తెలుగు ప్రేమ ప్రచారక్

తెలుగు ప్రేమ ప్రచారక్ అనే ధార్మిక వారపత్రిక 1934లో ప్రారంభమైంది.

తెలుగు ప్రేమప్రచారక్
సంపాదకులువి.రామబ్రహ్మం
వర్గాలుధార్మికపత్రిక
తరచుదనంవారపత్రిక
మొదటి సంచిక1934
సంస్థది ఆంధ్రా సత్సంగ్ అసోసియేషన్
దేశం India
భాషతెలుగు

విశేషాలు మార్చు

ఆంధ్ర సత్సంగ్ అసోసియేషన్ తరఫున భీమవరం నుండి ఈ పారమార్థిక వారపత్రిక వెలువడింది. వి.రామబ్రహ్మం ఈ పత్రికకు సంపాదకులు. డి.బుచ్చినారాయణమూర్తి ఈ పత్రిక ముద్రాపకుడు. కళానిధి ముద్రణాలయంలో ముద్రించబడింది. దయాల్బాగ్‌లోని రాధాసామి సత్సంగ సభ ప్రచారానికి సంబంధించిన విషయాలు ఈ పత్రికలో ఉన్నాయి. ఈ పత్రికలో వార్తలు - విశేషములు, యదార్థ ప్రకాష్, ప్రేమవిలాస్, ప్రేమపత్ర, అమృతలేఖ మొదలైన అనువాద రచనలు, సాహెబ్జీ మహరాజ్ వారి అమృత వచనములు మొదలైన శీర్షికలతో పాటు స్థానిక కోర్టు ప్రకటనలు ఉన్నాయి. ఈ పత్రిక ధర విడి సంచిక 1 అణా 6 పైసలు, వార్షిక చందా 3 రూపాయల 12 అణాలుగా పేర్కొన్నారు. ఈ పత్రిక 4 సంవత్సరాలకు పైగా నడిచింది[1].

మూలాలు మార్చు