తెలంగాణ మొబిలిటీ వ్యాలీ
తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అనేది ఎలక్ట్రిక్ వెహికిల్స్, అత్యాధునిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, మాన్యుఫ్యాక్చరింగ్, ఆర్ అండ్ డీ కార్యకలాపాలకోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న మొబిలిటీ వ్యాలీ. 2028 నాటికి తెలంగాణలోకి 50వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు 4 లక్షల ఉద్యోగాలను సృష్టించాలన్న లక్ష్యంతో భారతదేశంలోనే తొలిసారిగా ఈ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుచేయబడింది.[1]
తెలంగాణ మొబిలిటీ వ్యాలీ | |
---|---|
రకం | తయారీ కేంద్రాలు |
స్థానం | తెలంగాణ |
విస్తీర్ణం | 1,200 ఎకరాలు |
నిర్వహిస్తుంది | తెలంగాణ ప్రభుత్వం |
హైదరాబాద్ చుట్టుపక్క ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం 1,200 ఎకరాలలో 4 మెగా క్లస్టర్లు (జహీరాబాద్, సీతారాంపూర్‌లో ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, దివిటిపల్లిలో ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ క్లస్టర్, ఎంకతలలో ఇన్నోవేషన్ క్లస్టర్) అభివృద్ధి చేయబడుతున్నాయి.[2]
సదస్సు
మార్చు2023 ఫిబ్రవరి 6న హైదరాబాదులోని హెచ్‌ఐసీసీలో ‘మొబిలిటీ నెక్స్ హైదరాబరాద్ సమ్మిట్-2023’ కార్యక్రమం జరిగింది. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ నమూనాను రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించాడు.[3]
ఈ సదస్సులో ఎంకతలలో క్లస్టర్ అభివృద్ధికి 250 కోట్లు పెట్టుబడితో జర్మన్ సర్వీస్ ప్రొవైడర్ ఏటీఎస్-టీయూవీ రైన్‌ల్యాండ్‌తో రాష్ట్రం అవగాహన ఒప్పందం జరిగింది. అమర్ రాజా 9500 కోట్లతో బ్యాటరీల తయారీ, హ్యుందాయ్ 1400 కోట్లతో ఆటోమోటివ్ ప్రూవింగ్ గ్రౌండ్స్ ఏర్పాటు, బిల్టీ ఎలక్ట్రిక్ 1,100 కోట్లతో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు, అల్లాక్స్ 750 కోట్లతో దేశ మొట్టమొదటి మల్టీ గిగావాట్ క్యాథోడ్ తయారీ యూనిట్, అటెరో బ్యాటరీ 600 కోట్లతో రీసైక్లింగ్ ప్లాంట్, గ్రావ్టన్ 150 కోట్లతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ కేంద్రాలను ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాయి.[4]
ఎంకతల క్లస్టర్
మార్చుతెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, మోమిన్‌పేట్ మండలం, ఎంకతల గ్రామంలో ఒక మొబిలిటీ వ్యాలీ నిర్మించబడుతున్నది. అత్యాధునిక టెస్టిం గ్ ల్యాబ్‌లను కలిగి ఉండే ఈ క్లస్టర్లలో ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు లిథియం అయాన్ బ్యాటరీలు, విడిభాగాలను తయారు చేయనున్నారు.
జహీరాబాద్ క్లస్టర్
మార్చుమహీంద్రా గ్రూపు - ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 1000 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ ప్లాంట్‌లో ఈవీ బ్యాటరీల యూనిట్ (లాస్ట్ మైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్) నిర్మాణానికి 2023 ఏప్రిల్ 24న కేటీఆర్ శంకుస్థాపన చేశాడు.[5][6] వాహన రంగంలో వస్తున్న మార్పులననుసరించి ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన బ్యాటరీలను ఈ యూనిట్ ద్వారా ఉత్పత్తి చేయబడుతాయి. ప్లాంట్‌తో దాదాపు వెయ్యిమందికి ఉద్యోగ అవకాశం లభిస్తోంది.
మూలాలు
మార్చు- ↑ Bureau, The Hindu (2023-02-06). "Telangana Mobility Valley will generate over 4 lakh jobs in next five years: KTR". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2023-02-06. Retrieved 2023-04-24.
- ↑ telugu, NT News (2023-02-07). "దేశంలోనే తొలి మొబిలిటీ క్లస్టర్ టీఎంవీ". www.ntnews.com. Archived from the original on 2023-02-07. Retrieved 2023-04-24.
- ↑ Velugu, V6 (2023-02-06). "1200 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ కంపనీలు:కేటీఆర్". V6 Velugu. Archived from the original on 2023-02-07. Retrieved 2023-04-24.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ telugu, NT News (2023-02-06). "ఆరు బిలియన్ల పెట్టుబడి.. 4లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం : కేటీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-02-06. Retrieved 2023-04-24.
- ↑ Ayyappa, Mamidi (2023-04-24). "Telangana: ఎలక్ట్రిక్ బ్యాటరీల యూనిట్‌కు మంత్రి KTR శంకుస్థాపన.. వేల మందికి ఉపాధి..!". www.telugu.goodreturns.in. Archived from the original on 2023-04-24. Retrieved 2023-04-24.
- ↑ "'మహీంద్రా'లో ఈవీ బ్యాటరీల యూనిట్". EENADU. 2023-04-24. Archived from the original on 2023-04-24. Retrieved 2023-04-24.