తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖ

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖ. రైతులకు వ్యవసాయ విస్తరణ సేవలను, తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి ఈ శాఖ ఉపయోగపడుతుంది.[1] ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం 2014, జూన్ 2న ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ నుండి విడిపోయింది.[2][3]

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ
సంస్థ వివరాలు
స్థాపన 2014 జూన్ 2 (2014-06-02) (9 సంవత్సరాల క్రితం)
Preceding agency వ్యవసాయ విభాగం
అధికార పరిధి తెలంగాణ ప్రభుత్వం
ప్రధానకార్యాలయం ఎల్.బి. స్టేడియం ఎదురుగా, బషీర్‌బాగ్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
17°36′6″N 78°47′6″E / 17.60167°N 78.78500°E / 17.60167; 78.78500
సంబంధిత మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, వ్యవసాయ శాఖామంత్రి
కార్యనిర్వాహకులు సి. పార్థసారథి, (ఏపీసి & ప్రిన్సిపల్ సెక్రటరీ, వ్యవసాయ శాఖ)
రాహుల్ బొజ్జ, (కమీషనర్, వ్యవసాయ శాఖ)

చరిత్ర సవరించు

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది ప్రజలు వ్యవసాయాన్ని వృత్తిగా తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోడు వ్యవస్థను కూడా ఉపయోగిస్తారు. వ్యవసాయ శాఖలో క్షేత్ర స్థాయిలో, రాష్ట్రస్థాయిలో, శిక్షణా సంస్థలలో, ప్రయోగశాలలో దాదాపు 3900మంది సిబ్బంది పనిచేస్తున్నారు.

లక్ష్యం సవరించు

  1. తెలంగాణలో వ్యవసాయ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూ ఆహార ధాన్యాల విస్తీర్ణం, ఉత్పత్తి పెంచడం
  2. ఆహార ధాన్యాల పంటల అధిక ఉత్పత్తితో రైతుల ఆదాయాన్ని పెంచడం

సహాయ కార్యక్రమాలు సవరించు

  1. గ్రామ విత్తన పధకం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ ఋణసదుపాయం, పంటల భీమా అమలుచేయడం
  2. శాస్త్రవేత్తలతో శిక్షణా శిబిరాలు, అవగాహనా సదస్సులు నిర్వహించడం

పథకాలు సవరించు

  1. వ్యవసాయ యాంత్రీకరణ
  2. వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం 2018 (రైతుబంధు పథకం)
  3. వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం
  4. రైతు బంధు జీవిత భీమా పథకం
  5. రాష్ట్ర విత్తన క్షేత్రాలు
  6. రైతులకు విత్తన సరఫరా

కాల్‌సెంటర్‌ ఏర్పాటు సవరించు

వ్యవసాయ శాఖ నుండి రైతులకు అందుతున్న సేవల గురించి, రైతుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌లోని రైతుబంధు సమితి కార్యాలయంలో ఏర్పాటుచేసిన కాల్‌సెంటర్‌ను 2022 జూన్ 22న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్‌. రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్‌ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

కాల్‌సెంటర్‌ నుండి రాష్ట్రంలోని రైతులతో మాట్లాడి రైతుబంధు, రైతుబీమా పథకాల గురించి, పంటల వైవిధ్యీకరణపై రైతులకున్న సమస్యలు పరిష్కరించనున్నారు. వ్యవసాయశాఖ వద్దనున్న 63 లక్షల మంది రైతుల ఫోన్‌ నంబర్లలో ఎంపికచేసిన రైతులతో కాల్‌ సెంటర్‌ సిబ్బంది ప్రతిరోజూ మాట్లాడుతుంటారు.[4]

బడ్జెట్ వివరాలు సవరించు

  • 2016-17 బడ్జెటులో వ్యవసాయ శాఖకు 25 వేల కోట్ల రూపాయలు కేటాయించబడింది.

మూలాలు సవరించు

  1. "Official Website". TGovernment of Telangana. Archived from the original on 22 July 2019. Retrieved 22 July 2019.
  2. "Notification" (PDF). The Gazette of India. Government of India. 4 March 2014. Archived from the original (PDF) on 27 March 2014. Retrieved 22 July 2019.
  3. "E-split: Telangana govt, depts to have new web Ids". The Hindu. 1 June 2014. Retrieved 22 July 2019.
  4. telugu, NT News (2022-06-23). "రైతుల కోసం కాల్‌సెంటర్‌". Namasthe Telangana. Archived from the original on 2022-06-23. Retrieved 2022-06-23.