తెలవారదేమో స్వామీ (పాట)

(తెలవారదేమో స్వామీ నుండి దారిమార్పు చెందింది)

తెలవారదేమో స్వామీ పాట 1987లో విడుదలైన శ్రుతిలయలు చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. కె.వి. మహదేవన్ సంగీతం అందించిన ఈ పాటను జేసుదాసు పాడాడు.[1]

"తెలవారదేమో స్వామీ"
Thelavaradhemo.JPG
తెలవారదేమో స్వామీ పాటలోని దృశ్యం
రచయితసిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతంకె.వి. మహదేవన్
సాహిత్యంసిరివెన్నెల సీతారామశాస్త్రి
ప్రచురణశ్రుతిలయలు (1987)
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
గాయకుడు/గాయనిజేసుదాసు

పాటలోని సాహిత్యంసవరించు

పల్లవి:
తెలవారదేమో స్వామీ తెలవారదేమో స్వామీ
నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలుమంగకూ
తెలవారదేమో స్వామీ
నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలుమంగకూ
తెలవారదేమో స్వామీ

చరణం 1:
చెలువమునేలగా చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు ||2||
కలల అలజడికి నిద్దుర కరవై ||2||
అలసిన దేవేరి.. అలసిన దేవేరి.. అలమేలుమంగకూ ||తెలవారదేమో స్వామీ||

పురస్కారాలుసవరించు

  1. సిరివెన్నెల సీతారామశాస్త్రి - ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారాలు - 1987.

మూలాలుసవరించు

  1. హెచ్ఎంటివి, మిక్చర్ పొట్లం (24 November 2018). "సంగీతం... సాహిత్యం...సరిపాళ్ళలో కలిస్తే!". Archived from the original on 22 December 2020. Retrieved 22 December 2020.