తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ

తెలంగాణ ప్రభుత్వ సంస్థ

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ (తెలంగాణ ఆగ్రోస్) అనేది తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన సంస్థ.[1] నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు, ఇతరాలు రైతులకు అందుబాటులో ఉండేందుకు ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1500 వరకు రైతు సేవాకేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులు వ్యవసాయ సామాగ్రిని ఈ కేంద్రాలలో కొనుగోలు చేయవచ్చు.[2]

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ లోగో
ప్రభుత్వ సంస్థ అవలోకనం
స్థాపనం 15 ఏప్రిల్ 2015; 9 సంవత్సరాల క్రితం (2015-04-15)
అధికార పరిధి తెలంగాణ
ప్రధాన కార్యాలయం హైదరాబాదు
Minister responsible సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, (వ్యవసాయ శాఖామంత్రి)
మాతృ శాఖ తెలంగాణ వ్యవసాయ శాఖ
వెబ్‌సైటు
అధికారిక వెబ్ సైట్

ప్రారంభం

మార్చు

2015 ఏప్రిల్ 15న ఈ సంస్థ స్థాపించబడింది. ఇది పశువైద్య కార్యకలాపాలు మినహా వ్యవసాయ, పశుసంవర్ధక సేవా కార్యకలాపాలలో పాలుపంచుకుంది.[3]

సేవలు

మార్చు
  • వన్‌ స్టాప్‌ – షాప్‌ సేవలు: వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, పప్పుధాన్యాలు, ఇతర పంటల విత్తనాలు, ట్రాక్టర్లు, హర్వెస్టర్లు, ప్లాంటర్లు, ఇతర భూసార పరీక్షల సేవలు సైతం అందించేందుకు రైతులకు అవసరమైన శిక్షణ కూడా ఇప్పించేందుకు వన్‌ స్టాప్‌ – షాప్‌ సేవలు అనే కార్యక్రమాన్ని రూపొందించింది.[4]
  • డ్రోన్ల సరఫరా: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆగ్రోస్ సేవా కేంద్రాల ద్వారా వ్యవసాయ రంగంలో అనేక సేవలందిస్తున్న ఈ సంస్థ రైతులకు డ్రోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. కూలీల రోజువారి కూలీ విపరీతంగా పెరగడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతులకు సహకారం అందించడంలో భాగంగా పంటలకు ఎరువులు, విత్తనాలు చల్లేందుకు రైతులకు డ్రోన్లను ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు కిరాయికి ఇవ్వనున్నారు. ఈ విషయమై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌తో ఆగ్రోస్‌ ఒప్పందం కూడా చేసుకుంది.[5]
  • తెలంగాణ సిరి సిటీ కంపోస్టు: పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవుల శాతాన్ని, కర్బన శాతాన్ని పెంచే లక్ష్యంతో ‘తెలంగాణ సిరి’ పేరుతో మేలైన సేంద్రియ ఎరువును అందుబాటులోకి తెచ్చింది. దీనిని 2020 సెప్టెంబరు 7న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించాడు. హైదరాబాద్‌ నగరంలో సేకరించిన చెత్తతో ఉత్పత్తి చేసిన ఈ సిటీ కంపోస్టు ఎరువును చాలా తక్కువ ధరకు (50 కిలోల బస్తా రూ.275) పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రాంకీ, భవానీ బయో కంపెనీలతో ఆగ్రోస్‌ ఒప్పందం చేసుకుంది.[6]
  • మిల్లెట్‌ వ్యాపారం: మారుతున్న ఆహారపు అలవాట్లు, చిరు ధాన్యాల వినియోగంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో తెలంగాణ ఆగ్రోస్ మిల్లెట్‌ వ్యాపారరంగంలోకి అడుగుపెట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా ‘మిల్లెట్‌ స్టాల్స్‌’ను ఏర్పాటుచేసి నాణ్యమైన చిరుధాన్యాలను సాధారణ ధరలకు అందించనుంది. ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషియన్‌ కోర్సు పూర్తి చేసిన యువతులకు ఈ స్టాల్స్‌ను కేటాయించనున్నారు.[7]

చైర్మన్లు

మార్చు

మూలాలు

మార్చు
  1. "రైతులకు శుభవార్త త్వరలోనే అందుబాటులోకి వన్ స్టాప్ షాప్ సేవలు". ETV Bharat News. 2023-01-09. Retrieved 2023-03-20.
  2. India, The Hans (2021-05-12). "Telangana Agros to rope in agri grads to man ARSKs". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-05-11. Retrieved 2023-03-20.
  3. "Telangana State Agro Industries Development Corporation Limited". The Economic Times (in ఇంగ్లీష్). Archived from the original on 2023-03-20. Retrieved 2023-03-20.
  4. "అన్న‌దాత అవ‌స‌రాల వేదిక - వ‌న్ స్టాప్…వ‌న్ నేష‌న్". Prabha News. 2023-01-10. Archived from the original on 2023-01-10. Retrieved 2023-03-20.
  5. Telugu, 10TV; Ramakrishna, Guntupalli (2023-03-19). "AGRICULTURAL DRONES : రైతులకు అద్దెకు డ్రోన్లు....తెలంగాణా ఆగ్రోస్ విన్నూత్న సేవలు". 10TV Telugu. Archived from the original on 2023-03-20. Retrieved 2023-03-20.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Correspondent, Special (2020-09-07). "TS-Agros launches Telangana Siri brand of organic fertilizer". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2020-09-15. Retrieved 2023-03-20.
  7. telugu, NT News (2023-01-13). "ఇక 'ఆగ్రోస్‌' చిరుధాన్యాలు". www.ntnews.com. Archived from the original on 2023-01-13. Retrieved 2023-03-20.