సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, వనపర్తి శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1]

సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి


తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి
పదవీ కాలం
19 ఫిబ్రవరి 2019 - 03 డిసెంబర్ 2023
నియోజకవర్గం వనపర్తి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1958 అక్టోబర్ 4
పాన్‌గల్
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి సింగిరెడ్డి వాసంతి
సంతానం డాక్టర్ ప్రత్యూష, అమృత వర్షిణి, తేజస్విని
నివాసం వనపర్తి
మతం హిందూ మతము

జననం, విధ్యాబ్యాసం

మార్చు

సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి 1958 అక్టోబర్‌ 04 వ తేదీన తారకమ్మ, రాంరెడ్డి దంపతులకు జన్మించాడు.ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ ఎల్ బీ పూర్తి చేశాడు. అనంతరం లాయర్ గా ప్రాక్టీస్ చేశాడు.

రాజకీయ ప్రస్థానం

మార్చు

సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలుగుదేశంపార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాదీబోర్డు చైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2001లో రాష్ట్ర సాధన కోసం స్థాపించిన టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాడు.[2] మహబూబ్‌నగర్‌ లో దశాబ్దకాలం పాటు ఒంటిచేత్తో టీఆర్‌ఎస్‌ను నడిపించాడు. ఉమ్మడి పాలమూరు జిల్లా బతుకుచిత్రాన్ని తెలంగాణ ఉద్యమంలో బట్టబయలు చేసిన నాయకుడిగా నిరంజన్‌ రెడ్డి గుర్తింపు పొందాడు. 2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 4291 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

2014లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి గా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు బాధ్యతలు అప్పగించాడు. తెలంగాణ ఉద్యమంలో పాలమూరు సమస్యలపై స్పష్టమయిన అవగాహన ఉన్న నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 25 టీఎంసీలు ఉన్న నీటి కేటాయింపును 40 టీఎంసీలకు పెంపుదల చేయించి జీఓ విడుదలయ్యేలా కృషిచేశారు. 11 నెలలలో ఖిల్లాఘణపురం కాలువను, 40 రోజులలో పెద్దమందడి కాలువను తవ్వించి సాగునీరు తీసుకువచ్చారు. వనపర్తి నియోజకవర్గంలో 70 వేల ఎకరాలకు సాగునీరు అందించిన తరువాతనే ఎన్నికలలో నామినేషన్ వేస్తానని ప్రకటించి ఇచ్చినమాట నిలబెట్టకుని ఎన్నికలలో పోటీకి నిలబడ్డారు. గత నాలుగేళ్లుగా కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా ఖిల్లాఘణపురం, పెద్దమందడి, వనపర్తి , గోపాల్ పేట, రేవల్లి మండలాలు, భీమా ద్వారా వనపర్తిలో కొంతభాగం, శ్రీరంగాపురం మండలాలు సస్యశ్యామలం అవుతున్నాయంటే దానికి కారణం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

 
సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిధిగా హాజరై జ్ఞాపికను అందుకుంటూ

2018 ముందస్తు ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి గా నిరంజన్ రెడ్డి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి పై 51,783 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.[3][4]

2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో వ్యవసాయ, సహకార, ఆహార & పౌర సరఫరా శాఖల మంత్రిగా ఉన్నాడు.[5][6][7][8] ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వనపర్తి నుండి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి[9] 25320 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[10]

కరోనా

మార్చు
  1. వనపర్తి జిల్లా ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డును సందర్శించిన మంత్రి నిరంజన్‌రెడ్డి[11][12]

మూలాలు

మార్చు
  1. Eenadu (14 November 2023). "ఎన్నికల బరిలో కోటీశ్వరులు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  2. Sakshi (4 December 2018). "ఓటర్లకు గాలం.. లాబీయింగ్‌ షురూ." Archived from the original on 28 December 2021. Retrieved 28 December 2021.
  3. "Singi Reddy Niranjan Reddy(TRS):Constituency- WANAPARTHY(WANAPARTHY) - Affidavit Information of Candidate".
  4. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (11 December 2018). "వనపర్తిలో నీళ్ల నిరంజన్ రెడ్డి గెలుపు". www.ntnews.com. Archived from the original on 12 September 2019. Retrieved 12 September 2019.
  5. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  6. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  7. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  8. Sakshi (19 February 2019). "ఉత్కంఠ వీడింది!". Sakshi. Archived from the original on 28 May 2021. Retrieved 28 May 2021.
  9. Namasthe Telangana (22 August 2023). "సమరానికి సై". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  10. BBC News తెలుగు (3 December 2023). "ఓటమి పాలైన మంత్రులు ఎవరు? ఎంత తేడాతో ఓడిపోయారు?". Archived from the original on 6 December 2023. Retrieved 6 December 2023.
  11. Namasthe Telangana (24 May 2021). "మనోధైర్యమే మందు". Namasthe Telangana. Archived from the original on 25 May 2021. Retrieved 25 May 2021.
  12. Andhrajyothy (24 May 2021). "ధైర్యంతోనే కొవిడ్‌ను జయించొచ్చు". www.andhrajyothy.com. Archived from the original on 25 May 2021. Retrieved 25 May 2021.

బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.