తెలంగాణ విశ్వవిద్యాలయం

తెలంగాణ విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రం నిజామాబాదు జిల్లా, డిచ్‌పల్లి వద్ద 2006వ సంవత్సరంలో ఏర్పాటుచేసిన విశ్వవిద్యాలయం.[1][2][3] 6 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులతో ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 18 కోర్సులు నిర్వహించబడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాదు, ఆదిలాబాదు జిల్లాల పరిధిలోని ఉన్నత విద్య సంస్థల కార్యకలాపాలు నిర్వహిస్తుంది.[4]

తెలంగాణ విశ్వవిద్యాలయం
Telangana University.jpg
రకంప్రభుత్వ
స్థాపితం2006
ఛాన్సలర్తెలంగాణ రాష్ట్ర గవర్నర్
స్థానండిచ్‌పల్లి, నిజామాబాదు జిల్లా, భారతదేశం, తెలంగాణ, భారతదేశం
జాలగూడుఅధికారిక జాలగూడు

ప్రారంభంసవరించు

నిజామాబాదు, ఆదిలాబాదు జిల్లాలలోని గ్రామీణ విద్యార్థులకోసం రాష్ట్ర ప్రభుత్వ 2006 చట్టం 28 ద్వారా తెలంగాణ విశ్వవిద్యాలయం స్థాపించి, డిచ్‌పల్లి మండలంలోని సుద్దపల్లి, నడిపల్లి గ్రామాల్లోని 577 ఎకరాల భూమిని విశ్వవిద్యాలయానికి అప్పగించింది.

యూనివర్సిటీ గ్రాంటు కమీషన్ (యు.జి.సి) చట్టం లోని సెక్షన్ 2 (బి), 2 (ఎఫ్) కింద ఈ విశ్వవిద్యాలయాన్ని గుర్తించింది. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల తరువాత ఇది తెలంగాణ రాష్ట్రంలో 3వ అతిపెద్ద ప్రభుత్వ విశ్వవిద్యాలయం.[5]

క్యాంపస్ వివరాలుసవరించు

2006, సెప్టెంబరులో 6 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశపెట్టగా... 2007-2008లో 7 కోర్సులు, 2008 లో 5 కోర్సులు చేర్చబడి మొత్తం కోర్సుల సంఖ్య 18కి చేరాయి. 2008 వరకు నిజామాబాదులోని గిర్రాజ్ ప్రభుత్వ కళాశాల (అటానమస్) లో ఉన్న విశ్వవిద్యాలయం 2009లో డిచ్‌పల్లిలోని సొంత క్యాంపస్‌కు మార్చబడింది.

577 ఎకరాల (2.4 కి.మీ.) విస్తీర్ణంలో ఈ విశ్వవిద్యాలయం ప్రాంగణం ఉంది. ఈ ప్రాగణంలో ఏడు భవనాలు (పరిపాలనా భవనం, విశ్వవిద్యాలయ కళాశాల, న్యాయ కళాశాల, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్, రెండు వసతి గృహాలు) ఉన్నాయి.

భిక్నూర్ దక్షిణ క్యాంపస్‌సవరించు

భిక్నూర్ ప్రాణంగం సుమారు 50 ఎకరాలు విస్తీర్ణంలో ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ ఉన్న భిక్నూర్ పిజి సెంటర్‌ను 2010లో తెలంగాణ విశ్వవిద్యాలయంకు అప్పగించబడింది. దాంతో దీనిని తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్-క్యాంపస్ గా మార్చారు.

ఇతర వివరాలుసవరించు

  1. ఈ విశ్వవిద్యాలయం భారత విశ్వవిద్యాలయ సంఘంలో సభ్యత్వం పొందింది.
  2. హరితహారంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటడం కార్యక్రమం జరిగింది.

మూలాలుసవరించు

  1. "Foundation stone laid for Telangana University". Hindustan Times (New Delhi, India) – via HighBeam (subscription required). 29 July 2014. Archived from the original on 24 September 2015. Retrieved 4 June 2020.
  2. "Reports on Aspergillus Findings from Telangana University Provide New Insights". Biotech Week – via HighBeam (subscription required). 29 July 2014. Retrieved 4 June 2020.[dead link]
  3. Telangana University at Nizamabad
  4. http://www.hindu.com/2006/03/05/stories/2006030506250400.htm
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-05. Retrieved 2020-06-05.

బయటి లింకులుసవరించు