తలపాగా (ఆంగ్లము: turban, కొన్ని సంస్కృతులలో బుల్లే లేదా దస్తర్) అనునది తలని చుట్లతో కప్పే ఒక వస్త్రము. దీనిని ధరించే విధానాలు వేర్వేరుగా ఉంటాయి. తలపాగా, పైపంచ (ఉత్తరీయం) అనేవి గ్రామీణప్రాంత ఆంధ్రులకు తప్పనిసరి. తలపాగా అనేది రోజువారీ పనులలోనే కాకుండా శుభకార్యాలలోను, ఉత్సవాలలోను తప్పనిసరిగా ధరిస్తారు. ఆంధ్రుని ఆహార్యమంటే పంచకట్టు, లాల్చీలాంటి చొక్కా, పైపంచ, తలపాగా .

రాజస్థానీ తలపాగా చుట్టుకొనే విధానం.

తలపాగా తయారీ

మార్చు

తలపాగాలలో ముఖ్యంగా మూడురకాలు ఉన్నాయి. అవి

  • సిల్కు తలరుమాళ్ళు
  • నేత రుమాళ్ళు
  • ముల్లు గుడ్డలు

దీని తయారీ యంత్రాలపై, మగ్గం పైనా జరుగుతుంది. ఒక్క ఆంధ్రప్రాంతంలోనే కాక దేశమంతా యంత్రాలపై నేయబడే గుడ్డలను కాక చేనేత తలగుడ్డలనే వాడేందుకు ఆసక్తి చూపుతారు. దీనిని తయారు చేసేందుకు ఏ మగ్గం అయినా పనికి వస్తుంది. ఇవి సామాన్యంగా పొడవు ఎక్కువ వెడల్పు తక్కువగా ఉంటాయి.

ఇక ప్రత్యేక తరహా తలగుడ్డల కొరకు ప్రత్యేక మగ్గాలు వాడుతారు ఇవి చీరలా అత్యంత పొడవు, వెడల్పులు కలిగి ఉంటాయి. వీటిని గుజరాతీలు, పంజాబీలు, బీహారీలు అధికంగా వాడుతారు.

తలపాగా వినియోగం

మార్చు
  • దీనిని అధికంగా భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో వాడుతున్నా తప్పని సరిగా వాడుకలో ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో. తరువాత బీహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కువ వాడుతారు. ఇక్కడ సిక్కులు మతపరంగా తలపాగా ధరిస్తారు. దీనిని టర్బన్ అంటారు.
  • ఏ ప్రాంతములో నైనా శుభకార్యములప్పుడు వస్త్రములు బహుమతిగా ఇవ్వవలసి వచ్చినపుడు దీనిని జతపరచి ఇవ్వడం ఆనవాయితీ.
  • వేసవి కాలంలో, వర్షా కాలాలలో గ్రామ ప్రాంతాలలో దీనిని శరీర రక్షణగా వాడుతుంటారు.
  • ఊరు వెళ్ళేటపుడు, పనులకు బయటకు వెళ్ళేటపుడు, ముఖ్యంగా పొలంపనులకు దీని వినియోగం అధికం.

ఇవి కూడా చూడండి

మార్చు

వెలుపలి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=తలపాగా&oldid=4055297" నుండి వెలికితీశారు