తెలవారదేమో స్వామీ (పాట)
తెలవారదేమో స్వామీ పాట 1987లో విడుదలైన శ్రుతిలయలు చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. కె.వి. మహదేవన్ సంగీతం అందించిన ఈ పాటను జేసుదాసు పాడాడు.[1]
"తెలవారదేమో స్వామీ" | |
---|---|
రచయిత | సిరివెన్నెల సీతారామశాస్త్రి |
సంగీతం | కె.వి. మహదేవన్ |
సాహిత్యం | సిరివెన్నెల సీతారామశాస్త్రి |
ప్రచురణ | శ్రుతిలయలు (1987) |
రచింపబడిన ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
భాష | తెలుగు |
గాయకుడు/గాయని | జేసుదాసు |
పాటలోని సాహిత్యం
మార్చుపల్లవి:
తెలవారదేమో స్వామీ తెలవారదేమో స్వామీ
నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలుమంగకూ
తెలవారదేమో స్వామీ
నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలుమంగకూ
తెలవారదేమో స్వామీ
చరణం 1:
చెలువమునేలగా చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు ||2||
కలల అలజడికి నిద్దుర కరవై ||2||
అలసిన దేవేరి.. అలసిన దేవేరి.. అలమేలుమంగకూ ||తెలవారదేమో స్వామీ||
పురస్కారాలు
మార్చు- సిరివెన్నెల సీతారామశాస్త్రి - ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారాలు - 1987.
మూలాలు
మార్చు- ↑ హెచ్ఎంటివి, మిక్చర్ పొట్లం (24 November 2018). "సంగీతం... సాహిత్యం...సరిపాళ్ళలో కలిస్తే!". Archived from the original on 22 December 2020. Retrieved 22 December 2020.