టీఎస్ ఐపాస్‌ (తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం)ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది.

టీఎస్ ఐపాస్‌
Make in telangana Logo.jpg
మేక్ ఇన్ తెలంగాణ లోగో
తేదీజూన్ 12, 2015
ప్రదేశంతెలంగాణ, భారతదేశం
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం
పాలుపంచుకున్నవారుప్రపంచవ్యాప్త వ్యాపార సంస్థలు
వెబ్‌సైటుటీఎస్ ఐపాస్‌ అధికారిక వెబ్ సైట్
తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

ప్రారంభంసవరించు

తెలంగాణ పారిశ్రామిక విధానం-2015 (టీఎస్ ఐపాస్) ను 2015, జూన్ 12న హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామిక దిగ్గజాలు, ప్రముఖులు హాజరైన సదస్సులో మేక్ ఇన్ తెలంగాణ పేరిట రూపొందించిన ప్రత్యేక లోగో, ఇన్ఫోసిస్ సహకారంతో అభివృద్ధి చేసిన టీఎస్ ఐపాస్ వెబ్‌సైట్‌ తోపాటు సోలార్ పవర్ పాలసీని కూడా ఆవిష్కరించారు.[1]

ఈ కార్య‌క్ర‌మానికి 2,500 మంది పారిశ్రామిక వేత్త‌లు, టాప్ 250 కంపెనీల ప్ర‌తినిధులు, అమెరికా, బ్రిటన్, టర్కీ, మలేషియాకు చెందిన రాయబారులు, బ్యాకర్లు, బీహెచ్‌ఈఎల్, మిథాని, బీడీఎల్, ఆర్థిక సంస్థల ప్రతినిధులు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏవీ ప్ర‌జెంటేష‌న్ ద్వారా హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌త్యేక‌త‌లు, మేక్ ఇన్ తెలంగాణ వంటి త‌దిత‌ర అంశాల‌ను వ‌చ్చిన అతిధుల‌కు వివ‌రించారు.

పరిశ్రమల ఏర్పాటు విధానంసవరించు

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో పరిశ్రమలకు వందశాతం కరప్షన్‌ ఫ్రీతో అనుమతులు ఇస్తారు. దీనికోసం టీఎస్ ఐపాస్ రూపకల్పనలో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం 1.60 లక్షల ఎకరాల భూమిని సిద్ధం చేసి, పరిశ్రమలకు భూమి, నీరు, విద్యుత్‌ను ప్రభుత్వమే సమకూర్చుతుంది. పరిశ్రమల ఏర్పాటుకు ఆన్‌ లైన్‌ లోనే దరఖాస్తులు స్వీకరించి, సీఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఛేజింగ్‌ సెల్ ద్వారా పరిశ్రమలకు అనుమతులపై మానిటరింగ్ నిర్వహించి, అనుమతుల కోసం కాలయాపన లేకుండా ప్లగ్ అండ్ ప్లే పద్ధతిన పారిశ్రామిక వాడల ఏర్పాటుచేసి, అయా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతినిస్తారు.[2]

నూతన పారిశ్రామిక విధానంలో ముఖ్యాంశాలుసవరించు

  • పరిశ్రమల ఏర్పాటుకు లక్ష 60వేల ఎకరాల భూమి ఏర్పాటు
  • పరిశ్రమల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి నియామకం
  • అన్ని పరిశ్రమలకు 24 గంటల విద్యుత్‌ సరఫరా
  • పరిశ్రమల ఏర్ఫాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, రెండు వారాల్లోగా అనుమతుల జారీ
  • ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఛేజింగ్‌ సెల్‌
  • భూమి, నీరు, విద్యుత్‌, రహదారుల లాంటి మౌలిక సదుపాయాలతో రాష్టవ్య్రాప్తంగా విస్తరించిన 6 పారిశ్రామిక వాడలు, 28 సెజ్‌లు
  • తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ సఫ్లై ప్రాక్టుల నుంచి పరిశ్రమలకు 10శాతం నీటిని సరఫరా చేయడం [2]

ఫలితాలుసవరించు

టీఎస్ ఐపాస్‌ ప్రారంభించిన 15 నెలల కాలంలో రాష్ట్రానికి 44,539 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న ఈ విధానం కింద ఎనిమిది విడతల్లో 2533 పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులనిచ్చింది. ఈ పరిశ్రమ 1.60 లక్షల మందికి ఉపాధి లభించనుంది.[3]

మూలాలుసవరించు

  1. సాక్షి. "తెలంగాణ పారిశ్రామిక విధానం-2015 ఆవిష్కరణ". Retrieved 21 December 2016.
  2. 2.0 2.1 సూర్య. "అవినీతి రహిత పాలన". Retrieved 21 December 2016.[permanent dead link]
  3. నమస్తే తెలంగాణ, TELANGANA NEWS. "టీఎస్ ఐపాస్ సరికొత్త రికార్డు." Retrieved 21 December 2016.