తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధాన ముసాయిదా

తెలంగాణ రాష్ట్ర ఆర్థికవృద్ధి, పారిశ్రామికీకరణ అభివృద్ధికోసం తయారుచేసిన పారిశ్రామిక విధాన ము

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధాన ముసాయిదా, అనేది తెలంగాణ రాష్ట్ర ఆర్థికవృద్ధి, పారిశ్రామికీకరణ అభివృద్ధికోసం తయారుచేసిన పారిశ్రామిక విధాన ముసాయిదా. ఇది 2014 డిసెంబరు 1న అమల్లోకి వచ్చింది. ఈ విధానంలో ఆరు పారిశ్రామిక కారిడార్లు, సాధారణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే ప్రణాళికతో పద్నాలుగు రంగాలు ఉన్నాయి. ఐటీసీ, టాటా మోటార్స్, మహీంద్రా వంటి పెద్ద కంపెనీలు కొత్తగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో తమ వ్యాపారాన్ని విస్తరించడంలో ఈ విధానం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

చరిత్ర మార్చు

ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహం కోసం 2011, మే 5న కొన్ని మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. పెప్సీ, సిరి సిటీ ప్రాజెక్ట్ వంటి సంస్థలను ఆకర్షించడంలో ఈ విధానం ముఖ్యపాత్ర పోషించడంతోపాటు హైదరాబాదు నగరంలో సేవారంగ వృద్ధిని పెంచి, ఐటీ లాజిస్టిక్స్ హబ్‌గా మార్చింది.

రాష్ట్ర విభజన తర్వాత, రెండు రాష్ట్రాలు ఉపాధి, జీవన ప్రమాణాలను పెంచే పెట్టుబడులను ఆకర్షించే దిశగా ముందుకుసాగాయి. అందులో భాగంగా 2014, నవంబరు 27న తెలంగాణ విధాన ముసాయిదా ప్రవేశపెట్టబడి, 2014 డిసెంబరు 1 నుండి అమలులోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానంతో రికార్డు సృష్టించి, ప్రారంభించిన 15 రోజుల్లోనే 1500 కోట్ల రూపాయల విలువైన 17 ప్రాజెక్టులను పరిశీలించి అనుమతులను ఇచ్చింది.[1]

ప్రధాన లక్ష్యాలు మార్చు

  • పారిశ్రామిక వృద్ధిని సులభతరం చేయడం
  • ఉపాధి సామర్థ్యం పెంచడం
  • సామాజిక సమానత్వాన్ని సులభతరం చేయడం
  • సామాజికంగా వెనుకబడిన వర్గాలను ప్రభావితం చేయడం

సింగిల్ విండో మెకానిజం మార్చు

ప్రధాన వ్యాసం: టీఎన్ ఐపాస్

ఇండస్ట్రియల్ క్లియరెన్స్ సిస్టమ్ సింగిల్ విండో సిస్టమ్‌కు అతీతంగా ఉండాలని ఈ విధానాన్ని రూపొందించారు. దీనిని తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం అని పిలుస్తారు. అతిపెద్ద ప్రాజెక్టులు, పెద్ద పరిశ్రమలు, ఎస్ఎంఈ వంటి మూడు స్థాయిలలో ఈ విధానం పనిచేస్తోంది.

ప్రధాన రంగాలు మార్చు

  • లైఫ్ సైన్సెస్
  • బయో-మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్, సెల్యులార్ కమ్యూనికేషన్‌తో సహా ఐటి హార్డ్‌వేర్
  • ఏవియేషన్, ఏరోస్పేస్‌తో సహా ఇంజనీరింగ్
  • ఆహర తయారీ
  • ఆటోమొబైల్స్, ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు
  • వస్త్రాలు
  • ప్లాస్టిక్స్, పాలిమర్లు
  • వేగంగా కదిలే వినియోగ వస్తువులు,గృహోపకరణాలు
  • ఇంజనీరింగ్ వస్తువులు
  • రత్నాలు, నగలు
  • వ్యర్థ పదార్థాల నిర్వహణ, హరిత టెక్నాలజీ
  • పునరుత్పాదక శక్తి, సోలార్ పార్కులు
  • గని ఆధారిత, చెక్క ఆధారిత పరిశ్రమలు
  • రవాణా, లాజిస్టిక్ హబ్, లోతట్టు పోర్టులు

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Janyala, Sreenivas (22 June 2015). "Telangana govt sets record with new industrial policy, clears 17 projects worth Rs 1500 crore in 10 days". The Indian Express. Retrieved 20 February 2020.

బయటి లింకులు మార్చు