలంగాణ కళలు, సాహి త్యం, తెలంగాణ తేజోమూర్తులు గురించి చేస్తున్న కృషి అపూర్వమైనది. రవీంద్రభారతి, కళాభవన్ కేంద్రంగా జరుగుతున్న సాంస్కృతిక ప్రదర్శనలు తెలంగాణ భాషను, సంస్కృతిని, తెలంగాణ అస్తిత్వాన్ని పతాక రీతి ప్రదర్శిస్తున్నాయి.[2]

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ 2016లో నిర్వహించిన కార్యక్రమాలు

సంచాలకులుసవరించు

 1. రాళ్ళబండి కవితాప్రసాద్ (- 27.10.2014)
 2. మామిడి హరికృష్ణ (28.10.2014 - ప్రస్తుతం)[3][4]

కార్యక్రమాలుసవరించు

వైతాళికుల స్మరణసవరించు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటినుండి భాషా సంస్కృతి అభివృద్ధి పై భాషా సాంస్కృతిక శాఖ దృష్టి సారించింది. తెలంగాణ సంస్కృతిని, కళలను, కళాకారులను ప్రోత్సహించడమే ధ్యేయంగా తెలంగాణ వైతాళికుల జయంతి, వర్థంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడంతోపాటు వారి పేర్లతో అవార్డులనూ ప్రకటించింది. అందులో భాగంగా కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవం[5] గా ప్రకటించడంతోపాటు, ఆయన పేరుమీద ఇక పురస్కారాన్ని ప్రవేశపెట్టి అమ్మంగి వేణుగోపాల్ (2015)[6][7], గోరటి వెంకన్న (2016)[8] లకు అందించింది. వరంగల్‌ లో కాళోజీ కళాకేంద్రం ఏర్పాటుకు 50 కోట్లు, హైదరాబాద్‌ లో 14 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణా కళాభారతి నిర్మాణానికి 300 కోట్లు ఏర్పాటుచేసింది. కొమురం భీం, పి.వి. నరసింహారావు, ఈశ్వరీ బాయి, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి మహనీయుల జయంతి, వర్థంతి కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలుగా ప్రకటించింది. 3,254 మంది వృద్ధ కళాకారులకు ప్రతి నెల 1500 రూపాయల పెన్షన్ సౌకర్యం, 550 మంది కళాకారులకు సాంస్కృతిక సారథి కింద ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది.[9] తొలిదశ తెలంగాణ ఉద్యమ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే జెట్టి ఈశ్వరీబాయి జయంతి, వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.[10]

రాష్ర్టావతరణ వేడుకలుసవరించు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి ఏడాది వేడుకలలో వివిధ కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో చౌమల్లా ప్యాలెస్ నుండి శిల్పారామం వరకు 32 వేదికల మీద కళాప్రదర్శనలు నిర్వహించింది.

రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలుసవరించు

రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ అవతరణ దినోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది.[11] అందులో భాగంగా మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఉత్తమ పురస్కారాలను అందించడం జరుగుతుంది.[12][13] రాష్ట్ర స్థాయిలో 32 విభాగాల్లో 52 రంగాల వారికి ఆవార్డు కింద ఒక్కొక్కరికి లక్షా నూటా పదహారు రూపాయలతో మండల స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు 5,780 మందిని ప్రభుత్వం సత్కరించింది. ఈ పురస్కారాల కింద 7 కోట్ల 52 లక్షల 70 వేలు అందజేసింది. అంతేకాకుండా ఉగాది వేడుకల్లోనూ 19 అంశాల్లో 28 మందికి 10 వేల చొప్పున అందించి, సత్కరించింది.

జాతీయ సంస్థలతో సమన్వయంసవరించు

తెలంగాణ అస్తిత్వాన్ని దేశ నలుమూలలా ప్రసరింపజేయడానికి భాషా సాంస్కృతిక శాఖ, జాతీయ స్థాయి సాంస్కృతిక సంస్థలతో కలసింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నాటకోత్సవాలు[14][15], సౌత్‌జోన్ కల్చరల్ సెంటర్ తంజావూరు, నార్త్‌ఈస్ట్ కల్చరల్ సెంటర్, దిమాపూర్ కళాకారులతో సాంస్కృతిక వినిమయం వంటివి హైదరాబాద్ లో జరిపింది. ఈశాన్య రాష్ర్టాల కళాకారులతో ఆక్చేవ్-2014 పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో కళా ప్రదర్శనలు నిర్వహించింది. దేశ రాజధానిలో తెలంగాణ కళాకారులు వారం రోజుల పాటు ప్రదర్శనలు ఇచ్చి తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటే అవకాశం కల్పించింది.

తెలంగాణ కళారాధనసవరించు

ఈ శాఖకు మామిడి హరికృష్ణ డైరెక్టర్‌గా నియమితులయ్యాక తెలంగాణ కళారాధన-2015 పేరుతో 125 రోజులపాటు, తెలంగాణ కళారాధన-2016 పేరిట 51 రోజులపాటు నిత్యం కళాప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఈ కళారాధనలో బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, సురభి నాటకాలు, మైమ్, మ్యాజిక్, మిమిక్రీ, సలామ్ తెలంగాణ శీర్షికన ఉర్దూ సంప్రదాయ కళలు సూఫీ, ముషాయిరా, ఖవ్వాలి, గజల్స్ ఇలా విభిన్న రకాల కళలను ఒకే వేదికపై ప్రదర్శించారు. రవీంద్రభారతి స్థాపించిన 54 సంవత్సరాల చరిత్రలో ఇటువంటిది జరగడం ఇదే మొదటిసారి.

సాహిత్యానికి పెద్ద పీటసవరించు

సాహిత్యం విషయంలో కూడా భాషా సాంస్కృతిక శాఖ మంచి కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా నాలుగు అంశాలపై ప్రత్యేక కవితా సంపుటాలు తీసుకువచ్చింది. తొలి ప్రయత్నంగా కొత్తసాలు పేరుతో కవితా సంకలనం, బతుకమ్మ పండుగ సందర్భంగా తంగేడువనం పేరుతో తంగేడు పువ్వు మీద 166 మంది కవులతో కవితా సంకలనం, 2015 రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా తొలిపొద్దు కవితా సంకలనం, 2016 రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా మట్టిముద్ర కవితా సంకలనం, 2017 హేవళంబి నామ ఉగాది కవి సమ్మేళనంలో భాగంగా తల్లివేరు కవితా సంకలనాలను వెలువరించింది.[16] ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 సందర్భంగా తెలంగాణ తేజోమూర్తులు, కళా తెలంగాణం, పటం కతలు పుస్తకాలను ప్రచురించింది.[17] 2015 నుండి 2018 వరకు ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించి 2015లో కొత్తసాలు, 2016లో హమారా హైదరాబాదు (బహుభాషా కవిత్వం), 2017లో ఇక్కడి పరిమళం ఎక్కడి పూలదో (అనువాద కవిత్వం), 2018లో మై చెల్డ్ వెడ్ (బహుభాషా కవిత్వం) పుస్తకాలు ప్రచురించారు.[18][19]

తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలుసవరించు

మహిళలు అన్ని రంగాల్లో రాటుదేలుతున్నారు. విజయవంతంగా రాణిస్తున్నారు. విద్య అయినా.. ఉద్యోగం అయినా.. వ్యాపారం అయినా మేమున్నాం.. అని ముందువరుసలో నిలబడుతున్నారు. ఎన్ని చేసినా సరైన గౌరవం.. ప్రోత్సాహం లభిస్తేనే ఉత్సాహం రెట్టింపవుతుంది. గౌరమ్మను గంగలో పూజించే బతుకమ్మ సాక్షిగా.. దుర్గమ్మను నైవేద్యంతో పూజించే బోనం సాక్షిగా.. స్త్రీలను గౌరవించుకోవడం, సత్కరించుకోవడం తెలంగాణ రాష్ట్ర సంప్రాదాయం. 70 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం, మహిళా, శిశు సంక్షేమ శాఖ, భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం లో ఆయా రంగాల్లో రాణించిన మహిళలకు ప్రత్యేక పురస్కారాలు అందజేస్తుంది.[20]

 1. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2016
 2. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2017 లో 13 కేటగిరీలకుగాను 24 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళలుగా ఎంపిక చేసి నగదు పురస్కారంతో సత్కరించింది.[21]
 3. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2018 లో 17 కేటగిరీలకుగాను 20 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళలుగా ఎంపిక చేసి నగదు పురస్కారంతో సత్కరించింది.[22]
 4. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2019లో 14 కేటగిరీలకుగాను 21 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళలుగా ఎంపిక చేసి నగదు పురస్కారంతో సత్కరించింది.[23]

జానపద జాతరసవరించు

ఆగస్టు 22న ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా శాఖ ఆధ్వర్యంలో జానపద జాతర ఆగస్టు 22 నుంచి ఆగస్టు 31 వరకు పది రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో స్థానిక జానపద కళాకారులచే జానపద కళారూపాల ప్రదర్శనలు ఇవ్వబడుతున్నాయి.

ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌సవరించు

25 రాష్ర్టాల సంప్రదాయ తీపి వంటకాలతో మూడురోజుల పాటు ఈ స్వీట్ ఫెస్టివల్ జరుగనుంది. 25 రాష్ర్టాలు, 15 దేశాల నగరాల స్వీట్ వెరైటీలు ఇక్కడ ప్రదర్శిస్తారు. ప్రతిరోజూ వివిధ రాష్ర్టాల కళారూపాలు కూడా ప్రదర్శిస్తారు. ఫుడ్‌కోర్టులు, స్నాక్స్, హస్తకళల ప్రదర్శన కూడా ఉంటాయి. ఒక్కో ఐటమ్ చాలా రకాల వెరైటీల్లో లభిస్తుంది. 70 రకాల లడ్డూలు, 80 రకాల పాయసాలు ఇలా ఒక్కో ఐటమ్ కనీసం 60,70 రకాల్లో దొరుకుతుంది. దాదాపు 1200 మంది మహిళలు స్వీట్ స్టాల్స్ ఏర్పాటు చేశారు.[24] సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌం డ్‌లో మూడురోజులపాటు కొనసాగే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను 2019, జనవరి 13 ఆదివారంరోజున ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.[25]

నాటకరంగంసవరించు

తెలంగాణా రాష్ర్టం రూపొందిన తర్వాత నాటకరంగాన్ని మళ్లీ ప్రజలలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నాలు తీవ్రంగా మొదలయ్యాయి. వాటిని ప్రజల దృష్టిలో పెట్టుకున్న భాషా సాంస్కృతిక శాఖ నాటకరంగ పురోభివృద్ధికి ఏడు అంచెల నిర్మాణాత్మక వ్యూహాన్ని రూపొందించి అమలుచేయడం మొదలుపెట్టింది. 1) సంప్రదాయ పద్య, పౌరాణిక, సురభి నాటకాలను ప్రోత్సహించడం, కొనసాగించడం, 2) ఆధునిక, ప్రయోగాత్మక, సాంఘిక నాటకాలను ప్రోత్సహించడం, 3) జాతీయ, అంతర్జాతీయ భాషల నాటకాలను తెలుగులో నాటకీకరించి ప్రదర్శించడం, 4) హైదరాబాద్‌కే ప్రత్యేకం అనదగిన దక్కనీ నాటకాన్ని, ఉర్దూ నాటకాన్ని ఆదరించి ప్రోత్సహించడం, 5)ప్రముఖ తెలంగాణ కథకులు, సాహితీవేత్తలు రాసిన కథలను నాటకీకరించి ప్రదర్శించడం, 6) జాతీయ, అంతర్జాతీయ నాటక బృందాలను తెలంగాణకు, హైదరాబాద్‌కు ఆహ్వానించి రాష్ర్ట కళాకారులకు, నాటకాభిమానులకు జాతీయ, అంతర్జాతీయ నాటకాన్ని పరిచయం చేయడం, సాంస్కృతిక మార్పిడికి దారులు వేయడం, 7) జిల్లాస్థాయిలో వివిధ రకాల నాటక సప్తాహాలు నిర్వహించడం ద్వారా నాటకాన్ని ప్రజలకు చేరువ చేయడం, 8)ప్రముఖ నాటక కర్తల పేరిట నాటకోత్సవాలు నిర్వహించటం. వీటితోపాటు తెలంగాణ యువ నాటకోత్సవం పేరిట యువ కళాకారులతో నాటక ప్రదర్శనలు చేయిస్తూ న్యూవేవ్ థియేటర్ మూవ్‌మెంట్ దిశగా తనదైన ముద్రను వేయగలిగింది. కథలను నాటకీకరించడం, ఇతర భారతీయ భాషల నాటకాలను తెలుగీకరించడం, అంతర్జాతీయ నాటకాన్ని తెలుగులో అందించడం, సమకాలీన సమస్యలే వస్తువుగా నాటకాలు రాయడం మొదలైనవి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘న్యూ వేవ్ థియేటర్’కు పునాదులు.[26]

దాశరథి సాహితీ పురస్కారంసవరించు

నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చాటిన దాశరథి కృష్ణమాచార్య జన్మదిన వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంలో, సాహిత్యరంగంలో కృషిచేసిన వారికి దాశరథి సాహితీ పురస్కారంను అందజేయడం జరుగుతుంది.

సినివారంసవరించు

తెలంగాణ సినీ కళాకారులు, ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు భాష, సాంస్కృతిక శాఖ ప్రతి శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమమే ఈ సినివారం. 2016, నవంబర్ 12న ప్రారంభమైన ఈ సినివారం వేదికలో వర్థమాన దర్శకులు తమ ప్రతిభకు పదును పెడుతూ సృజనాత్మక కథాంశాలతో రూపొందించిన లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రతి శనివారం రవీంద్రభారతిలో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. లఘు చిత్రాల దర్శకులను ప్రోత్సహించడంతో పాటు వారి ప్రజ్ఞాపాటవాలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.[27][28]

సండే సినిమాసవరించు

తెలంగాణ సినిమా కోసం ఆరాటపడే యువదర్శకులు, రచయితలు, నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సినీ అభిమానులకు ప్రపంచ సినిమాను పరిచయంచేసే ఉద్ధేశ్యంతో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమం సండే సినిమా (ఎ విండో టూ వరల్డ్ సినిమా).[29][28]ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రపంచ సినిమాల ప్రదర్శనతో పాటు వర్ధమాన సినీ కళాకారులకు ప్రపంచ స్థాయి సినిమాని పరిచయం చేసి, ప్రపంచ స్థాయి సినిమా నిర్మాణ విలువలు, విశేషాలు, మెళకువలను తెలియజేసేందుకు వివిధ రకాల వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తున్నారు.

ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్‌సవరించు

సినిమారంగం లోకి రావాలనుకుంటున్న యువతకు అంతర్జాతీయ సినిమాను పరిచయంచేయడంతోపాటు ఆ సినిమాల్లోని థీమ్, టెక్నిక్, టేకింగ్‌ల గురించి సరైన అవగాహనకోసం శాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమం ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్‌.[30] ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను తెలుసుకోవడం వల్ల మన తెలంగాణ సినిమా రాబోయే కాలంలో ఎలా వుండాలో తెలుసుకోవడానికి ఈ ఫెస్టివల్ ఓ కేస్ స్టడీగా ఉంటుంది. గతంలో ఈ చిత్రోత్సవంలో ఇరాన్ చిత్రాలను, జర్మనీ చిత్రాలను, వివిధ భాషల్లో వచ్చిన దేవదాసు చిత్రాలను, ఫ్రెంచ్ చిత్రాలను, కొరియన్ చిత్రాలను[31], మృణాళ్ సేన్ ఫిలిం ఫెస్టివల్, [28] గిరీష్ కర్నాడ్, పైడి జైరాజ్, జర్మన్ బాలల చిత్రాలను[32] ప్రదర్శించారు.

స్కోచ్‌ గోల్డెన్‌ అవార్డు - ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ పురస్కారంసవరించు

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కళలకు చెందిన ఆన్లైన్ ద్వారా కళాకారులకు గుర్తింపుకార్డులను అందిచడంతోపాటూ, వారికి సంబంధించిన డేటాబేసును తయారుచేయడంకోసం శాఖ ఒక యాప్‌, మరో సాఫ్ట్‌వేర్‌ను డెవలప్‌ చేసింది. దేశంలోనే తొలిసారిగా రూపొందించిన ఈ విధానంకు ఇన్నోవేటివ్‌ విభాగంలో ప్రతిష్ఠాత్మక స్కోచ్‌ గోల్డెన్‌ అవార్డుతోపాటు ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ పురస్కారం వచ్చింది.[33][34]

ప్రచురణలుసవరించు

తెలుగు:

 1. తొలిపొద్దు: 2015 రాష్ట్ర అవతరణ వేడుకల్లో 442మంది కవుల కవితా సంకలనం
 2. కొత్తసాలు: 2016, మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవంలో 60మంది కవులచే కవి సమ్మేళన కవితా సంకలనం
 3. తంగేడువనం: 2016 బతుకమ్మ పండుగ సందర్భంగా తంగేడు పువ్వు మీద 166మంది కవుల కవితా సంకలనం
 4. మట్టి ముద్ర: 2016 ఉగాది వేడుకల్లో 64మంది కవుల కవితా సంకలనం
 5. పద్య తెలంగాణం: 2016 రాష్ట్ర అవతరణ వేడుకలు 134మంది కవుల కవితా సంకలనం
 6. తల్లివేరు: 2017 ఉగాది పండుగలో 47మంది కవుల కవితా సంకలనం
 7. స్వేదభామి: 2017 రాష్ట అవతరణ వేడుకల్లో 66మంది కవుల కవితా సంకలనం
 8. ఆకుపచ్చని పొద్దుపొడుపు: హరితహారం గురించి 171మంది కవుల కవితా సంకలనం, 2017
 9. గొల్ల రామవ్వ ఇంకొన్ని నాటికలు: తెలంగాణ యువ నాటకోత్సవం లో ప్రదర్శించిన నాటికల స్క్రిప్ట్ లు, 2017
 10. తెలంగాణ తేజోమూర్తులు: 153మంది తెలంగాణ మహనీయుల జీవిత పరిచయ వ్యాసాలు, 2017
 11. కళా తెలంగాణం: తెలంగాణలోని 27 కళారూపాల పరిచయ వ్యాసాలు, 2017
 12. పటం కతలు: తెలంగాణకు చెందిన 16 పటం కథల పరిచయ వ్యాసాలు, 2017
 13. తెలంగాణ వాగ్గేయ వైభవం: చరిత్రకెక్కని 20మంది సంకీర్తనాచార్యుల పరిచయం, 2017
 14. తెలుగు కార్టూన్: 150మంది తెలంగాణ కార్టూనిస్టు వేసిన 181 కార్టూన్స్ సంకలనం, 2017
 15. స్మర నారాయణీయం: డా. సి. నారాయణరెడ్డి గురించి సాహితీవేత్తలు రాసిన కవితలు వ్యాసాల సంకలనం, 2017
 16. అలుగు దుంకిన అక్షరం: 2018 ఉగాది పండుగలో 47మంది కవుల కవితా సంకలనం
 17. కాకతీయ ప్రస్థానం: కాకతీయుల చరిత్ర సంబంధించిన వ్యాసాల సంకలనం, 2018
 18. మనకు తెలియని తెలంగాణ: తెలంగాణలో వెలుగుచూడని చరిత్ర నేపథ్య వ్యాసం సంకలనం, 2019
 19. తారీఖుల్లో తెలంగాణ: తేదీల వారిగా తెలంగాణ సంక్షిప్త సమాచారం 2019
 20. తెలంగాణ రుచులు: తెలంగాణ వంటలు సమగ్ర సమాచారం, 2019
 21. జయ జయోస్తు తెలంగాణ:

ఇంగ్లీష్:

 1. కల్చర్ ఆఫ్ తెలంగాణ ఎట్ సూరజ్‌కుండ్: 2016లో హర్యానాలోని సూరజ్‌కుండ్ లో జరిగిన అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళాలో తెలంగాణ కళారూపాల ప్రదర్శన
 2. తెలంగాణ హార్వెస్ట్: తెలంగాణ ప్రముఖ కథకుల కథల ఇంగ్లీష్ అనువాద సంకలనం, 2017
 3. ఆదిరంగ్ మహోత్సవ్ - 2017:
 4. కల్చర్ ఆఫ్ ఎమిటి: హైదరాబాదులోని దర్గాల చరిత్ర, 2017
 5. ఎ గ్రీన్ గార్లాండ్: పర్యావరణ కవితల ఇంగ్లీష్ అనువాదం
 6. ఉమెన్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్:
 7. వేర్ ది మెడ్ ఈజ్ హైల్డ్ హై: గోల్కొండ కోట తెలంగాణ కళారూపాల ప్రదర్శన, 2018
 8. ఐవిట్‌నెస్ ఆఫ్ ఎన్ ఎపోచ్:
 9. మైమ్‌స్కేప్ ఆఫ్ తెలంగాణ:

హిందీ:

 1. నయా సాల్: 59 మంది కవుల కవితలు హిందీ అనువాద సంకలనం, 2017

ఇతర వివరాలుసవరించు

ఇవేకాక ప్రతి జిల్లాలో ఆడిటోరియం, కళాభారతిల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రీజనల్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి తగిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి, ఎన్‌ఎస్‌డీ ఛైర్మన్ రతన్ థియామ్‌కు అందించడం జరిగింది.

మూలాలుసవరించు

 1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (29 July 2018). "సకల కళాభారతి!". మూలం నుండి 30 July 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 31 July 2018. Cite news requires |newspaper= (help)
 2. నమస్తే తెలంగాణ, సంపాదకపేజీ వ్యాసం (28 November 2018). "కేసీఆర్ విజన్‌తో సకల కళల వికాసం". బి.ఎస్. రాములు (రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్). మూలం నుండి 29 November 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 29 November 2018. Cite news requires |newspaper= (help)
 3. సాక్షి, తెలంగాణ, కథ. "సాంస్కృతిక శాఖ సంచాలకునిగా హరికృష్ణ!". Retrieved 28 December 2016. Cite news requires |newspaper= (help)
 4. వన్ ఇండియా. "భాషా సాంస్కృతిక డైరెక్టర్‌గా మామిడి హరికృష్ణ". Retrieved 23 July 2016. Cite web requires |website= (help)
 5. ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు. "తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి". Retrieved 19 December 2016. Cite news requires |newspaper= (help)[permanent dead link]
 6. 10టివి. "రచయిత అమ్మంగి వేణుగోపాల్ కు కాళోజి తొలి స్మారక పురస్కారం." Retrieved 19 December 2016. Cite news requires |newspaper= (help)[permanent dead link]
 7. telangananewspaper. "Ammangi Venugopal Honour Kaloji Puraskar Award 2015". Retrieved 19 December 2016. Cite news requires |newspaper= (help)
 8. నమస్తే తెలంగాణ. "తెలంగాణ ముద్దు బిడ్డ గోరటి వెంకన్న కాళోజీ పురస్కారం". Retrieved 19 December 2016. Cite news requires |newspaper= (help)
 9. నమస్తే తెలంగాణ, SUNDAY NEWS. "మన భాషా సాంస్కృతిక శాఖ పునర్నిర్మాణంలో కొత్త సాలు". Retrieved 28 December 2016. Cite news requires |newspaper= (help)
 10. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (25 February 2019). "తెలంగాణ ఆణిముత్యం ఈశ్వరీబాయి". మూలం నుండి 25 February 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 25 February 2019. Cite news requires |newspaper= (help)
 11. నమస్తే తెలంగాణ. "రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు". Retrieved 28 December 2016. Cite news requires |newspaper= (help)[permanent dead link]
 12. జనంసాక్షి. "50 మందికి ఆవిర్భావ పురస్కారాలు". Retrieved 28 December 2016. Cite news requires |newspaper= (help)[permanent dead link]
 13. ముచ్చట.కాం. "ఈ 62 మందికీ తెలంగాణ ఆవిర్భావ పురస్కారాలు". www.muchata.com. Retrieved 28 December 2016.
 14. సాక్షి. "ముగిసిన వేడుక". Retrieved 28 December 2016. Cite news requires |newspaper= (help)
 15. వన్ ఇండియా. "ఆకట్టుకున్న 'చిత్రాంగద' ప్రదర్శన(పిక్చర్స్)". telugu.oneindia.com. Retrieved 28 December 2016.
 16. వెబ్ ఆర్కైవ్, నమస్తే తెలంగాణ, ఎడిట్ పేజి వ్యాసాలు (16 April 2018). "కొత్తరాష్ట్రంలో కొత్తసాలు". అయినంపూడి శ్రీలక్ష్మి. Retrieved 16 April 2018. Cite news requires |newspaper= (help)
 17. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (18 December 2017). "రాష్ట్ర సాధనకు బాటలు వేసిన పాట". మూలం నుండి 27 February 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 27 February 2019. Cite news requires |newspaper= (help)
 18. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (22 March 2017). "ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం". మూలం నుండి 21 March 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 29 March 2019. Cite news requires |newspaper= (help)
 19. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (2 June 2019). "మన తెలంగాణ ఘన తెలంగాణ". మూలం నుండి 2 June 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 15 June 2019. Cite news requires |newspaper= (help)
 20. నమస్తే తెలంగాణ, జిందగీ (7 March 2018). "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 8 March 2018. Cite news requires |newspaper= (help)
 21. నమస్తే తెలంగాణ. "ప్రతిభకు పురస్కారం!". Retrieved 8 March 2017. Cite news requires |newspaper= (help)
 22. నమస్తే తెలంగాణ (9 March 2018). "రిజర్వేషన్లతోనే మహిళలకు న్యాయం". Retrieved 9 March 2018. Cite news requires |newspaper= (help)
 23. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (9 March 2019). "మహిళల ఆలోచనలకు అండగా నిలువాలి". మూలం నుండి 9 March 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 12 March 2019. Cite news requires |newspaper= (help)
 24. నమస్తే తెలంగాణ, జిందగీ వార్తలు (12 January 2019). "నగరంలో తియ్యని వేడుక". మూలం నుండి 17 January 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 17 January 2019. Cite news requires |newspaper= (help)
 25. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (14 January 2019). "వైవిధ్య భారత్‌కు ప్రతీకగా పతంగుల పండుగ". మూలం నుండి 17 January 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 17 January 2019. Cite news requires |newspaper= (help)
 26. మన తెలంగాణ, లైఫ్ స్టైల్ (December 31, 2017). "నవ్య నాటక శకారంభం యువతరంగస్థలం". మూలం నుండి 3 January 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 3 January 2019. Cite news requires |newspaper= (help)
 27. నమస్తే తెలంగాణ (19 November 2016). "'సిని వారం సినిమాలు'". Retrieved 8 November 2017. Cite news requires |newspaper= (help)
 28. 28.0 28.1 28.2 Times of India, Hyderabad City (27 January 2019). "Lights, camera! Cinema in state set for a lot of action". Srirupa Goswami. మూలం నుండి 27 January 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 27 January 2019. Cite news requires |newspaper= (help)
 29. నమస్తే తెలంగాణ (7 January 2018). "సండే సినిమా.. చూడండి!". Retrieved 11 March 2018. Cite news requires |newspaper= (help)
 30. నమస్తే తెలంగాణ, సినిమా (10 April 2018). "ఘనంగా ప్రారంభమైన జర్మన్ చిత్రోత్సవం". మూలం నుండి 20 July 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 20 July 2018. Cite news requires |newspaper= (help)
 31. నమస్తే తెలంగాణ, సినిమా (12 August 2018). "కొరియన్ ఫిలిం ఫెస్టివల్". మూలం నుండి 12 August 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 12 August 2018. Cite news requires |newspaper= (help)
 32. ఈనాడు, హైదరాబాదు (2 November 2019). "నగరంలో జర్మన్‌ బాలల చిత్రోత్సవం". www.eenadu.net (ఆంగ్లం లో). మూలం నుండి 3 నవంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 3 November 2019.
 33. ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (1 July 2018). "కల్చర్‌కు కంప్యూటర్‌కు లంకె". మూలం నుండి 16 July 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 7 July 2018. Cite news requires |newspaper= (help)
 34. Telangana Today, SundayScape (3 November 2019). "Building brand through culture". Madhuri Dasagrandhi. మూలం నుండి 3 November 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 21 November 2019. Cite news requires |newspaper= (help)

ఇతర లంకెలుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
 1. భాషా సాంస్కృతిక శాఖ యూట్యూబ్ ఛానల్
 2. భాషా సాంస్కృతిక శాఖ ఫేస్బుక్ పేజీ
 3. సినివారం ఫేస్బుక్ పేజీ
 4. సండే సినిమా ఫేస్బుక్ పేజీ
 5. పైడి జైరాజ్ థియేటర్ ఫేస్బుక్ పేజీ