సాధారణంగా తెలుగు వారి ప్రవర్తనలో కనిపించే అలవాట్లనూ, వాళ్ళు పాటించే ఆచారాలను తెలుగుదనాలు అంటారు.

తెలుగు తల్లి విగ్రహం

విశేషాలు

మార్చు
 
లంగా జాకెట్టు వస్త్రధారణలో బాలికలు

వస్త్రధారణ

మార్చు

లంగా ఓణి లతో ఉన్న అమ్మాయిని చూసి తెలుగుదనం ఉట్టి పడుతుంది అంటారు, రూపాయికి వంద పైసలు లేదా పదహారు అణాలు అందువల్ల వందశాతం తెలుగుదనంతో అచ్చమైన తెలుగు సంస్కృతి అలవాట్లు కలబోసుకున్న తెలుగు అమ్మాయిని ‘పదహారణాల తెలుగమ్మాయి’ అంటారు.

పురుషులు ధోవతులుచొక్కాలు,  ఆడవాళ్ళూ చీరలు రవికెలు వస్త్రధారణ చేయడం తెలుగు వారి సంప్రదాయాలలో ఉంది.

తెలుగు భాష పూర్వ ఔన్నత్యం అన్నప్పుడు మనకు గిడుగు రామమూర్తి గారు కందుకూరి , గురజాడ ,రాయప్రోలు, దేవులపల్లి, జాషువా వీరందరూ మనసులో మెదులుతారు. వారందరు ధోవతులు, చొక్కాలు ధరించిన వారే.[1] తెలుగు భాషాభిమానం సాంప్రదాయ వేషభాషలతో మొదలవుతుంది. ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవిని పొందినా సరే తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయక ధోవతి, చొక్కాను ధరిస్తాడు. సుభాష్ చంద్రబోస్ కూడా కొన్ని సమయాలలో ధోవతి కట్టేవాడు.

ఆచారాలు, సాంప్రదాయాలు

మార్చు

తెలుగు వారు తమ గడపలకు పసుపు రాయడం, ఇంటి ముందర ముగ్గులు పెట్టడం, గుమ్మానికి తోరణాలు కట్టడం, కుంకుమ బొట్టు పెట్టుకోవడం, సాంప్రదాయక దుస్తులు ధరించడం వంటి ఆచారాలు ఉన్నాయి. పెద్దలు కనపడం  గానే నమస్కారం చేయటం .బయటనుంచి వచ్చినపుడు కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రావటం మొదలైనవి కూడా తెలుగు వారి సంప్రదాయాలే. కవిత్వం అంటే  పద్యాలలోనే రాయాలి. వ్యాకరణం పాటించాలి.

ఆహార పదార్థాలు

మార్చు

తెలుగువారి అచ్చతెలుగుదనం తెలుగు వారి వంటకాల్లోనే ఉట్టిపడుతూ ఉంటుంది. మనవంటకాల్లోనే మనప్రత్యేకత ఉందన్న విషయం దృఢంగా తెలియాలంటే తెలుగు వారి తినుబండారాలు తినడం చేతనవాలి. తెలుగు వారు గర్వించదగ్గ వంటకాలు ఏవని అడిగితే ఎవరైనా ఇడ్లీ, మసాలాదోసె వంటి అనేక వంటకాల పేర్లు చెబుతారు. కానీ తెలుగువారిని గుర్తించే వంటకం "దిబ్బరొట్టె". ఇప్పుడు ఈ దిబ్బరొట్టెని కొన్ని మార్పులు చేసి "ఊతప్పం" గా దక్షిణాదివారు మార్చారు. ఇప్పుడు తెలుగువాళ్ళకి ఊతప్పమే తెలుసు గానీ దిబ్బరొట్టె తెలియకుండా పోయింది.[2]

పెసరట్టు తెలుగు వాడి తినుబండారం. పెసరట్టులోనే తెలుగుదనం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. తెలుగు వాడు తప్ప మరొకడు వండలేనిది పెసరట్టు. పెసరట్టు ఏలూరులో పవరుపేట లో పుట్టింది. కాలవ ఒడ్డున కాకి వారి వీధిలో పెసరట్ల రామయ్య గారి కొట్లో పెసరట్టు పుట్టింది. కాలానుగుణ్యంగా పెసరట్టు ఇతర కోస్తా జిల్లాల వాళ్ళకి అలవాటయ్యింది.[2]

ఊరగాయలు తినడం ఒక ముఖ్య తెలుగుదనం. ఎక్కడున్నా సరే, తెలుగువారు తినడానికి ఊరగాయల కొరకు ఉవ్విళ్ళూరుతుంటారు. ఇంకొక ప్రాంతంలో కానీ, దేశంలో కానీ స్థిరపడడానికి వెళ్తున్నా తెలుగువారు తమ ఊరగాయలని తప్పకుండా తమతో తీసుకు వెళ్తారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే తెలుగువారు నివసించడం మొదలుపెడితే, ఆ ప్రాంతంలో త్వరలో ఊరగాయ సీసాలు అమ్మే షాపులు వెలుస్తాయని కచ్చితంగా చెప్పవచ్చు.

పండగలు

మార్చు

పండుగ పూట వేకువనే లేచి సున్నిపిండితో నలుగు పెట్టుకుని తలంటు పోసుకోవడం తెలుగువారి సంప్రదాయం. చలిపొద్దులు, గంగిరెద్దులు, భోగిమంటలు, తలంటులు, పిండివంటలు, జడగంటలు, కొత్త పంటలు, హరిదాసులు, గొబ్బెమ్మలు, బంతిపూలు, భోగిపళ్లు, పాశురాలు, దాసరి కీర్తనలు, పిళ్ళారి ఆరగింపులు, సాతాని జియ్యర్లు, రంగవల్లులు, రథం ముగ్గులు, బొమ్మల కొలువులు అన్నీ కలిస్తే... సంక్రాంతి[3].

కనుమరుగవుతున్న తెలుగుదనం

మార్చు

అత్తయ్య, మావయ్య, తాతయ్య, బాబయ్య, బామ్మ, పిన్ని వంటి కమ్మని వరుసలలో బంధువులని పిలుచుకోవడం తెలుగువారి సంప్రదాయం. బంధువుల వరస లేమిటి, అమ్మ అన్న కమ్మని పిలుపే నేడు కరువయింది. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లతోనే తప్ప- పిచ్చుకలు, పావురాలు, తూనీగలు, గోరువంకలు, లేగదూడలు, కుక్కపిల్లల వంటి సజీవ సహజీవులతో సావాసాలను బాల్యం మరిచేపోయింది. అసలవి మానవ పరివారంలోంచే తప్పుకొన్నాయి. చెట్లతో, ఏటిగట్లతో, పైరగాలితో స్నేహం చెడిపోయింది. పసివాళ్ల బతుకులు బోన్‌సాయి మొక్కలైపోయాయి. మొదళ్లు గిడసబారిపోయాయి. నిరంతరం యంత్రాలతోనే గడిపేస్తూ, పిల్లలు తామూ వాటిలో భాగం అయిపోతున్నారు. మాతృభాషలో విద్యాబోధన ఏ దశలోంచి కరవైపోయిందో అప్పుడే విద్యావ్యవస్థలోంచి తెలుగుదనం తప్పుకొంది. పసితనంలోనే ఆదర్శ జీవనానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి, సంస్కార వికాసానికి దోహదం కూర్చే శతక వాఞ్మయం వూసే లేకుండాపోయింది. వ్యవస్థలో నైతిక విద్యార్జన, బోధన అడుగంటిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే- మన తిండి మనది కాదు. మన ఆలోచనలు మనవి కావు. మన మాటలు మనవి కావు. మన సినిమాలు మనవి కావు. మన బతుకే మనది కాకుండాపోయింది. అన్నింటా తెలుగుదనాన్ని, మనల్ని మనమే పోగొట్టుకుంటున్నాం.[4]

తెలుగుదనం పెంచే అంశాలు

మార్చు

సభల్లో, సమావేశాల్లో, ఉత్సవాల్లో తెలుగుజాతి ప్రత్యేక కళారూపాన్నొకదాన్ని విధిగా వ్యాప్తిలోకి తేవాలి. స్వచ్ఛమైన జానపద సాహిత్యం, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, విభిన్నమైన కట్టుబాట్లను పునరుద్ధరించాలి. వారి ఔషధ విజ్ఞానం ప్రాచుర్యంలోకి రావాలి.

ఇతరములు

మార్చు

కోతికొమ్మచ్చులు, గోటింబిళ్లలు, గోదారీతలు, ఇసుకగుళ్లు, పాకంజీళ్లు, పప్పుబెల్లాలు, తొక్కుడుబిళ్లలు, వామనగుంటలు, వల్లంకి పిట్టలు, పట్టుపరికిణీలు, వెండిపట్టీలు, వైకుంఠపాళీలు, రుక్మిణీ కల్యాణాలు...వంటివి తెలుగువారి సంప్రదాయక విధానాలు.

సినిమాలలో తెలుగుదనం

మార్చు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడే సన్నివేశాలున్నాయి. ఈ సినిమా అనే పేరు వినగానే తెలుగు కొంగొత్తగా గుభాళించినట్టు  అనిపించింది చిత్రసీమకు.[5]

తెలుగుదనాలకి సంబంధించిన ఆరోపాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "తెలుగుదనం లేకుండా తెలుగు భాషను కాపాడలేం". Asianet News Network Pvt Ltd. Retrieved 2020-05-15.
  2. 2.0 2.1 "తెలుగుదనం". www.eemaata.com. Archived from the original on 2021-03-09. Retrieved 2020-05-15.
  3. "తరతరాల తెలుగుదనం... కోల్పోతున్నాం మనం | తెలుగుబిడ్డ". www.telugubidda.in. Retrieved 2020-05-15.
  4. "తరతరాల తెలుగుదనం... కోల్పోతున్నాం మనం | తెలుగుబిడ్డ". www.telugubidda.in. Retrieved 2020-05-15.
  5. "తెలుగుదనం... అదే కదా అందం!". m.eenadu.net. Retrieved 2020-05-15.[permanent dead link]

బాహ్య లంకెలు

మార్చు