నిజామాబాదు

తెలంగాణ, నిజామాబాదు జిల్లాలోని నగరం

నిజామాబాదు తెలంగాణలోని ఒక నగరం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నిజామాబాదు జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[3] రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన మూడవ అతిపెద్ద నగరమైన నిజామాబాదు పురపాలక సంస్థ చేత పాలించబడుతోంది. ఇది నిజామాబాదు జిల్లా ప్రధాన నగరం.[4] గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో, తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైనప్పటికీ, నిజామాబాదు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ద్వారా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో భాగమైంది.

నిజామాబాదు
నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రి, నిజామాబాదు రైల్వే స్టేషను, జిల్లా కోర్టు, నిజామాబాదు కోట
Nickname: 
నిజాంల నగరం
నిజామాబాదు is located in Telangana
నిజామాబాదు
నిజామాబాదు
నిజామాబాదు is located in India
నిజామాబాదు
నిజామాబాదు
Coordinates: 18°40′19″N 78°05′38″E / 18.672°N 78.094°E / 18.672; 78.094
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ప్రాంతందక్కన్ పీఠభూమి
జిల్లానిజామాబాదు జిల్లా
స్థాపితం1905
పురపాలక1931
కార్పోరేషన్2005
Named forనిజాం
Government
 • Typeపురపాలక సంఘం
 • Bodyనిజామాబాదు నగరపాలక సంస్థ
 • మేయర్శ్రీమతి నీతు కిరణ్ (తెలంగాణ రాష్ట్ర సమితి)
విస్తీర్ణం
 • నగరం42.9 కి.మీ2 (16.6 చ. మై)
 • నిజామాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ169.37 కి.మీ2 (65.39 చ. మై)
Elevation
395 మీ (1,296 అ.)
జనాభా
 (2011)[2]
 • నగరం3,11,152
 • Rankరాష్ట్రంలో మూడవ స్థానం
Demonymనిజామాబాది
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC5:30 (భారతదేశ కాలమానం)
పిన్ కోడ్
503 001, 002, 003, 186, 230
టెలిపోన్ కోడ్91-846-
Vehicle registrationటిస్ 16/ఏపి 25
స్త్రీ, పురుష నిష్పత్తి1001/1000 /
అక్షరాస్యత80.31%
లోక్‌సభనిజామాబాదు
శాసనసభనిజాబామాదు
నిజామాబాదు
ప్రణాళిక సంస్థనిజామాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ

పేరు చరిత్ర

మార్చు

ఉర్దూ భాషలో నిజాం అంటే హైదరాబాద్ నిజాం అని, ఆబాద్ అంటే నగరం అని అర్థం. కొన్నిసార్లు ఈ ప్రాంతాన్ని "నిజాం రాజు నగరం" అని కూడా పిలుస్తారు.

చరిత్ర

మార్చు

నిజామాబాదు 1905 సంవత్సరంలో స్థాపించబడింది.[5] దీనిని ఇందూరు అని పిలుస్తారు.[6][7] 18వ శతాబ్దంలో నిజాం రాజవంశం ఈ దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించింది.

1724లో నిజామాబాదు హైదరాబాద్ రాజ్యంలో ఒక భాగంగా ఉంటూ, 1948 వరకు నిజాం ఆధిపత్యంలో భాగంగా కొనసాగింది.[8] 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, భారత సాయుధ దళాలు హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకుని, ఆపరేషన్ పోలోలో నిజాం పాలనను ముగించాయి.[9] 1876లో నిజామాబాదు ప్రత్యేక జిల్లాగా మారింది, హైదరాబాద్ రాష్ట్రంలోని జిల్లాలను అప్పటి ప్రధానమంత్రి సాలార్ జంగ్ -1 పునర్వ్యవస్థీకరించారు. 1905లో సికింద్రాబాదు, మన్మాడ్ మధ్య రైల్వేలైన్ వేయబడింది.[10] ఈ నగరానికి హైదరాబాద్ రాష్ట్రంలోని నాల్గవ నిజాం నిజాం ఉల్ ముల్క్ పేరు పెట్టారు. చివరి నిజాం పాలనలో, నిజాం సాగర్ ఆనకట్టను 1923లో మంజీరా నది మీదుగా అచ్చంపేట గ్రామంలో నిర్మించారు. ఇందులో 250,000 ఎకరం (1,000 కి.మీ2; 390 చ. మై.) నిజామాబాదు జిల్లాకు చెందినవి.[11]

భౌగోళికం

మార్చు

నిజామాబాదు 18°41′N 78°6′E / 18.683°N 78.100°E / 18.683; 78.100 వద్ద ఉంది.[12] ఈ నగరానికి ఉత్తరాన నిర్మల్, తూర్పున జగిత్యాల, కరీంనగర్, దక్షిణాన కామారెడ్డి, పశ్చిమాన మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన నాందేడ్ సరిహద్దులు ఉన్నాయి.

ఈ నగరం 3 మండలాలతో ఉంది. నిజామాబాద్ సౌత్ మండలం, నిజామాబాద్ నార్త్ మండలం మండలాలు నిజామాబాదు (పట్టణ) శాసనసభ నియోజకవర్గంలో, నిజామాబాద్ గ్రామీణ మండలం నిజామాబాదు (గ్రామీణ) శాసనసభ నియోజకవర్గంలో ఉన్నాయి.[13][14] నిజామాబాదు నగరపాలక సంస్థ పరిధిలో 42.9 చదరపు కిలోమీటర్లు (16.6 చ. మై.) వైశాల్యం ఉంది. నిజామాబాదు పట్టణంలో నిజామాబాదు ఉత్తర, దక్షిణ మండల శివారు ప్రాంతాలు ఉన్నాయి.

ఇక్కడ గాంధీ చౌక్ ప్రాంతం ఉంది.

జనాభా

మార్చు
నిజామాబాదు పట్టణ జనాభా 
CensusPop.
190112,871
191117,35334.8%
192115,672-9.7%
193118,80920.0%
194132,74174.1%
195155,19568.6%
196179,09343.3%
19711,15,64046.2%
19811,83,06158.3%
19912,41,03431.7%
20012,88,72219.8%
20113,11,1527.8%
Sources:[15]


2011 భారత జనాభా లెక్కల ప్రకారం నిజామాబాదు జనాభా 311,152. జనాభాలో పురుషులు 49 శాతం, ఆడవారు 51 శాతం ఉన్నారు. నిజామాబాదు సగటు అక్షరాస్యత 78.52 శాతం, జాతీయ సగటు 74.04 శాతం కంటే ఎక్కువ; పురుషుల అక్షరాస్యత 85.11 శాతం, స్త్రీ అక్షరాస్యత 72.02. నిజామాబాదులో 13 శాతం జనాభా ఆరేళ్ల లోపు వారు నగరంలో మాట్లాడే ప్రధాన భాషలు తెలుగు (53.8%), ఉర్దూ (37.6%) అధికారిక భాషలు. మరాఠీ జనాభాలో దాదాపు 4.2% మంది మాట్లాడుతున్నారు.[16]

నిజామాబాదులోని మతాలు[17]
మతం శాతం
హిందువులు
  
59.77%
ముస్లింలు
  
38.01%
క్రైస్తవులు
  
0%
ఇతరులు†
  
1.09%
Includes సిక్కులు, జైనులు

పరిపాలన

మార్చు

నిజామాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (నుడా)

మార్చు

నిజామాబాదు నగరపాలక సంస్థను ఆరు మండలాల్లో ఉన్న 60 గ్రామాలను అభివృద్ధి చేయడానికి నిజామాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (నుడా)ఏర్పాటుకు 2017లో తెలంగాణ ప్రభుత్వం జివో విడుదల చేసింది.[18] ఈ నుడా 169.37 చదరపు కిలోమీటర్లు (65.39 చ. మై.) భౌగోళిక విస్తీర్ణంతో 169.37 చదరపు కిలోమీటర్లు (65.39 చ. మై.)[18][19] లోని నగరం ఉత్తర, దక్షిణ, గ్రామీణ మండలాల్లో వ్యాపించి, దాని అధికార పరిధిలోని 633,933 [20][21] నివాసితుల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రణాళికను చూస్తుంది.

నిజామాబాదు నగరపాలక సంస్థ

మార్చు

నిజామాబాదు నగరపాలక సంస్థ నిజామాబాదు నగరపాలక మండలి, ఈ మండలిలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన సభ్యులు ఉంటారు. నగర మేయర్ నేతృత్వంలో నగర మౌలిక సదుపాయాలు, పౌర పరిపాలన, నీటి సరఫరాను ఈ సంస్థ నిర్వహిస్తుంది. నిజామాబాదు మునిసిపాలిటీ 1931 సంవత్సరంలో ఏర్పడింది. 1987లో స్పెషల్ గ్రేడ్ మునిసిపాలిటీగా, జివో నం: 109 అనుసరించి 2005 మార్చి 5న కార్పోరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయబడింది. పౌరసంఘం అధికార పరిధి 42.9 కి.మీ2 (16.6 చ. మై.) విస్తీర్ణంతో, 60 మునిసిపల్ వార్డులను కలిగి ఉంది.[22]

ఇ-గవర్నెన్స్ సేవలు

మార్చు

ప్రజలకు సౌకర్యాలు కల్పించడం కోసం తెలంగాణా ప్రభుత్వం నగరాలు, రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ[23] (మీ సేవ వద్ద) కేంద్రాలను ప్రారంభించింది. ప్రజా సేవలను ప్రజల వద్దకే తీసుకుపోవడం ఈ సౌకర్యాలు ముఖ్య ఉద్దేశ్యం. ఆదాయ ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ పత్రాలు, ల్యాండ్ రికార్డ్స్, ఇతర రిజిస్ట్రేషన్ రికార్డులు వంటి ఆన్‌లైన్ సంతకం చేసిన డిజిటల్ ధృవపత్రాలను మీసేవా అందిస్తుంది. ఈ రికార్డులు డేటాబేస్ కోసం ఆన్‌లైన్‌లో నిల్వ చేయబడతాయి.[24] హైదరాబాదుతోపాటు నిజామాబాదు తమ సొంత పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను కలిగి ఉన్న జిల్లాలు,[25] ఈ కార్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాల అవసరాన్ని తెలియజేస్తాయి.[26][27]

శాంతిభద్రతలు

మార్చు
 
నిజామాబాద్ సిటీ పోలీస్ వాహనం

నిజామాబాదు పోలీసు కమిషనరేట్ నగరానికి స్థానిక చట్ట అమలు సంస్థకు పోలీసు కమీషనర్ నేతృత్వం వహిస్తుంది. 1847లో హైదరాబాద్ రాష్ట్రంలో ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏర్పడింది. వివిధ ట్రాఫిక్ జంక్షన్లలో 72 సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి.[28] మౌలిక సదుపాయాలలో ఇంటర్‌సెప్టర్ వెహికల్స్, ఆన్‌లైన్ ప్రెజెన్స్, మహీంద్రా బొలెరో వాహనాలు ఉన్నాయి. క్రైమ్ బ్రాంచ్ కాకుండా, పోలీసులకు ట్రాఫిక్ బ్రాంచ్, షీ టీం బృందాలు, బ్లూ కోల్ట్స్, మొబైల్ పెట్రోలింగ్ వాహనాలు కూడా ఉన్నాయి.

ఆరోగ్య సంరక్షణ

మార్చు

రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరంగా, నిజామాబాదు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వైద్య సంరక్షణకు పేరొందింది. నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకటిగా ఉంటూ నగరాలు, పొరుగు జిల్లాలైన నాందేడ్, ఆదిలాబాద్ ప్రాంతాల రోగులకు సేవలు అందిస్తుంది.[29] డాక్టర్స్ లేన్ అని కూడా పిలువబడే ఖలీల్వాడి ప్రాంతంలో 200 కంటే ఎక్కువ ప్రధాన ప్రైవేట్ ఆసుపత్రులు,[30] అనేక ప్రయోగశాలు ఉన్నాయి. మెరుగైన మౌలిక సదుపాయాలు, వనరులతో కూడిన నిజామాబాదు నిజామాబాదు ప్రభుత్వ వైద్య కళాశాల 2012లో స్థాపించబడింది. ప్రసూతి సంరక్షణ కోసం ప్రత్యేక ఆసుపత్రులు, ఛాతీ ఆస్పత్రులు, మేఘనా హాస్పిటల్ ఫర్ డెంటల్ కేర్, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాయి. నగరంలోని ఈ మల్టీ-స్పెషాలిటీ ఆస్పత్రులే కాకుండా, ప్రగతి ఆసుపత్రి పొరుగు జిల్లాలలో ఉన్న ఏకైక ఆసుపత్రులలో ఒకటి, ఇది ఇటీవల గుండె మార్పిడి విభాగాన్ని ఏర్పాటు చేసింది.

కలక్టరేట్ భవన ప్రారంభం

మార్చు

ఈ గ్రామంలోని 25 ఎక‌రాల విస్తీర్ణంలో 53.52 కోట్ల రూపాయలతో 1,59,306 చదరపు అడుగుల విస్తీర్ణంలో జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. 2022, సెప్టెంబరు 5న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్‌ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు. కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అనంతరం కలెక్టర్‌ చాంబర్‌లోని సీట్‌లో కలెక్టర్‌ సీ నారాయణరెడ్డిని కూర్చోబెట్టి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కార్యక్ర‌మంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా, బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎంవో అధికారి స్మితా సబర్వాల్‌, కలెక్టర్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[31][32]

రవాణా

మార్చు

రహదారులు

మార్చు

నగరం వివిధ జాతీయ, రాష్ట్ర రహదారుల ద్వారా ప్రధాన గమ్యస్థానాలకు కలిసివుంది. ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలిపే ప్రధాన జాతీయ రహదారైన జాతీయ రహదారి 44 ఈ నగరం మీదుగా పోతుంది.[33] 460 కి.మీ. (290 మై.) పొడవైన జాతీయ రహదారి 63, నిజామాబాదు వద్ద ప్రారంభమై ఛత్తీస్‌గఢ్ లోని జగదల్‌పుర్ వద్ద ముగుస్తుంది.[34],[35] 387 కి.మీ. (240 మై.), 385 కి.మీ. (239 మై.) అపరిమితమైన రహదారులతో నగర కార్పోరేషన్ మొత్తం 772 కి.మీ. (480 మై.) పొడవు గల రహదారులను నిర్వహిస్తుంది.[36] తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నగరంలోని నిజామాబాదు బస్ స్టేషన్ నుండి వివిధ గమ్యస్థానాలకు బస్సులను నడుపుతుంది.[37] నగరంలో బస్సుల రాకపోకల కోసం 2 బస్ డిపోలు ఉన్నాయి.[38]

రైల్వేలు

మార్చు

నిజామాబాద్ జంక్షన్ దక్షిణ మధ్య రైల్వే విబాగం హైదరాబాద్ రైల్వే డివిజన్ క్రింద నిర్వహించబడుతుంది. నిజామాబాద్-పెద్దపల్లి విభాగానికి, కాచిగూడ-మన్మాడ్ విభాగంతో జంకంపేట-బోధన్ లైన్ కి కన్వర్జెన్స్ స్టేషన్ గా ఉంది.

ఈ నిజామాబాద్-పెద్దపల్లి విభాగం నిజామాబాద్‌ను ఢిల్లీ-చెన్నై రైలు మార్గము గ్రాండ్ ట్రంక్ మార్గంతో కలుపుతుంది, దీంతో నిజామాబాదు నుండి కరీంనగర్, వరంగల్‌కు దూరం చాలా వరకు తగ్గింది.[39][40]

వాయుమార్గం

మార్చు

నిజామాబాద్‌కు ప్రస్తుతం సొంత విమానాశ్రయం లేదు, అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి వద్ద విమానాశ్రయాన్ని ప్రతిపాదించింది.[41][42] సమీపంలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 200 కి.మీ. దూరంలో ఉంది. పాక్షికంగా పనిచేసే దేశీయ విమానాశ్రయం 110 కి.మీ. దూరంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్‌లో ఉంది. నగరంలోని నాగరం స్టేడియం, పరేడ్ గ్రౌండ్స్, డిచ్‌పల్లి, జిజి కాలేజీ (రెండు) ప్రాంతాలలో 5 హెలిప్యాడ్‌లు ఉన్నాయి.

ఆర్థిక వ్యవస్థ

మార్చు

నగరం యొక్క ఆర్ధికవ్యవస్థ ఎక్కువగా పరిశ్రమలు, ప్రైవేట్ వ్యాపారాలపై ఆధారపడి ఉంది.[43] ఇవి ప్రభుత్వ, ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. చాలా కుటుంబాలకు ప్రధాన ఆదాయ వనరు ప్రభుత్వ ఉద్యోగాలు, గల్ఫ్ దేశాలలో పనిచేయడం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల విభజన తరువాత, వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలైన సారంగ్పూర్, నెహ్రూ నగర్ వంటి ప్రాంతాలలో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసింది.

రియల్ ఎస్టేట్

మార్చు

నిజామాబాదులో రియల్ ఎస్టేట్ ఒక దశాబ్దం నుండి అభివృద్ధి చెందుతోంది.[44] అధిక సంఖ్యలో ఎత్తైన అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు నిర్మాణం చేయబడుతున్నాయి. కొన్నేళ్లుగా నగరం చుట్టూ నిర్మాణాల పెరుగుదల కూడా ఉంది.[45]

వాతావరణం

మార్చు

ఈ నగరం తీరం నుండి చాలా దూరంలో ఉన్నందున, ఉష్ణమండల సవన్నా వాతావరణం వల్ల జూన్ నుండి అక్టోబరు వరకు ఎక్కువ వర్షపాతం ఉంటుంది. శీతాకాలంలో వేసవి కంటే తక్కువ వర్షపాతం ఉంటుంది. మే 2015 నెలలో నిజామాబాదులో 46.1 °C (115.0 °F) నమోదైంది. ఈ వేసవిలో తెలంగాణలో అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రత ఇది.[46] ఉష్ణోగ్రత 5 °C (41 °F) తక్కువగా ఉంటుంది. సగటు 18 °C (64 °F) శీతాకాలంలో, వేసవిలో ఉష్ణోగ్రత 47 °C (117 °F) పెరుగుతుంది. సగటు 46 °C (115 °F). సగటు వార్షిక ఉష్ణోగ్రత 27 °C (81 °F). సగటు వార్షిక వర్షపాతం 1108 మీమీ.[47]

శీతోష్ణస్థితి డేటా - నిజామాబాదు, తెలంగాణ (1981–2010, extremes 1907–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 37.0
(98.6)
39.8
(103.6)
43.3
(109.9)
46.8
(116.2)
47.3
(117.1)
46.3
(115.3)
40.0
(104.0)
39.0
(102.2)
39.0
(102.2)
38.9
(102.0)
37.0
(98.6)
36.4
(97.5)
47.3
(117.1)
సగటు అధిక °C (°F) 30.8
(87.4)
33.6
(92.5)
37.3
(99.1)
40.2
(104.4)
41.6
(106.9)
36.6
(97.9)
31.8
(89.2)
30.6
(87.1)
31.8
(89.2)
32.2
(90.0)
31.0
(87.8)
30.2
(86.4)
34.0
(93.2)
సగటు అల్ప °C (°F) 15.2
(59.4)
17.7
(63.9)
21.2
(70.2)
24.6
(76.3)
27.1
(80.8)
25.1
(77.2)
23.7
(74.7)
23.0
(73.4)
22.9
(73.2)
20.7
(69.3)
17.0
(62.6)
14.2
(57.6)
21.0
(69.8)
అత్యల్ప రికార్డు °C (°F) 4.8
(40.6)
6.1
(43.0)
11.0
(51.8)
12.8
(55.0)
16.0
(60.8)
14.0
(57.2)
13.6
(56.5)
14.0
(57.2)
14.8
(58.6)
8.4
(47.1)
7.0
(44.6)
4.4
(39.9)
4.4
(39.9)
సగటు వర్షపాతం mm (inches) 9.7
(0.38)
4.6
(0.18)
11.8
(0.46)
13.8
(0.54)
17.3
(0.68)
145.8
(5.74)
286.1
(11.26)
295.6
(11.64)
160.0
(6.30)
83.9
(3.30)
12.4
(0.49)
4.8
(0.19)
1,045.7
(41.17)
సగటు వర్షపాతపు రోజులు 0.7 0.4 1.0 1.3 1.8 9.0 13.5 13.2 7.7 3.9 0.8 0.5 53.6
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 42 34 28 25 25 48 67 71 68 60 53 46 47
Source: భారత వాతావరణ శాఖ[48][49]

సంస్కృతి

మార్చు
 
హైదరాబాదీ బిర్యానీ

నిజాంల పాలనలో నిజామాబాదు సంస్కృతి విరసిల్లింది. నగర జనాభాలో ఎక్కువ భాగం హిందువులు, ముస్లింలతో విభిన్న సంస్కృతిని కలిగి ఉంది. ఈ మతాల సమస్వయంతో నిజామాబాదులో వినాయక చవితి, దీపావళి, ఈద్-ఉల్-ఫితర్, ఈదుల్ అజ్ హా వంటి అనేక పండుగలు జరుపుకుంటారు. తెలుగు, ఉర్దూ ఇక్కడి ప్రజలు మాట్లాడే ప్రధాన భాషలు, కమ్యూనికేషన్ కోసం ఇంగ్లీష్ కూడా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. నగరంలో వేర్వేరు మతాల వారు ఉన్నప్పటికీ, నిజామాబాదు ప్రజలు సామరస్యంతో కలిసివుంటారు.[50]

వంటకాలు

మార్చు

నిజామాబాది వంటకాల్లో ప్రధానంగా బియ్యం, గోధుమలు, మాంసం మొదలైన వాటితో వండిన వంటకాలు ఉంటాయి. దోసె, వడ, పూరీ, ఇడ్లీలతో కూడిన దక్షిణ భారత వంటకాలు ఇక్కడి అల్పాహారం వస్తువులు. మొఘలాయ్, అరబ్, తహారీల విధానంలో హైదరాబాదీ బిర్యానీ కూడా ఉంటుంది. హరీస్, హలీమ్, నిహారీ వంటి సాంప్రదాయ ఆహార పదార్థాలు రంజాన్ సందర్భంగా తయారుచేస్తారు.[51][52]

పర్యాటకం

మార్చు

10వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులు నిర్మించిన నిజామాబాద్ కోట ఈ నగరానికి నైరుతి దిశలో ఉంది, ఈ కోటను హైదరాబాద్ నిజాంలు అయిన అసఫ్ జాహిస్ స్వాధీనం చేసుకున్నాడు, ఆ తరువాత ఈ కోటను పునరుద్ధరించారు.[53][54] తిలక్ గార్డెన్ ప్రాంగణంలో 2001 అక్టోబరులో పురావస్తు, వారసత్వ మ్యూజియం ప్రారంభించబడింది. ఈ మ్యూజియంలో పాతరాతియుగం నుండి విజయనగర సామ్రాజ్యం (అనగా 16 వ. AD) వరకు మానవ నాగరికత పరిణామానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ కళాఖండాలు, పురాతన వస్తువులు ఉన్నాయి. మ్యూజియం మూడు విభాగాలుగా విభజించబడింది, 1. పురావస్తు విభాగం, 2. శిల్పకళా గ్యాలరీ, 3. కాంస్య అలంకార గ్యాలరీ. బిద్రి కథనాలు, విస్తృతమైన ఆయుధాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి.[55]

నిజామాబాదుకి 13 కి.మీ., నిజామాబాదు-బోధన్ రహదారికి 2 కి.మీ. దూరంలో అలిసాగర్ ఉద్యానవనం పర్యాటక ప్రాంతంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.[56] ఈ ఉద్యానవనం 33 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇందులో జింకల పార్క్, ట్రెక్కింగ్, వాటర్ స్పోర్ట్స్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇందులో నిజాం నిర్మించిన హిల్‌టాప్ గెస్ట్ హౌస్‌ను కూడా ఉంది. అశోక్ సాగర్ సరస్సు, ఉద్యానవనం, పర్యాటక ప్రాంతం మరో ప్రత్యేక ఆకర్షణ, ఇది జంకంపేట ప్రాంతంలో ఉంది. నగరం మధ్యనుండి 7 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఉద్యానవనంలో ప్రకాశవంతమైన రాళ్ళతో కూడిన రాక్ గార్డెన్, బోటింగ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి.[57] హద్రాత్ సయ్యద్ హుస్సేని జ్ఞాపకార్థం నిర్మించిన పురాతన ముస్లిం యాత్రికుల కేంద్రాలలో బడా పహాడ్ దర్గా ఒకటి. ఇది నిజామాబాదుకు 38 కి.మీ. దూరంలో ఉన్న ఒక కొండపైన ఉంది.

ఇందూరు కళాభారతి

మార్చు

తెలంగాణ ప్రభుత్వం నిజామాబాదు జిల్లా కేంద్రంలో 50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఇందూరు కళాభారతి ఆడిటోరియం డిజైన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం లభించగా, 2023 జనవరి 28వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్, కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్‌ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[58][59]

చదువు

మార్చు
 
విఆర్‌ఇసి, ఎ బ్లాక్, నిజామాబాద్

నిజామాబాదు తెలంగాణలో ఒక ప్రధాన విద్యా కేంద్రం. ఈ నగరంలో 10 ఇంజనీరింగ్ కళాశాలు ఉన్నాయి. హైదరాబాదులోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జెఎన్‌టియుహెచ్) కు అనుబంధ కళాశాల విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల (విఆర్‌ఇసి) నగరంలోని పేరొందిన విద్యాసంస్థ. నిజామాబాదులోని కాకతీయ సంస్థల పాఠశాలలు, కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత స్థానాలను పొందినవిగా గుర్తింపును సంపాధించాయి. నిజామాబాదు ప్రభుత్వ వైద్య కళాశాల,[60] ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ,[61] క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్,[62] కాకతీయ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, గంగా ఫార్మసీ కళాశాల, నిషితా డిగ్రీ కళాశాల మొదలైనవి నగరంలోని ఉన్నత విద్యాసంస్థలు. పొరుగు జిల్లాలైన నాందేడ్, ఆదిలాబాదు, కరీంనగర్ నుండి చాలా మంది విద్యార్థులు తమ ఉన్నత విద్యకోసం ఇక్కడి కళాశాలలకు వస్తారు. ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యను అందించడానికి 2013 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 15 మోడల్ పాఠశాలలను స్థాపించింది.

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో డిచ్‌పల్లి లో తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడింది. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 149 కళాశాల అనుబంధాలు ఉన్నాయి, వీటిలో 86 కళాశాలలు నిజామాబాదు జిల్లాలో ఉండగా, 63 కళాశాలలు ఆదిలాబాదు జిల్లాలో ఉన్నాయి.[63] విద్యార్థులు, ఉపాధ్యాయుల బదిలీల కోసం చికాగో రాష్ట్ర విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం (ఎంఓయు) కూడా చేసుకుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమక్షంలో రెండు విశ్వవిద్యాలయాల అధికారులు ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు.[64]

ఐటీ టవర్

మార్చు

రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశ్యంతో నిజామాబాదు పట్టణంలో 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో 50 కోట్ల వ్యయంతో జీప్లస్‌ 3 అంతస్తులతో తెలంగాణ ప్రభుత్వం నిజామాబాదు ఐటీ టవర్ ను నిర్మించింది. ఈ ఐటీ టవర్‌ను 2023, ఆగస్టు 9న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించి, అందులోని వివిధ కంపెనీల్లో ఎంపికైనవారికి నియామక పత్రాలు అందజేశాడు.[65][66]

జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం

మార్చు

యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు నగరంలోని సమీకృత కలెక్టరేట్‌ భవనం, ఐటీ టవర్‌కు ఆనుకొని 37,557 చదరపు అడుగుల విస్తీర్ణంలో 6.15 కోట్ల రూపాయలతో జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ సెంటర్‌) ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. జీ ప్లస్‌ 2 పద్ధతిలో ప్రతి అంతస్తు 12,519 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంలో ఐదు స్మార్ట్‌ క్లాస్‌ గదులు, మూడు ప్రయోగశాలలు, 1 కంప్యూటర్‌ ల్యాబ్‌, 120 మంది అభ్యర్థులకు వసతి, భోజన సౌకర్యానికి వీలుగా వసతి గృహం, 1 కౌన్సిలింగ్‌ గది, 1 ప్లేస్‌మెంట్‌ రూమ్‌, 8 కార్యాలయ గదులు ఉన్నాయి. ఈ కేంద్రంలో మేసన్‌ జనరల్‌, అసిస్టెంట్‌ బార్‌ బెండర్‌ అండ్‌ స్టీల్‌ ఫిక్చర్‌, షట్టరింగ్‌ కార్పెంటరీ, కన్‌స్ట్రక్షన్‌ పెయింటర్‌ అండ్‌ డెకొరేటర్‌, అసిస్టెంట్‌ టెక్నీషియన్‌ డ్రై వాల్‌ అండ్‌ ఫాల్స్‌ – సీలింగ్‌, అసిస్టెంట్‌ ఎలక్ట్రిషన్‌, ప్లంబర్‌(జనరల్‌), అసిస్టెంట్‌ సర్వేయర్‌, అసిస్టెంట్‌ వర్క్‌ సూపర్‌వైజర్‌, ఆర్క్‌ అండ్‌ గ్యాస్‌ వెల్డర్‌, అసిస్టెంట్‌ స్టోర్‌ కీపర్‌ అండ్‌ స్టోర్‌ కీపర్‌, సూపర్‌వైజర్‌ స్ట్రక్చర్‌, టైలరింగ్‌ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. దీనిని 2023, ఆగస్టు 9న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు.[67]

ప్రముఖ వ్యక్తులు

మార్చు

నగరం కాకుండా నిజామాబాద్ జిల్లా ప్రజల కోసం, దయచేసి నిజామాబాద్ జిల్లా చూడండి.

ఇతర వివరాలు

మార్చు

ఇక్కడ నిజామాబాదు వ్యవసాయ మార్కెట్ కూడా ఉంది.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 June 2016. Retrieved 1 September 2020.
  2. "About Nizamabad". Nizamabad Municipal Corporation. Archived from the original on 23 June 2019. Retrieved 1 September 2020.
  3. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  4. "Nizamabad district". Telangana State Portal. Retrieved 1 September 2020.
  5. ":: Welcome to Nizamabd.com". thenizamabad.org. Archived from the original on 2020-07-29. Retrieved 2020-09-01.
  6. "History of Indur". nizamabad.nic.in. Archived from the original on 19 June 2015. Retrieved 1 September 2020.
  7. Students' Britannica India, Volumes 1-5. Popular Prakashan. 2000. p. 117. ISBN 978-0-85229-760-5.
  8. Maharashtra State Gazetteers: Nanded. Director of Government Printing, Stationery and Publications, Maharashtra State. 1971. pp. 4, 576.
  9. Guruswamy, Mohan. "Police Action". Hyderabad on the Net. Archived from the original on 24 డిసెంబరు 2018. Retrieved 1 September 2020.
  10. Babu, Prof K. Vijaya; Gade, Jayaprakashnarayana (2014-03-12). Tourism in India. ISBN 9788192681979.
  11. "Welcome to Telangana Focus.com". Archived from the original on 4 March 2016. Retrieved 1 September 2020.
  12. "Falling Rain Genomics, Inc – Nizamabād". Fallingrain.com. Retrieved 3 September 2020.
  13. "Archived copy". Archived from the original on 18 October 2016. Retrieved 3 September 2020.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  14. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-02-12. Retrieved 2020-09-02.
  15. "Page Redirection". data.gov.in.
  16. "Language and mother tongues:Town Level data". Census India.
  17. "Nizamabad City Population Census 2011 – Andhra Pradesh".
  18. 18.0 18.1 "GO released to set up Nizamabad Urban Development Authority".
  19. "Merger of 13 Nizamabad villages on the cards". 2018-01-24.
  20. "Nizamabad Urban Assembly constituency profile".
  21. "Nizamabad Rural Assembly constituency profile".
  22. "Basic Information of Corporation | Nizamabad Corporation". mcnizamabad.in. Archived from the original on 27 March 2016. Retrieved 3 September 2020.
  23. "Telangana State Portal MeeSeva Services". telangana.gov.in.
  24. Our Bureau. "AP to offer 331 Mee Seva services by Oct". The Hindu Business Line.
  25. Special Correspondent (2015-05-21). "Vizag passport office to cater to Guntur, Krishna, Yanam". The Hindu.
  26. "Districts realigned under Visakhapatnam, Hyderabad passport offices". The Times of India.
  27. "Regional Passport Office to re-align districts".
  28. "CCTVs lie unused in Nizamabad". The Hindu. 4 December 2014. Archived from the original on 7 May 2015. Retrieved 3 September 2020.
  29. "State Government Seeks Rs 750 Cr from Centre for Pushkarams". The New Indian Express. 19 March 2015. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 3 September 2020.
  30. "Hospitals and Clinics in Nizamabad List One". rainrays.com. Archived from the original on 2020-08-06. Retrieved 2020-09-03.
  31. telugu, NT News (2022-09-06). "నిజామాబాద్‌లో కొత్త కలెక్టరేట్‌". Namasthe Telangana. Archived from the original on 2022-09-06. Retrieved 2022-09-07.
  32. Velugu, V6 (2022-09-05). "కలెక్టరేట్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్". V6 Velugu. Archived from the original on 2022-09-07. Retrieved 2022-09-07.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  33. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 September 2020.
  34. "{title}" (PDF). Archived from the original (PDF) on 20 January 2013. Retrieved 3 September 2020.
  35. "National Highways in Telangana State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 18 మే 2017. Retrieved 3 September 2020.
  36. "Roads | Nizamabad Corporation". mcnizamabad.in. Archived from the original on 30 మార్చి 2018. Retrieved 3 September 2020.
  37. "Bus Stations in Districts". Andhra Pradesh State Road Transport Corporation. Archived from the original on 10 జూన్ 2016. Retrieved 3 September 2020.
  38. "RTC bus stand becomes smokers' haven". The Hans India. 24 August 2016. Retrieved 3 September 2020.
  39. "Press Release". South Central Railway Zone. Indian Railways. Retrieved 3 September 2020.
  40. "Rail budget boost to 2 last-mile projects". The Times of India. 28 February 2016. Retrieved 3 September 2020.
  41. https://timesofindia.indiatimes.com/city/hyderabad/t-govt-to-develop-6-airports/articleshow/70284276.cms
  42. https://www.thehindu.com/news/cities/Hyderabad/jubilation-in-nizamabad-over-airport-proposal/article29121799.ece
  43. dcmsme.gov.in/dips/amended%20%20nizamabad.pdf
  44. "Nizamabad Master Plans". Master Plans India. Archived from the original on 2018-01-15. Retrieved 2020-09-03.
  45. "D I S T R I C T – P R O F I L E". nizamabad.nic.in. Archived from the original on 6 November 2015. Retrieved 3 September 2020.
  46. Special Correspondent (2015-05-19). "Nizamabad sizzles at 46.1 degree Celsius". The Hindu.
  47. "Climate: Nizamabad". climate-data.org.
  48. "Station: Nizamabad Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 563–564. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 3 September 2020.
  49. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M17. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 3 September 2020.
  50. "Nizamabad Tourism, Travel Guide & Tourist Places in Nizamabad – Native Planet". nativeplanet.com. Retrieved 5 September 2020.
  51. "Hyderabad's old city comes alive as Ramadan begins". twocircles.net. Retrieved 5 September 2020.
  52. P. Ram Mohan. "Shopping mania grips Nizamabad". The Hindu. Retrieved 5 September 2020.
  53. "Quilla Ramalayam". india9.com. Retrieved 5 September 2020.
  54. "Nizamabad Quilla Ramalayam – Raghunath Temple Photos". Go Nizamabad. Archived from the original on 11 July 2015. Retrieved 5 September 2020.
  55. "Welcome to Telangana Focus.com". Archived from the original on 4 March 2016. Retrieved 5 September 2020.
  56. "Indur Tourism". Official website of Nizamabad district. Archived from the original on 20 October 2015. Retrieved 5 September 2020.
  57. Special Correspondent. "Ecotourism to be developed in Nizamabad". The Hindu. Retrieved 5 September 2020.
  58. telugu, NT News (2023-01-27). "ఇందూరు సిగలో మరో మణిహారం". www.ntnews.com. Archived from the original on 2023-01-27. Retrieved 2023-01-28.
  59. India, The Hans (2023-01-26). "Construction of 'Kala Bharati' to showcase Induru's glory". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-01-26. Retrieved 2023-01-28.
  60. "Nizamabad Medical College". gmcnzbd.org. Archived from the original on 7 జూన్ 2014. Retrieved 5 September 2020.
  61. "Arkay College of Engineering & Technology". arkaycollege.com. Archived from the original on 7 March 2016. Retrieved 5 September 2020.
  62. "Welcome to Kshatriya College of Engineering". kcea.ac.in. Archived from the original on 5 ఆగస్టు 2020. Retrieved 5 September 2020.
  63. "About Telangana University". Telangana University. Archived from the original on 25 June 2015. Retrieved 5 September 2020.
  64. "Exchange of students". The Hindu. Retrieved 5 September 2020.
  65. Pavan (2023-08-09). "KTR inaugurates IT Tower in Nizamabad, interacts with employees". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-08-09. Retrieved 2023-08-12.
  66. Latha, Suma (2023-08-09). "నిజామాబాద్‌ ఐటీ టవర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌". Vaartha. Archived from the original on 2023-08-09. Retrieved 2023-08-12.
  67. telugu, NT News (2023-08-09). "Minister KTR | నిజామాబాద్‌ ఐటీ టవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-08-10. Retrieved 2023-08-12.

బాహ్య లింకులు

మార్చు

ఇతర లంకెలు

మార్చు