తెలుగు-తెలుగు నిఘంటువు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
తెలుగు-తెలుగు నిఘంటువు (ఆంగ్లం: Telugu-Telugu Dictionary) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు అకాడమి వారు ప్రచురించిన నిఘంటువు.
తెలుగు-తెలుగు నిఘంటువు | |
పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | |
---|---|
అసలు పేరు (తెలుగులో లేకపోతే): | p more |
సంపాదకులు: | బూదరాజు రాధాకృష్ణ |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నిఘంటువు |
ప్రచురణ: | తెలుగు అకాడమి |
విడుదల: | 2001 |
పేజీలు: | 1100 |
తెలుగు అకాడమి వారు తెలుగు భాషకు ఒక సమగ్ర నిఘంటువు ప్రచురించాలనే లక్ష్యంతో "తెలుగు శబ్ద సాగరం" అనే పేరిట ఒక బృహన్నిఘంటువు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నిఘంటువు నుంచి దాదాపు 65,000 ఆరోపాలు ఎంపిక చేసి కళాశాల స్థాయి విద్యార్థుల కోసం తెలుగు-తెలుగు నిఘంటువు పేరిట ఒక చిన్న నిఘంటువును ముందుగా ప్రచురించాలని అకాడమి సంకల్పించింది. దీనికి ప్రధాన ఆకర గ్రంథాలు: శబ్దరత్నాకరం, ఆంధ్ర శబ్దరత్నాకరం, శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు. అకాడమి ప్రచురించిన ఆయా శాస్త్రాల పారిభాషిక పదకోశాల నుండి ఇటీవల ప్రచురించిన భాషా సాహిత్యాలకు సంబంధించిన ఇతర రచనల నుండి ఆరోపాలను ఎంపిక చేశారు. ఆధునిక వ్యవహారంలో వున్న న్యాయాలు, పదబంధాలు సాధ్యమైనంత వరకు ఆధునిక వివరణలతో చేర్చడం జరిగింది. విద్యార్థులకు తక్షణ సంప్రదింపు కోసం తెలుగు సంవత్సరాలు, తెలుగు నెలలు, సంఖ్యావాచకాలతో కూడిన సప్తర్షులు, అష్టైశ్వర్యములు వంటి పదబంధాలు చేర్చారు.
ఈ నిఘంటువు పని డా. బూదరాజు రాధాకృష్ణ పర్యవేక్షణలో డా. జి. చెన్నకేశవరెడ్డి, డా. ఎ. మంజులత, డా. ఎం. ప్రమీలారెడ్డి, డా. ఎ. పాండయ్య, డా. ఎ. వి. పద్మాకరరెడ్డి పనిచేశారు. తరువాతి దశలో ఈ నిఘంటువును డా. అక్కిరాజు రమాపతిరావు, డా. జి. చెన్నకేశవరెడ్డి, డా. ఎం. ప్రమీలారెడ్డి పర్యవేక్షించారు. డా. రమాపతిరావు పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఉషా పన్నాల, డా. కె. లక్ష్మీనారాయణశర్మ కూడా ఈ నిఘంటువులో పనిచేశారు. డా. జి. చెన్నకేశవరెడ్డి పర్యవేక్షణ కాలం నుండి డా. ఎం. మాణిక్య లక్ష్మి ఈ నిఘంటువులో పనిచేస్తూ వచ్చారు.