తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తెలంగాణ రాష్ట్రం లోని పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థ.[2]

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ
రకంప్రభుత్వం
స్థాపితంజూన్ 2, 2014[1]
ప్రధానకార్యాలయంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం 6వ అంతస్థు, పరిశ్రమ భవన్, బషీరాబాద్
సేవా ప్రాంతముతెలంగాణ
కీలక వ్యక్తులుగ్యాదరి బాలమల్లు (ఛైర్మన్), ఈ.వి. నరసింహరెడ్డి (వైస్ ఛైర్మన్)
పరిశ్రమపారిశ్రామిక అభివృద్ధి
ఉద్యోగులు150
వెబ్‌సైటుఅధికారిక వెబ్ సైట్

ఇది 2014లో ప్రారంభించబడింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్లాట్లు/షెడ్లు, రోడ్లు, డ్రైనేజ్, నీరు, విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలు కలిగి గుర్తించి, వాటి అభివృద్ధి దిశగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ కృషిచేస్తుంది.[3] తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతుంది.[4]

లక్ష్యాలుసవరించు

  • పారిశ్రామిక ప్రమోషన్
  • మౌలిక సదుపాయాల అభివృద్ధి
  • భూసేకరణ
  • ప్రాజెక్ట్ నిర్మాణం

తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంసవరించు

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపార, పరిశ్రమ వర్గాలు ఆతృతతో ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానానికి అసెంబ్లీలో ఆమోదం లభించింది. పరిశోధన నుంచి ఆవిష్కరణ - ఆవిష్కరణ ద్వారా పరిశ్రమ - పరిశ్రమ ద్వారా సమాజ శ్రేయస్సే ఈ నూతన పారిశ్రామిక విధానం లక్ష్యం. పరిశ్రమల స్థాపనతోనే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెంది, నిరుద్యోగ యువతకు ఉపాధి... ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. పరిశ్రమల ఏర్పాటుకు లాండ్ బ్యాంకును ఏర్పాటు చేసి, సేకరించిన భూమిని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థకు బదిలీ చేసి ఔత్సాహికులకు కేటాయిస్తారు. పరిశ్రమలకు కేటాయించిన భూములకు రహదారి, విద్యుత్, నీటి వసతి మొదలైన మౌలిక సౌకర్యాలను ప్రభుత్వమే కల్పిస్తుంది. దీనికయ్యే వ్యయం ప్రభుత్వమే భరిస్తుంది. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహంలో భాగంగా తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2.75 లక్షల ఎకరాల భూమిలో 20,000కు పైగా ఎకరాల భూమి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా అందుబాటులో ఉంది.[5]

మూలాలుసవరించు

  1. APIIC-Bifurcation[permanent dead link]
  2. TS to roll out new industrial policy in a week
  3. Single-window nod for projects on cards in Telangana
  4. http://www.icewire.blogspot.in/2014/08/clouds-of-uncertainty-vanishing-from.html
  5. సాక్షి. "నూతన పారిశ్రామిక విధానం". Retrieved 7 February 2017. Cite news requires |newspaper= (help)